News


మరింత పెరిగిన క్రూడ్‌ ఆయిల్‌

Friday 25th October 2019
Markets_main1571978121.png-29132

  యుఎస్‌ చమురు నిల్వలు పడిపోవడంతో పాటు, చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు (ఒపెక్‌), ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ధరలను స్థీరికరించేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నారనే అంచనాల నేపథ్యంలో బ్రెంట్‌ క్రూడ్‌ గురువారం ట్రేడింగ్‌లో 61 డాలర్ల స్థాయికి చేరుకుంది. దీంతో చమురు ధరలు ఈ వారంలో వరుసగా మూడవ సెషన్లో కూడా లాభపడినట్టయ్యింది. కాగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం, చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరగడం వంటి కారణాల వలన శుక్రవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.46 శాతం నష్టపోయి బారెల్‌ 61.11 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.50 శాతం నష్టపోయి బారెల్‌ 55.95 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్లో బ్రెంట్‌ క్రూడ్‌ 1 శాతం మేర లాభపడింది. అంతేకాకుండా ఈ వారంలో 3 శాతంపైనే పెరిగింది. అదే విధంగా డబ్యూటీ క్రూడ్‌ గత సెషన్‌లో 0.5 శాతం పెరిగింది. మొత్తంగా ఈ వారంలో డబ్యూటీఐ క్రూడ్‌ 4.1 శాతం మేర లాభపడింది. 
  అక్టోబర్‌ 18తో ముగిసిన వారానికి గాను యుఎస్‌ చమురు నిల్వలు పడిపోవడంతో పాటు, ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ధరలను స్థిరీకరించేందుకు తీసుకోనున్న చర్యలపై ఇన్వెస్టర్లు ఆశాజనకంగా ఉండడంతో క్రూడ్‌ ధరలు పెరిగాయి. కానీ అంతర్జాతీయంగా ఆయిల్‌ డిమాండ్‌ ఆందోళనలు చమురు ధరలను కిందకి లాగుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రికవరి చెందడం కంటే మరింత మందగమనంలోకి చిక్కుకుంటుందని, వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తుండడం దీనికి సంకేతమని రాయిటర్స్‌ ఆర్థిక నిపుణులు తెలిపారు. అంతేకాకుండా వచ్చే రెండేళ్లలో అమెరికా ఆర్థిక మాంధ్యంలో చిక్కుకుంటుందని ఆందోళనలను యుఎస్‌-చైనా పాక్షిక ఒప్పందం తొలగించలేకపోయిందని అన్నారు. కాగా యుఎస్‌ చమురు నిల్వలు అక్టోబర్‌ 18తో ముగిసిన వారానికి గాను 17 లక్షల బారెల్లు తగ్గింది. ఇది 22 లక్షల బారెల్స్‌ పెరుగుతుందని విశ్లేషకులు అంచనావేయడం గమనార్హం. దీనితోపాటు చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు(ఒపెక్‌), ఒపెక్‌ ప్లస్‌ దేశాలు మరింతంగా చమురు ఉత్పత్తికి కోత విధించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. దీనిపై డిసెంబర్‌లో జరగనున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.



You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాల ప్రీవ్యూ..ఆల్‌టైం గరిష్ఠానికి షేరు!

Friday 25th October 2019

  ఐసీఐసీఐ బ్యాంక్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు ఇతర పోటి బ్యాంకుల కంటే బాగుంటాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ బ్యాంక్‌ రుణ వృద్ధి రెండింతలవుతుందని, ఆస్తి నాణ్యత ఆందోళనలు తగ్గనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ తైమాసిక ఫలితాలలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణ వృద్ధి ఏడాది ప్రాతిపదికన 14.2 శాతం పెరిగి రూ. 6.2 లక్షల కోట్లకు చేరుకుంటుం‍దని అంచనావేస్తున్నాం. ఫలితంగా బ్యాంక్‌ ఎన్‌ఐఎం(నికర వడ్డీ మార్జిన్‌)

ఐటీసీ షేరుకు ఫలితాల జోష్‌

Friday 25th October 2019

2 శాతం అప్‌ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు రెండు శాతం పైచిలుకు లాభంతో ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ ఆరంభంలో సుమారు 3 శాతం లాభంతో 256.90 రూపాయల వద్ద ఐటీసీ షేరు ఓపెనయింది. తర్వాత వెనువెంటనే 257.20 రూపాయల గరిష్ఠాన్ని తాకింది. క్రమంగా అక్కడ నుంచి 253.25 రూపాయల వరకు దిగివచ్చింది. తిరిగి కోలుకొని 254.50 రూపాయల వద్ద కదలాడుతోంది. గురువారం ఐటీసీ షేరు 249.05

Most from this category