News


కమోడిటీస్‌: పాజిటివ్‌గా బేస్‌ మెటల్స్‌

Tuesday 23rd July 2019
Markets_main1563878093.png-27258

ఈ నెల చివరిలో జరగనున్న యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌ సమావేశంలో, వడ్డి రేట్ల కోత తక్కువగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో డాలర్‌ గత కొన్ని సెషన్‌ల నుంచి బలపడుతోంది. ఫలితంగా బులియన్‌ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గాయి. దీంతో పాటు మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఒత్తిళ్ల వలన చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా అవసరమైనప్పుడు ప్రతిస్పందిస్తామని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఎజెన్సీ (ఐఈఏ) తెలపడం‍తోపాటు చమురు డిమాండ్‌ భయాల వలన మంగళవారం చమురు ధరలు కూడా స్వల్పంగా తగ్గి ట్రేడవుతున్నాయి.
బులియన్‌: బంగారం రూ.34,750 వరకు తగ్గగలదు. రూ.35,200 వద్ద నిరోధం ఉంది. వెండి రూ.40,700 వరకు తగ్గగలదు. రూ.41,300 వద్ద నిరోధం ఉంది. 
బేస్‌ మెటల్స్‌: బేస్ మెటల్స్‌ పాజిటివ్‌గా కదలవచ్చు. రాగికి రూ.452 వద్ద మద్దతు లభించనుంది. ఇది రూ.460 వరకు పెరిగే అవకాశం ఉంది. జింక్‌కు రూ.191 దగ్గర మద్ధతు లభిస్తుంది. రూ.194 వద్ద తిరోగమనం ఉండవచ్చు. లెడ్‌కు రూ.151 వద్ద మద్ధతు లభిస్తుంది. రూ.156 వద్ద నిరోధం ఉంది. నికెల్‌ రూ.1,020 వైపు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. దీనికి రూ.980 వద్ద మద్ధతు లభిస్తుంది. అల్యూమినియంకు రూ.140 వద్ద మద్ధతు లభిస్తుంది. రూ.143 వద్ద నిరోధం ఉంది. 
ఎనర్జీ: క్రూడ్‌ ఆయిల్‌ రూ.3,840 వైపు కదలవచ్చు. రూ.3,930 వద్ద నిరోధం ఉంది. సహజ వాయువు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. రూ.158 వద్ద మద్ధతు లభించనుంది. రూ.164 వద్ద నిరోధం ఎదుర్కోవచ్చు. 
సుగంధ ద్రవ్యాలు: పసుపు ఫ్యూచర్స్ (ఆగస్టు) రూ.7,050-7,200 స్థాయిలలో ఏకీకృతం కావచ్చు. జీరా ఫ్యూచర్స్ (ఆగస్టు) రూ.17,540-17,840  పరిధిలో కదలాడవచ్చు.  కొత్తిమీర ఫ్యూచర్స్ (ఆగస్టు) రూ.6,650-6,500 స్థాయిల వైపు మరింత పడిపోవచ్చు.
నూనెగింజలు: ఈ సీజన్‌లో తక్కువ విస్తీర్ణంలో సోయాబీన్‌ను పండిస్తున్నారనే డేటా విడుదలవ్వడంతో సోయాబీన్ ఫ్యూచర్స్ (ఆగస్టు) రూ.3,540 వద్ద మద్దతు లభించనుంది. ఆవాలు ఫ్యూచర్స్ (ఆగస్టు) రూ. 3,945 దగ్గర నిరోధం ఎదురుకానుంది. రూ.3,900 వద్ద మద్దతు లభించనుంది. సోయా ఆయిల్ ఫ్యూచర్స్ (ఆగస్టు) రూ .725-731 పరిధిలో కదలాడవచ్చు. సిపిఓ ఫ్యూచర్స్ (ఆగస్టు) రూ .503-507 స్థాయిల పరిధిలో వ్యాపారం చేయవచ్చు.
ఇతర కమోడిటీలు: ఖరీఫ్ సీజన్లో పంట విస్తీర్ణం పెరుగుతుందనే నివేదికలు వెలువడడంతో కాటన్ ఫ్యూచర్స్ (జూలై) రూ.21,300 వైపు దిద్దుబాటుకు గురికావచ్చు. వరి (బాస్మతి) - పూసా 1121 ఫ్యూచర్స్ (ఆగస్టు) రూ.2,930 వైపు పడిపోయే అవకాశం ఉంది. కాస్టర్ సీడ్ ఫ్యూచర్స్ (ఆగస్టు) డిమాండ్ తగ్గడంతో రూ. 5,450-5,400  పడిపోతుందని విశ్లేషకులు అంచనా.



You may be interested

నాలుగో రోజూ నష్టాలే...

Tuesday 23rd July 2019

38000ల దిగువ ముగిసిన సెన్సెక్స్‌  15 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ  మార్కెట్‌కు నష్టాల కష్టాలు ఆగేలా లేవు. వరుసగా 4రోజూ నష్టాలతోనే ముగిసింది. మార్కెట్లో కొనసాగుతున్న వరుస పతనంతో సెన్సెక్స్‌ 48 పాయింట్లు నష్టపోయి 38000 స్థాయి దిగువున 37,982 వద్ద ముగిసింది. నిఫ్టీ 15 పాయింట్లను కోల్పోయి 11,331 వద్ద స్థిరపడింది. ఈ 4 ట్రేడింగ్‌ సెషన్స్‌లో సెన్సెక్స్‌ సూచీ 1232 పాయింట్లను, నిఫ్టీ 357 పాయింట్లును కోల్పోయాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌,

పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు క్రాష్‌

Tuesday 23rd July 2019

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా మిడ్‌సెషన్‌ సమయానికి ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 3,013.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో అధిక వెయిటేజీ కలిగిన ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్ల పతనంతో ఇండెక్స్‌ ఒకదశంలో 3.30శాతం క్షీణించి 2,902.65 స్థాయికి పతనమైంది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,001.55)తో పోలిస్తే 3.15శాతం క్షీణించి 2,905.70

Most from this category