News


చమురు..భారీ పతనం

Friday 2nd August 2019
Markets_main1564729327.png-27498

మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై ఈ సెప్టెంబర్‌ 1 నుంచి 10 శాతం సుంకాలు విధిస్తామని యుఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ తెలపడంతో గురువారం సెషన్‌లో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. కాగా శుక్రవారం(అగష్టు 02) ట్రేడింగ్‌లో చమురు ధరలు పతనం నుంచి కోలుకుంటున్నాయి. బ్రెంట్ క్రూడ్‌ 2.7 శాతం పెరిగి బ్యారెల్కు 62.12 డాలర్ల వద్ద, డబ్ల్యుటిఐ క్రూడ్‌ 2.1 శాతం పెరిగి 55.10 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. 
   ట్రంప్‌ చైనాపై టారీఫ్‌లు విధిస్తాననడంతో, అంతర్జాతీయంగా రెండు పెద్ద చమురు వినియోగ దేశాల మధ్య తిరిగి ట్రేడ్‌ వార్‌ ప్రారంభమవుతుందనే భయాలు నేపథ్యంలో చమురు ధరలు గురువారం భారీగా పడిపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 7.0 శాతం, డబ్యూటీ క్రూడ్‌ కూడా 7.9 శాతం పతనమయ్యాయి. ఇది ఫిబ్రవరి 2016 తర్వాత అత్యధిక రోజువారి పతనం కావడం గమనర్హం. 
  సెప్టెంబర్ 1 నుంచి మిగిలిన 300 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తామని, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వేగంగా నిర్ణయాలను తీసుకోవడంలో విఫలమైతే సుంకాలను మరింత పెంచే అవకాశం ఉందని ట్రంప్ గురువారం అన్నారు.  ఈ కొత్త సుంకాలు సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ కంప్యూటర్ల నుంచి బొమ్మలు, పాదరక్షల వరకు వినియోగదారుల వస్తువుల విస్తృత స్థాయిని తాకనున్నాయని, వీటి వలన అంతర్జాతీయ సరఫరా గొలుసులు దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా ఇది జూన్‌లో ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య యుద్ధ సంధిని విచ్ఛిన్నం చేస్తుందని వివరించారు. యు.ఎస్. ఉత్పాదక కార్యకలాపాలు కూడా గత నెలలో పడిపోయి, మూడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. దీంతో పాటు జూన్‌లో నిర్మాణ వ్యయం కూడా పడిపోయింది. ప్రైవేట్ నిర్మాణ ప్రాజెక్టులలో పెట్టుబడులు, ఒకటిన్నర ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అతి పెద్ద చమురు వినియోగదారి దేశమైన యుఎస్‌ ఆర్థిక మందగమనం, చమురు డిమాండ్‌ భయాలు చమురు ధరలపై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి. అంతేకాకుండా యు.ఎస్. చమురు శుద్ధి కర్మాగారాలలో ప్రాసెస్ చేసిన ముడి చమురు గత నాలుగు వారాలలో రోజుకు సగటున 17.2 మిలియన్ బారెల్స్‌కు చేరుకుందని యుఎస్ ప్రభుత్వ డేటా నివేదించింది. ఇది ఏడాది క్రితం ఇదే సమయం కన్నా 1.3 శాతం తక్కువ కావడం గమనర్హం.  You may be interested

కరుగుతున్న మెటల్‌ షేర్లు

Friday 2nd August 2019

నష్టాల మార్కెట్లో భాగంగా శుక్రవారం మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. అంతర్జాతీయంగా మెటల్‌ ధరలకు డిమాండ్‌ తగ్గడంతో పాటు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి వరకు ప్రధాన మెటల్‌ ఉత్పత్తి కంపెనీల ఆదాయాలు నిరాశపరచడంతో సెంటిమెంట్‌ను బలహీనపరుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే చైనా ఆర్థికమందమనం, ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం కూడా మెటల్‌ షేర్ల ట్రేడింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం అల్యూమినియం

18 పైసలు క్షీణించి..69.24 వద్ద రూపీ

Friday 2nd August 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతోపాటు, బ్యాంకులు, దిగుమతిదారులు యుఎస్‌ కరెన్సీ డాలర్‌ను కొనుగోలు చేయడంతో రూపీ డాలర్‌ మారకంలో 18 పైసలు క్షీణించి శుక్రవారం(అగష్టు 02) ట్రేడింగ్‌లో 69.24 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 27 పైసలు క్షీణించి 69.06 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఫెడరల్ రిజర్వ్ 25 బిపిఎస్ రేట్ల కోత చేసినప్పటికి ఈ రేట్ల కోత కొనసాగదని స్పష్టమైన

Most from this category