News


8.3 శాతం క్షీణించనున్న వాహన ఉత్పత్తులు!

Wednesday 12th February 2020
Markets_main1581504580.png-31734

పిచ్‌ అంచనా

చైనా దేశాన్ని ఆర్థికంగా కుదిపేసిన కరోనావైరస్‌ భారత వాహన రంగంపై  ప్రభావాన్ని చూపనుంది. కరోనా వైరస్‌ కారణంగా మన దేశంలో  వాహన రంగంలోఉత్పత్తులు పడిపోయే అవకాశం ఉందని పిచ్‌ అంచనా వేసింది. గతేడాది 13.2 శాతంగా ఉన్న ఉత్పత్తి ఈ ఏడాది 8.3 శాతానికి క్షీణించవచ్చని తెలిపింది. ముఖ్యంగా భారత్‌లో తయారయ్యే వాహనాలకు  విడిభాగాలు అధికంగా చైనా నుంచే సరఫరా అవుతుండడమే ఇందుకు కారణమని తెలిపింది. చైనాలో కరోనా వైరస్‌ విజృంభించడంతో విడిభాగాల సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇండియాలో వాహనాలు తయారు చేయడానికి అడ్డంకి ఏర్పడి ఉత్పత్తి తగ్గుతుందని పిచ్‌ చెప్పింది. అటు చైనాలో సైతం కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో పరిశ్రమలు మూతపడ్డాయి. చైనా నుంచి ఇండియాకు సరఫరా అయ్యే ఆటోమోటివ్‌ విడిభాగాలు 10-30 శాతం ఉంటాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో ఇవి 2-3 రెట్లు అధికంగా ఉంటాయని, అందువల్లే భారీగాఉత్పత్తిలో క్షీణత ఏర్పడవచ్చని పిచ్‌ పేర్కొంది.  



You may be interested

నిఫ్టీ మద్దతు12,153 పాయింట్లు

Thursday 13th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11 పాయింట్లు మైనస్‌ బుధవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌ నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 11 పాయింట్లు నీరసించి 12,216 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,227 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వరుసగా మూడో రోజు

దమానీ పోర్టుఫోలియోలో షేర్లివే!

Wednesday 12th February 2020

అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ షేరు ర్యాలీతో దమానీ దేశంలో ఆరో అతిపెద్ద కుబేరుడుగా అవతరించాడు. ఈ మార్ట్స్‌ ఆరంభానికి ముందే ఆయన ఒక వాల్యూ ఇన్వెస్టర్‌గా సుపరిచితుడు. ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా సైతం దమానీని తన గురువుగా పేర్కొంటాడంటే, ఇన్వెస్టర్‌గా ఆయన ప్రఖ్యాతి అంచనా వేయొచ్చు. మొదటి నుంచి హైక్వాలిటీ స్టాకుల ఎంపికలో దమానీకి మంచిపేరుంది. అలాంటి దమానీ పోర్టుఫోలియోలో ఉన్న షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి... = అవెన్యూసూపర్‌

Most from this category