News


రూ.260 పెరిగిన పసిడి

Saturday 18th January 2020
Markets_main1579327096.png-31013

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో శుక్రవారం 10గ్రాముల పసిడి ధర రూ.260లు లాభపడింది. చైనా 2019లో  వృద్ధి 29 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.1 శాతానికి పడిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు కొనుగోలు మద్దతు లభించింది. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 17 పైసలు బలహీనపడటం దేశీయ పసిడి ప్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర మునుపటి ముగింపు(రూ.39686)తో పోలిస్తే రూ.260 పెరిగి రూ.39946.00 వద్ద స్థిరపడింది. వారం ప్రాతిపాదికన పసిడి స్వల్పంగా రూ.75లు మాత్రమే లాభపడింది. 
అంతర్జాతీయ మార్కెట్లో 10డాలర్ల లాభం:-
అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్ల ధర శుక్రవారం 10డాలర్ల పెరిగి 1,560.30డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ ధర పసిడి ఫ్యూచర్లకి 10రోజుల గరిష్టస్థాయి కావడం విశేషం. అయితే వారం ప్రాతిపదికన కేవలం 20 సెంట్లు మాత్రమే లాభపడింది. అమెరికా, చైనాలు విడుదలు చేసి బలమైన ఆర్థిక గణాంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలను తగ్గించడం పసిడికి ఈ వారంలో డిమాండ్‌ను తగ్గించాయి. అయినప్పటికీ పసిడికి వరుసగా నాలుగో వారం లాభాల ముగింపు కావడం విశేషం. ఈ 4వారాల్లో పసిడి ధర మొత్తం 79.40డాలర్లు లాభపడింది. ఒక ఈ 2020 ఏడాది ప్రారంభం నుంచి శుక్రవారం రాత్రి ముగింపు వరకు పసిడి ప్యూచర్లు 2.40శాతం ర్యాలీ చేశాయి. అమెరికా చైనాల జరిగిన తొలిదశ వాణిజ్య ఒప్పందం బంగారానికి కొంత డిమాండ్‌ను తగ్గించింది. స్టాక్‌ మార్కెట్లు రికార్డు స్థాయిని తాకడం, డాలర్‌ స్థిరీకరణతో స్వల్పకాలంలో బంగారం మరింత బలహీనపడే అవకాశం ఉంది. 1500డాలర్ల వద్ద పసిడికి కీలకమైన నిరోధస్థాయి కలిగి ఉందని బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 



You may be interested

మిడ్‌,స్మాల్‌ క్యాప్స్‌ నుంచి మంచి రాబడులు

Saturday 18th January 2020

రానున్న 3-4 ఏళ్లలో మధ్య, చిన్నతరహా కౌంటర్లదే జోరు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పీఎంఎస్‌ నిపుణులు పరాగ్‌ థక్కర్‌ అంచనా రెండేళ్ల క్రితం స్మాల్‌ క్యాప్స్‌లో ర్యాలీ చివరి దశకు చేరుకున్నదని ప్రకటించడం ద్వారా కచ్చితమైన అంచనాలు ప్రకటించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పీఎంఎస్‌ నిపుణులు పరాగ్‌ థక్కర్‌ తాజాగా.. యూటర్న్‌ తీసుకున్నారు. ఇకపై మళ్లీ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ అత్యధిక రిటర్నులు ఇచ్చే వీలున్నట్లు చెబుతున్నారు. ఒక అంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా

టెల్కోలకు ప్రభుత్వ సాయం: ఆర్‌బీఐ సూచన

Saturday 18th January 2020

మొండి బకాయిల సమస్య తలెత్తే అవకాశం టెలికం కంపెనీలకు భారీగా బ్యాంకు రుణాలు  బకాయిల జాబితాలో పీఎస్‌యూలకూ చోటు సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిల చెల్లింపులకు సంబంధించి టెలికం కంపెనీలకు కొంతమేర ఉపశమనాన్ని కల్పించవలసిందిగా రిజర్వ్‌ బ్యాంకు.. కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. మొండిబకాయిల(ఎన్‌పీఏలు) సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ.. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులపై తాత్కాలిక నిలిపివేత(మారటోరియం)ను ప్రకటించాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ భారీ ఎన్‌పీఏలతో కుదేలైన

Most from this category