News


దిగుమతి సుంకాలు తగ్గించాలి..

Tuesday 28th January 2020
Markets_main1580180467.png-31248

  • పసిడి.. వజ్రాభరణాల పరిశ్రమ డిమాండ్‌

భారత్‌ ఏటా 800–900 టన్నుల పసిడి దిగుమతి చేసుకుంటోంది. 2018–19లో పసిడి దిగుమతులు 22.16 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. భారీగా పెరుగుతున్న కరెంటు అకౌంటు లోటును కట్టడి చేసే దిశగా పసిడిపై విధించిన సుంకాలతో.. దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కాలంలో 7 శాతం క్షీణించి 20.57 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. అదే సమయంలో వజ్రాభరణాల దిగుమతులు కూడా 1.5 శాతం క్షీణించి 20.5 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో పసిడి, వజ్రాభరణాల వ్యాపార సంస్థలు ప్రభుత్వం ముందు పలు విజ్ఞప్తులు ఉంచాయి. 

  •  బంగారంపై 12.5 శాతం దిగుమతి సుంకాల (జీఎస్‌టీ అదనం)తో ఆభరణాల కొనుగోలు భారీ వ్యయాలతో కూడుకున్నదిగా మారిపోయింది. దీన్ని 6 శాతానికి తగ్గించాలి. కట్, పాలిష్డ్‌ డైమండ్స్‌పై సుంకాలను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలి. 
  • కొనుగోళ్లకు క్రెడిట్‌ కార్డును వినియోగించిన పక్షంలో బ్యాంక్‌ కమీషన్లు తొలగించాలి. లేదా ప్రస్తుతమున్న 1–1.5 శాతం నుంచి 0.20 శాతానికి తగ్గించాలి. 
  • ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని కొత్త ఆభరణాల్లో ఇన్వెస్ట్‌ చేసిన పక్షంలో  క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపునివ్వాలి. 
  • పసిడి పరిశ్రమ మరింత పారదర్శకంగా పనిచేసే విధంగా తగిన ఇన్‌ఫ్రా, ప్రమాణాలను నెలకొల్పాలి. భారీ స్థాయి గోల్డ్‌ స్పాట్‌ ఎక్సే ్చంజ్, బులియన్‌ బ్యాంకింగ్‌ మొదలైనవి పటిష్టం చేయాలి.  



You may be interested

డాక్టర్‌ రెడ్డీస్‌కు రూ.570 కోట్ల నష్టం

Tuesday 28th January 2020

(అప్‌డేటెడ్‌...) ఆదాయం 14 శాతం పెరిగి రూ.4,384 కోట్లు ఎబిటా 24 శాతం అధికమై రూ.1,074 కోట్లకు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఆర్థిక ఫలితాల విషయంలో అనలిస్టుల అంచనాలు తారుమారయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో భారీ నష్టం చవిచూసింది. ఈ కాలంలో కంపెనీ రూ.569.7 కోట్ల నష్టం ప్రకటించింది. 2018-19 క్యూ3లో రూ.485 కోట్ల నికరలాభం ఆర్జించింది. డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం రూ.4,384

హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.4,196 కోట్లు

Tuesday 28th January 2020

24 శాతం వృద్ధి  5 లక్షల కోట్లకు ఎగసిన రుణాలు  నాలుగు రెట్లు ఎగసిన స్టాండ్‌అలోన్‌ లాభం  న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.3,377 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.4,196 కోట్లకు పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.24,653 కోట్ల నుంచి రూ.29,073 కోట్లకు పెరిగిందని కంపెనీ వైస్‌

Most from this category