News


పదిగ్రాముల బంగారం రూ. 50వేలు దాటేస్తుందా?!

Tuesday 5th November 2019
Markets_main1572932711.png-29361

టెక్నికల్‌ నిపుణుల అంచనా
బుల్లిష్‌గా మారిన బడా బ్యాంకులు
పసిడి ధరలో ర్యాలీ మరింతగా కొనసాగుతుందని, క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2100 డాలర్ల వరకు దూసుకుపోవచ్చని ప్రముఖ కమోడిటీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బడా బ్యాంకులు బంగారంపై పాజిటివ్‌గా మారడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఈ అంచనాలు వాస్తవరూపం దాలిస్తే భారత్‌లో రూపాయి మారకపు విలువ ప్రస్తుత స్థాయి 71 వద్దే వుంటే...10 గ్రాముల ధర దాదాపు రూ. 52,000కు ( దిగుమతి సుంకంతో కలుపుకుని) చేరుతుంది. గత కొన్నేళ్లుగా బంగారం మార్కెట్‌ ఫండమెంటల్స్‌ మెరుగుపడుతూ వస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు పుత్తడిపై బేరిష్‌గా ఉన్న పెద్దపెద్ద బ్రోకరేజ్‌లు తాజాగా తమ అంచనాలను మార్చుకుంటున్నాయి. ఈ సంస్థల బేరిష్‌ ధోరణి కారణంగా 2013- 2015 కాలంలో బంగారం ధరలో భారీ పతనం వచ్చింది. 2013లో గోల్డ్‌మాన్‌ శాక్స్‌ బంగారంపై అమ్మొచ్చు రేటింగ్‌ ఇచ్చింది. తాజాగా ఈ ధోరణి మార్చుకొని ‘ కేంద్రబ్యాంకులు పసిడి కొనుగోళ్లు పెంచడంతో బంగారంపై బుల్లిష్‌గా మారాం’ అని వెల్లడించింది. బంగారం ధరకు 1600 డాలర్ల టార్గెట్‌ను నిర్ణయించింది. ఇదే విధంగా యూబీఎస్‌ సైతం బంగారంపై బుల్లిష్‌గా ఉన్నామని చెబుతూ 1720 డాలర్ల టార్గెట్‌(ఏడాదికి0 ఇచ్చింది. అంతర్జాతీయంగా మందగమన రిస్కులు పెరగడం, వడ్డీరేట్లు తగ్గడం తదితర కారణాలు బంగారంలో పెట్టుబడులు పెంచుతాయని అంచనా వేసింది. సాధారణంగా బడా బ్యాంకులు, బ్రోకరేజ్‌లు ఒక అసెట్‌పై బుల్లిష్‌గా మారితే సంస్థాగత మదుపరులు అందులో భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. ఈదఫా ఇలాంటి పెట్టుబడులు పసిడి మార్కెట్లోకి తరలిరావచ్చని అంచనా.
టెక్నికల్స్‌...
2010 నుంచి పసిడి చార్టుల్లో సౌష్ఠవాకార త్రిభుజాకృతి ఏర్పడుతూ వచ్చింది. ఒక డౌన్‌ట్రెండ్‌, ఒక అప్‌ట్రెండ్‌ల కలబోతగా ఈ ధోరణి ఏర్పడుతుంది. ఈ ఆకృతి పూర్తయ్యాక, దీని నుంచి బ్రేకవుట్‌ లేదా బ్రేక్‌డౌన్‌ వస్తేనే తదుపరి టార్గెట్‌ అంచనా వేస్తారు. తాజాగా బంగారం కొన్ని నెలల క్రితం 1300 డాలర్ల వద్ద ఈ త్రిభుజాకృతి నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ఇది బలమైన బుల్లిష్‌ ట్రెండ్‌కు నిదర్శనంగా నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి త్రిభుజాకృతి ఏర్పడి బ్రేకవుట్‌ వచ్చాక, తదుపరి టార్గెట్‌ను నిర్ధారించుకోవడానికి ఒక సూత్రం ఫాలో అవుతారు. అది.. త్రిభుజంలో అల్పస్థానానికి బ్రేకవుట్‌ సాధించిన స్థానాన్ని కలిపితే తదుపరి టార్గెట్‌ వస్తుంది.

ఈ త్రిభుజంలో 2010- 2015 కాలంలో 800 డాలర్లు అల్పస్థానం కాగా బ్రేకవుట్‌ స్థానం 1300 డాలర్లు. ఈ రెండిటిని కలిపితే 2100 డాలర్ల టార్గెట్‌ వస్తుంది. ఇదే తదుపరి పసిడి టార్గెట్‌ అని ఎక్కువమంది టెక్నికల్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల బంగారంలో పడినప్పుడు కొను సూత్రాన్ని ఫాలో కావచ్చని సలహా ఇస్తున్నారు.


గమనిక: ఇవన్నీ అనలిస్టుల అంచనాలు. పెట్టుబడులకు ముందు సొంత అధ్యయనం తప్పనిసరి. You may be interested

వాణిజ్య ఒప్పందం కోసం జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ఆహ్వానం

Tuesday 5th November 2019

మొదటి దశ వాణిజ్య చర్చల్లో భాగంగా ఇరుదేశాలు కుదుర్చుకున్న ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌... చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆహ్వానం పలికినట్లు వైట్‌ హౌస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్‌ ఏషియన్‌ నేషన్స్‌(ఆసియాన్) సమావేశంలో అమెరికా వాణిజ్య చర్చల బృందంలో సీనియర్‌ సభ్యుడైన బర్ట్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ ‘‘ చైనాతో అమెరికా గొప్ప వాణిజ్య సంబంధాలను కోరుకుంటుంది. మొదటి దశ వాణిజ్య

పాటిటివ్‌గా మెటల్‌ షేర్లు..మొయిల్‌ 3% అప్‌

Tuesday 5th November 2019

యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కానుందనే అంచనాలుండడంతో గత కొన్ని సెషన్‌ల నుంచి మెటల్‌ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు సానుకూలంగా ట్రేడవుతుండడంతో మంగళవారం సెషన్‌లో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 10.46 సమయానికి 0.84 శాతం​లాభపడి 2,664.45 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో మొయిల్‌ 3.17 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ 2.22 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 2.14 శాతం,  హిందుస్థాన్‌ జింక్‌

Most from this category