Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Katy Perry delivering a mesmerizing performance at the pre wedding celebrations
అనంత్‌-రాధికల ప్రీవెడ్డింగ్‌ వేడుకలో కాటిపెర్రీ పెర్ఫార్మెన్స్

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సెన్సేషన్ కాటి పెర్రీ చేసిన లైవ్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెర్రీ సిల్వర్‌కలర్‌లో శరీరాన్ని హత్తుకుని ఉండే దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంది. తనతోపాటు ఈ ఈవెంట్‌లో పాల్గొన్న తన ట్రూప్‌ తెల్లటి దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలను అలరించారు.ముఖేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌-రాధికల రెండో ప్రీవెడ్డింగ్‌ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. క్రూయిజ్‌షిప్‌లో జరిగే ఈ వేడుకలో దాదాపు 900 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్‌కు సుమారు 4,380 కిలోమీటర్లమేర క్రూయిజ్‌ ప్రయాణం సాగుతుంది.అనంత్‌ అంబానీ-రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఈ ఏడాది మార్చినెలలో ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో మెటా ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న వంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ తన కుమారుడు, కోడలు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ గతంలోనే నివేదించింది.ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్‌ వాహన ధరలు.. ఎంతంటే..సంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ జంట ముంబైలో జులై 12న వివాహం చేసుకోనుంది. జులై 12 శుక్రవారం రోజున శుభ వివాహ వేడుకతో పెళ్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14 ఆదివారం రోజు జరిగే మంగళ్ ఉత్సవ్, వివాహ రిసెప్షన్‌తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.Katy Perry performing Firework at Cannes tonight! pic.twitter.com/MafEP3OJGP— Katy Perry Today (@todaykatyp) June 1, 2024

Medium to heavy e-trucks are likely to be a part of a new subsidy scheme FAME-III
భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్‌ వాహన ధరలు.. ఎంతంటే..

ఎలక్ట్రానిక్‌ ట్రక్కుల ధరలు భారీగా తగ్గనున్నాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటి ధరలో కనీసం 20-25శాతం సబ్సిడీ లభించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఫేమ్‌3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మధ్యస్థం నుంచి భారీ ఎలక్ట్రానిక్‌ ట్రక్కులపై రాయితీలు ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి. ఈమేరకు ఏడాది చివర్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడనుందని కొందరు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.మీడియా కథనాల ప్రకారం..ప్రభుత్వం కొత్త సబ్సిడీ స్కీమ్ ఫేమ్‌3ను ఈ ఏడాది చివర్లో తీసుకురానుందని అంచనా. ఇందులో హెవీ ఎలక్ట్రానిక్‌ ట్రక్కులపై 20-25శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ-ట్రక్కుల ధర మార్కెట్‌లో రూ.70లక్షలు నుంచి రూ.90 లక్షలుగా ఉంది. ఒకవేళ అంచానాల ప్రకారం ప్రభుత్వం ఫేమ్‌3లో వీటి రాయితీపై నిర్ణయం తీసుకుంటే వాహనదారులకు భారీగా లబ్ధి చేకూరుతుంది. అయితే హైబ్రిడ్ ప్యాసింజర్ వాహనాలను ఈ సబ్సిడీ పరిధిలోకి తీసుకురాకూడదని చర్చలు జరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: యువతను ఆకర్షిస్తున్న ఫేస్‌బుక్‌ఫేమ్‌3 పథకానికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ పథ​కంలో భాగంగా ఎలక్ట్రానిక్‌ వాహనాల కొనుగోలు పెంచేందుకు వాహనదారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ మొబిలిటీ మిషన్‌ ప్లాన్‌(ఎన్‌ఈఎంఎంపీ)లో ఉన్న ఫేమ్‌ ఇండియా1ను 2015, ఏప్రిల్‌1 నుంచి మార్చి 31, 2019 వరకు కొనసాగించారు. ఇందుకోసం రూ.895 కోట్లు కేటాయించారు. ఫేమ్‌2ను మార్చి 31, 2024 వరకు దాదాపు రూ.10వేల కోట్లుతో తీసుకొచ్చారు. ఇందులో ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్, ఇ-రిక్షాల కొనుగోళ్లపై వినియోగదారులకు సబ్సిడీ అందించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఫేమ్‌3ను ప్రారంభించనున్నట్లు తెలిసింది.

 Sunita Williams Going Into Space For Third Time
నేడు సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్ర

న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. భారత కాల మానం ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బోయింగ్ స్టార్‌లైనర్‌ రాకెట్‌లో ఈ రోజు రాత్రి 10 గంటల సమయంలో అంతరిక్షంలోకి బయలు దేరనున్నారు. అంతరిక్షంలో లోయర్ ఎర్త్‌ ఆర్బిట్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)కి వ్యోమగాములను చేరవేసే ప్రాజెక్ట్‌పై బోయింగ్‌ స్టార్‌లైనర్‌ పనిచేస్తోంది.ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్‌ స్టార్‌లైన్‌ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లే సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చెందిన హార్మోనీ మాడ్యుల్‌ సబ్‌సిస్టమ్స్‌ పనితీరుపై వారం రోజుల పాటు పనిచేయనున్నారు. ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్‌ లైనర్‌ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు ఎలోన్‌ మస్క్​కు చెందిన స్పేస్ ఎక్స్ నాసా సర్టిఫై అయింది. స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్ష యాత్ర కూడా విజయవంతమైతే స్పేస్ ఎక్స్ జాబితాలో చేరిపోనుంది.బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం గత నెల 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రాకెట్‌ను నింగిలోకి పంపే రెండుగంటల ముందు వాల్వ్‌లో సమస్య తలెత్తడంతో.. కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. దీంతో భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా, బుచ్ విల్ మోర్‌ల అంతరిక్షయానం వాయిదా పడింది. తాజాగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 10గంటలకు ప్రారంభం కానుంది. 2006లో సునీతా విలియమ్స్ తన తొలి రోదసి యాత్రను చేపట్టారు. ఆ తర్వాత 2012లో రెండో సారి అంతరిక్షంలోకి వెళ్లారు. తాజాగా మరోసారి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నారు.

More than 40 million US and Canadian adults check Facebook daily
యువతను ఆకర్షిస్తున్న ఫేస్‌బుక్‌

మెటా ఆధ్వర్యంలోని ఫేస్‌బుక్‌ సంస్థ తన బేస్‌ వినియోగదారుల్లో యువతను అధికంగా ఆకర్షిస్తోంది. పాత యూజర్ బేస్‌తో పోలిస్తే యువకుల సంఖ్యను పెంచుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది.టిక్‌టాక్‌తో పోటీపడేలా ఫేస్‌బుక్‌లో తీసుకొచ్చిన మార్పులు, గ్రూప్‌ ఫీచర్‌ల ద్వారా యూజర్లను పెంచుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. యూఎస్‌, కెనడాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న 40 మిలియన్ల మంది యువత రోజూ ఫేస్‌బుక్‌ను వాడుతున్నారని చెప్పింది. ప్రాంతాలవారీగా డెమోగ్రఫిక్‌ వినియోగదారుల సమాచారాన్ని మొదటగా ఫేస్‌బుక్‌ సంస్థే విడుదల చేసినట్లు తెలిపింది.ఇదీ చదవండి: తగ్గనున్న ద్రవ్యోల్బణం.. ఆర్‌బీఐ నివేదికయువత యాప్‌ను ఎలా ఉపయోగిస్తుందో తెలియజేసేలా న్యూయార్క్‌లో ఒక కార్యక్రమం నిర్వహించారు. అందులో ఫేస్‌బుక్ మెటా హెడ్ టామ్ అలిసన్ మాట్లాడుతూ..‘చైనాకు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలోని స్మాల్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ వైపు మొగ్గు చూపుతున్న యువత దృష్టిని తిరిగి తనవైపు ఆకర్షించడానికి కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నించింది. తరువాతి తరానికి ఉపయోగపడేలా ఉండేందుకు ఎంతో అభివృద్ధి చెందాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మార్కెట్‌ప్లేస్‌, గ్రూప్‌లు, స్మాల్‌ వీడియా ఫీచర్లను తీసుకొచ్చాం. ప్రస్తుతం ఎక్కువగా యువత ఫీడ్‌ లేదా రీల్స్‌ను వాడుతున్నారు. సంస్థను స్థాపించిన 2004నుంచి మూడేళ్లలో 50 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ యూజర్లను కలిగి ఉంది’ అన్నారు.

India GDP is expected to grow at 7% in FY25
తగ్గనున్న ద్రవ్యోల్బణం.. ఆర్‌బీఐ నివేదిక

ఆర్థికవృద్ధిని కొనసాగిస్తూనే ప్రభుత్వం మూలధన వ్యయంపై దృష్టి పెడుతుండడంతో ఈ ఏడాది వృద్ధి నమోదవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదికలో తెలిపింది. 2024-25 ఏడాదిలో సీపీఐ ద్రవ్యోల్బణం సగటున 4.5%గా ఉంటుందని అంచనా వేసింది. 2023-24లో నమోదైన 5.4% ద్రవ్యోల్బణం కంటే ఇది తక్కువ.ఇన్‌ఫ్లేషన్‌ తగ్గుముఖం పట్టడంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తువినిమయం ఊపందుకుంటుందని పేర్కొంది. ఈఏడాదిలో వృద్ధిని ప్రేరేపించేందుకు మూలధన వ్యయంలో సగానికిపైగా ఫైనాన్సింగ్‌ రంగంలో రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. గతేడాదిలో మూలధనవ్యయం రూ.9.5 ట్రిలియన్లుగా ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని రూ.11.11 ట్రిలియన్లకు పెంచాలనే లక్ష్యాన్ని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పింది.ఈ ఏడాది దేశ జీడీపీ 7% వరకు పెరుగుతుందని అంచనా వేసింది. కార్పొరేట్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు పెరగడం, వస్తువినిమయం పెరుగుతుండడం, రెండంకెల క్రెడిట్ వృద్ధి వంటి అంశాలు ఆర్థిక ప్రగతికి సానుకూలంగా ఉన్నాయని చెప్పింది. కానీ కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భవిష్యత్తులో ప్రతికూల వాతావరణాన్ని ఏర్పరిచే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేసింది. దానివల్ల వస్తుసరఫరాలో మార్పులుంటాయని చెప్పింది. ప్రధాన పంటల ఉత్పత్తిలో తగ్గుదల వల్ల ద్రవ్యోల్బణం ప్రభావితం చెందవచ్చని భావిస్తుంది.

India moves 100 metric tonnes of gold from U.K. to domestic vaults
భారత్‌కు 100 టన్నుల బంగారం

ముంబై: బ్రిటన్‌ వాల్టుల్లో భద్రపర్చిన 100 టన్నుల బంగారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ దేశీ ఖజానాకు తరలించింది. 1991లో భారత్‌ విదేశీ మారక సంక్షోభాన్ని అధిగమించేందుకు పసిడిని తాకట్టు పెట్టిన అనంతరం ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని తరలించడం ఇదే ప్రథమం అని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రిటన్‌ నుంచి బంగారం తరలింపు విషయంలో ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ, ఇతరత్రా ఏజెన్సీలు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు, అత్యంత విలువైన లావాదేవీ కావడంతో చాలా గోప్యత పాటించినట్లు వివరించాయి. రవాణా సౌలభ్యం తదితర అంశాలు పసిడి తరలింపునకు కారణమని పేర్కొన్నా యి. ప్రస్తుతం దేశీయంగా ముంబై, నాగ్‌పూర్‌లో పటిష్టమైన వాల్టుల్లో బంగారాన్ని నిల్వ చేస్తున్నారు. తాజా పరిణామంతో దేశీయంగా భద్రపర్చిన మొ త్తం పసిడి పరిమాణం 408 టన్నులకు చేరింది. అధికారిక గణాంకాల ప్రకారం 2024 మార్చి ఆఖరు నాటికి భారత్‌ వద్ద మొత్తం 822 టన్నుల బంగారం ఉంది. ఇందులో సుమారు 413.79 టన్నులు విదేశీ వాల్టుల్లో ఉన్నాయి. గత కొన్నాళ్లుగా గణనీయంగా పసిడి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో దాన్ని నిల్వ చేయడాన్ని తగ్గించుకోవాలని భారత్‌ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తగ్గనున్న వ్యయాలు.. ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొనడానికి దేశాలు కొన్న బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ మొదలైన వాటి వాల్ట్‌లలో సురక్షితంగా నిల్వ చేస్తుంటాయి. ఇందుకు కొంత చెల్లిస్తుంటాయి. తాజాగా బంగారాన్ని మన దేశానికి తరలించి, ఇక్కడే నిల్వ చేయ డం వల్ల విదేశీ కస్టోడియన్లకు చెల్లించాల్సిన స్టోరేజీ ఫీజుల భారాన్ని ఆర్‌బీఐ తగ్గించుకోగలుగుతుంది.

Sensex, Nifty end with marginal gain
అయిదు రోజుల అమ్మకాలకు బ్రేక్‌

ముంబై: దేశీయ జీడీపీ గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించడంతో స్టాక్‌ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. నేడు(శనివారం) ఎగ్జిట్‌ పోల్స్, వచ్చే మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అప్రమత్తత కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్‌ 76 పాయింట్లు పెరిగి 73,961 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు బలపడి 22,530 వద్ద నిలిచింది. దీంతో సూచీల అయిదురోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. ఇటీవల వరుస పతనంలో భాగంగా కనిష్టాలకు దిగివచి్చన బ్యాంకులు, ఫైనాన్స్, మెటల్‌ ఇంధన, కన్జూమర్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 593 పాయింట్లు బలపడి 74,479 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 22,654 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. నెలాఖరున డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో దేశీయ కరెన్సీ ఆరంభ నష్టాలు కోల్పోయింది. అమెరికా బ్రోకేరేజ్‌ సంస్థ జెప్ఫారీస్‌ ‘బై’ రేటింగ్‌తో అదానీ షేర్లు భారీగా పెరిగాయి. డాలర్‌ మారకంలో 13 పైసలు బలహీనపడింది 83.42 స్థాయి వద్ద స్థిరపడింది.

Rishi Sunak spotted the railway station with a Rs79000 Tumi backpack
రిషి సునాక్‌ బ్యాగ్‌ ధరెంతో తెలుసా..

సెలబ్రిటీలు వాడే ప్రతి వస్తువు సామాన్యులకు ఎప్పుడూ ప్రత్యేకమే. వారు ధరించే షూ, వేసుకునే దుస్తులు, వాడే కారు, పెట్టుకునే వాచీలు, ఉపయోగించే బ్యాగులు.. ఇలా అన్ని స్పెషల్‌గా కనిపిస్తాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ రైల్వేస్టేషన్‌లో యూకే ప్రధాని రిషిసునాక్‌ వాడిన బ్యాగ్‌ గురించి నెట్టింట వైరల్‌గా మారింది.రాబోయే బ్రిటిష్‌ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా రిషి సునక్ ప్రచారంలో పాల్గొనేందుకు ఇటీవల రైలులో ప్రయాణించారు. లండన్‌ నుంచి బయలుదేరిన ఆయన రాత్రంతా రైలు స్లీపర్‌క్లాస్‌లో ప్రయాణించి కార్న్‌వాల్‌కు చేరుకున్నారు. అందులో ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా. రిషి రైల్వే స్టేషన్‌లో దిగిన వెంటనే అందరి కళ్లు ఆయనతోపాటు తాను వాడుతున్న బ్యాగ్‌పై పడింది. దేశంలోని అత్యంత పేద ప్రాంతాల్లో ఒకటైన 'ఆర్‌ఎస్‌'ను సూచించే మోనోగ్రామ్‌ ఉన్న బ్యాక్‌ప్యాక్‌ను ధరిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాంతో వీక్షకులు తాను వినియోగించిన బ్యాక్‌ప్యాక్‌ ధరెంతో తెలుసుకునే పనిపడ్డారు. దీని విలువ సుమారు రూ.79వేలు ఉంటుందని తెలిసింది.ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..‍క్రూయిజ్‌లో ఫస్ట్‌ బర్త్‌డేది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ రిపోర్ట్‌ ప్రకారం..రిషి సునక్, తన భార్య అక్షతామూర్తి నికర విలువ 651 మిలియన్‌ బ్రిటిష్‌ పౌండ్లు(సుమారు రూ.6900 కోట్లు). బ్రిటిష్‌ రాజు కింగ్ చార్లెస్ 3 కంటే వీరే సంపన్నులు. ఈ జంట సంపద కేవలం ఒక సంవత్సరంలోనే 120 మిలియన్ పౌండ్లకు పైగా పెరిగింది.Paddington Station, London: Rishi Sunak boarding the sleeper train to Cornwall, sporting a £750 luxury monogrammed Tumi Arrive Bradley backpack pic.twitter.com/ojWi76ovcu— Jane Fleming (@fleming77) May 29, 2024

Flipkart Big End of Season Sale 2024 sets largest fashion participation over 12000 Brands
Flipkart Big End of Season Sale 2024: రేపటి నుంచే ఫ్లిప్‌కార్ట్‌ సీజన్‌సేల్‌.. ఆఫర్లు ఇవే..

ఆన్‌లైన్‌ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్ జూన్ 1 నుంచి ‘బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్‌ సేల్‌లో ఫ్యాషన్ కేటగిరీలోని వస్తువులపై ఆకర్షణీయలమైన ఆఫర్లు ఉంటాయని చెప్పింది.బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌ 2024లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ 12,000 బ్రాండ్‌లను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. 2 లక్షలకు పైగా అమ్మకందారుల నుంచి వీటిని ఎంపిక చేశామని చెప్పింది. స్పోర్ట్స్ షూ, గడియారాలు, జీన్స్ వంటి వాటిని ఓపెన్-బాక్స్ డెలివరీ అందిస్తామని పేర్కొంది. ఒక లక్షకు పైగా ఉత్పత్తులను బుక్‌ చేసుకున్న రోజే డెలివరీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ సేల్‌లో అన్ని ప్రముఖ బ్రాండ్‌లు అందుబాటులో ఉంటాయని, కంపెనీ ఆఫర్లను అందరూ వినియోగించుకోవాలని కోరింది.ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో భాగంగా తమ కస్టమర్‌లకు బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తుంది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ (కనీస ఆర్డర్ విలువ రూ.2,500) క్రెడిట్ కార్డ్‌లపై ఉత్పత్తి ధరలో 10% ఇన్‌స్టాంట్‌ తగ్గింపు ఇస్తున్నారు. కనీసం రూ.200 విలువ చేసే ఉత్పత్తులను యూపీఐ పేమెంట్‌ ద్వారా ఆర్డర్ చేస్తే ఆకర్షణీయమైన ఆఫర్‌లను పొందవచ్చని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..‍క్రూయిజ్‌లో ఫస్ట్‌ బర్త్‌డేఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్‌ హెడ్ అరీఫ్ మొహమ్మద్ మాట్లాడుతూ..‘మార్కెట్‌లో పేరున్న బ్రాండ్‌లను వినియోగదారులకు తక్కువ ధరకే ఇస్తున్నాం. దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీ వంటి విభాగాల్లో మరింత ట్రెండింగ్‌ వస్తువులను అందిస్తున్నాం. కస్టమర్లకు 75 లక్షలకు పైగా విభిన్న ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సేల్‌ను ఒక వేడుకగా జరుపుతున్నాం. ఇందులో 10 మిలియన్లకు పైగా కొత్త కస్టమర్లు పాల్గొనే అవకాశం ఉంది. వీరు ఎక్కువగా స్పోర్ట్స్ షూస్, లగేజ్, వాచీలు, ఎత్నిక్ సూట్‌లు, పార్టీ డ్రెస్‌లు వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు’ అని చెప్పారు.

EPFO relaxes mandatory uploading of cheque leaf, bank passbook images
ఈపీఎఫ్‌ కొత్త రూల్స్‌.. వాటి అప్‌లోడ్‌ తప్పనిసరి కాదు!

EPF New rules: ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ దరఖాస్తు చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఊరట కల్పించింది. దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలను అప్‌లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్లు ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది.ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి, క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేసినప్పుడు చెక్ లీఫ్/అటెస్టెడ్‌ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రం అప్‌లోడ్ చేయని కారణంగా తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్‌ల సంఖ్యను తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది.మరి క్లెయిమ్‌ వెరిఫై ఎలా?చెక్ లీఫ్/అటెస్టెడ్‌ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలు అప్‌లోడ్‌ చేయని పక్షంలో క్లెయిమ్‌ ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి ఈపీఎఫ్‌వో అదనపు ధ్రువీకరణ పద్ధతులను ఉపయోగిస్తుంది. వీటిలో ఇవి ఉండవచ్చు..ఆన్లైన్ బ్యాంక్ కేవైసీ వెరిఫికేషన్: మీ బ్యాంక్ లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కేవైసీ వివరాలను నేరుగా తనిఖీ చేస్తుంది.డీఎస్సీ ద్వారా కంపెనీ వెరిఫికేషన్: డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డీఎస్సీ) ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా వివరాలను మీ కంపెనీ ధ్రువీకరించవచ్చు.సీడెడ్ ఆధార్ నంబర్ వెరిఫికేషన్: మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్‌ను యూఐడీఏఐ ధ్రువీకరిస్తుంది.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all
 

Business exchange section

Currency Conversion Rate

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 98000.00 98000.00 -200.00
Gold 22K 10gm 66500.00 66500.00 -200.00
Gold 24k 10 gm 72550.00 72550.00 -210.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name Rate Change%
Emkay Global Financial Services Ltd 174.7 13.5891
Ramco Systems Ltd 340.9 19.993
Sadbhav Engineering Ltd 34.85 -9.9483
Dangee Dums Ltd 7.95 -11.6667
Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement