News


అల్యూమినియం స్టాక్స్‌ ర్యాలీ ఎప్పుడు..?

Sunday 13th October 2019
Markets_main1570991297.png-28850

లండన్‌ మెటల్‌ ఎక్సేంజ్‌ (ఎల్‌ఎంఈ)లో మూడేళ్ల కనిష్ట స్థాయికి అల్యూమినియం ధరలు చేరాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు, ఆటోమొబైల్‌ రంగం నుంచి డిమాండ్‌ తగ్గడం వంటి అంశాలు అల్యూమినియంపై చూపిస్తున్నాయి. అమెరికా-చైనా ఒకరిపై ఒకరు టారిఫ్‌లు వేసుకోవడం మొదలైన తర్వాత.. 2018 మధ్య నుంచి ఇప్పటి వరకు ఎల్‌ఎంఈలో అల్యూమినియం ధరలు 28 శాతం పడిపోయాయి. ఇక అంతర్జాతీయంగానూ వృద్ధి పరిస్థితులు సన్నగిల్లుతుండడం, మాంద్యం వచ్చే అవకాశాలున్నాయన్న ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్యూమినియం ధరలపై జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమోడిటీ రీసెర్చ్‌ హెడ్‌ హరీష్‌ తన విశ్లేషణను తెలియజేశారు. 

 

‘‘అల్యూమినియంను ఎక్కువగా ఆటోమొబైల్‌, ప్యాకేజింగ్‌ పరిశ్రమల్లో వినియోగిస్తుంటారు. అంతర్జాతీయంగా ఆర్థిక రంగ పరిస్థితులు ఆటోమొబైల్‌ రంగాన్ని గట్టిగానే తాకాయి. అల్యూమినియంకు 30-40 శాతం మార్కెట్‌ అంతర్జాతీయ ఆటోమొబైల్‌ రంగమే. 2018లో 1.7 శాతం ఆటోమొబైల్‌ రంగంలో నమోదవగా, ఈ ఏడాది అంతర్జాతీయంగా ఆటోమొబైల్‌ రంగంలో ఉత్పత్తి ఇప్పటి వరకు 7 శాతం పడిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక అంతర్జాతీయ అల్యూమినియం మార్కెట్‌లో సరఫరా ఈ ఏడాది 0.6 శాతం తగ్గింది. చైనా, లాటిన్‌ అమెరికా, వెస్టర్న్‌ యూరోప్‌లో ఉత్పత్తి తగ్గింది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం తయారీగా ఉంది. అంతర్జాతీయంగా 55 శాతం (ఏటా 65 మిలియన్‌ టన్నులు) సరఫరా చైనా నుంచే ఉంది. ఈ ఏడాది చైనాలో అల్యూమినియం ఉత్పత్తి 13 శాతం తగ్గిందని ఇంటర్నేషనల్‌​అల్యూమినియం ఇనిస్టిట్యూట్‌ డేటా తెలియజేస్తోంది. పర్యావరణ పరిరక్షణ దిశగా చైనా కఠిన నిబంధనలను అనుసరించడం ఉత్పత్తి తగ్గడానికి కారణం. అయితే, చైనాలో మాత్రం ధరలు సానుకూలంగా ఉన్నాయి. 

 

రానున్న సంవత్సరాల్లో అల్యూమినియం మార్కెట్‌లో సరఫరా అధికంగానే ఉండనుంది. బలహీన అంతర్జాతీయ డిమాండ్‌, అదే సమయంలో చైనా నుంచి సరఫరా పెరిగితే అది అధిక సరఫరాకు దారితీస్తుంది. చైనా ఇప్పటికీ అంతర్జాతీయ అల్యూమినియం ధరలను నిర్ణయించే శక్తిగా ఉంది. వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా సూక్ష్మ ఆర్థిక సవాళ్లు కొనసాగితే కనుక ధరలపై ఇకముందూ ఒత్తిడి ఉంటుంది. అయితే, వాణిజ్య చర్చల్లో సానుకూల పరిణామం చోటు చేసుకుంటే, చైనా ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలు తిరిగి ఆటోమొబైల్‌, ప్యాకేజీ రంగాల నుంచి అల్యూమినియంకు డిమాండ్‌ను పెంచుతాయి. టన్నుకు 1,850 డాలర్లకు దిగువన ఉన్నంత వరకు అల్యూమినియం ధరలపై ఒత్తిడి ఉంటుంది. 1,900 డాలర్లకు పైన క్లోజయితే రికవరీకి అవకాశం ఉంటుంది’’ అని హరీష్‌ వివరించారు. You may be interested

ఆర్థిక మందగమనంలో సురక్షిత మార్గాలు

Monday 14th October 2019

ఆర్థిక మందగమనం... నేడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పదం. ఎందుకంటే దేశ ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. జూన్‌ త్రైమాసికంలో కేవలం 5 శాతం ఆర్థిక వృద్ధే నమోదైంది. దేశంలో వినిమయ డిమాండ్‌ తగ్గింది. ఆటోమొబైల్‌ రంగంలో వాహనాలకు డిమాండ్‌ దారుణంగా పడిపోయింది. ఇవన్నీ అంతర్జాతీయ ఆర్థిక మందగమనానికి తోడు, దేశీయంగా చేపట్టిన పలు సంస్కరణల ప్రభావాలే. అయితే, ఆర్థిక మందగమనం ఇన్వెస్టర్లకు ఎన్నో పాఠాలు నేర్పుతుందనడంలో

మూడు బ్యాంకు స్టాక్స్‌పై ఐఐఎఫ్‌ఎల్‌ బుల్లిష్‌

Sunday 13th October 2019

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు స్టాక్స్‌ పట్ల బుల్లిష్‌గా ఉన్నట్టు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. నవంబర్‌ నెల మొదటి పది రోజుల్లో నిఫ్టీ 12,000 స్థాయిలో ఉంటుందని అంచనా వేశారు. 2020లో మార్కెట్లు అసలైన మంచి పనితీరు కనబరుస్తాయని చెప్పారాయాన. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.     ఇన్‌ఫ్రా, వ్యవసాయం, రైల్వేలకు ప్రభుత్వం వైపు నుంచి మంచి మద్దతు

Most from this category