Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

gold price today silver rate may 18
బంగారాన్ని మించి.. వెండి హడల్‌..

దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 18) ఆకాశాన్ని అంటాయి. నిన్నటి రోజున కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించిన బంగారం ధరలు ఈరోజు భారీగా ఎగిశాయి. తులం బంగారం రూ.880 మేర పెరిగింది.హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.800 పెరిగి రూ.68,400 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.870 పెరిగి రూ. 74,620 లను తాకింది.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,550 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.870 ఎగిసి రూ.74,770 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,400లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.870 పెరిగి రూ.74,620 లకు చేరుకుంది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,500ల​కు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.880 ఎగిసి రూ.74,730 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,400 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.870 పెరిగి రూ.74,620 లకు ఎగిసింది.రికార్డ్‌ స్థాయిలో వెండి ధరలుబంగారాన్ని మించి వెండి ధరలు హడలెత్తించాయి. దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రికార్డు స్థాయిలో రూ.4000 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Diamond company promoter buys Rs 97 crore apartment in Mumbai
47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్‌ కొన్న వజ్రాల వ్యాపారి

దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌గా పేరున్న ముంబై నగరంలో కోట్లాది రూపాయలు పెట్టి భవంతులు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ వజ్రాల వ్యాపారి సుమారు రూ.97 కోట్లు పెట్టి ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.రియల్‌ఎస్టేట్‌ సమాచార సంస్థ జాప్‌కీకి లభించిన పత్రాల ప్రకారం.. డైమండ్ కంపెనీ కిరణ్ జెమ్స్ ప్రమోటర్ మావ్‌జీభాయ్ షామ్‌జీభాయ్ పటేల్ ముంబైలోని పోష్ ఒబెరాయ్ 360 వెస్ట్‌లో రూ. 97.4 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. వర్లీలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ భవనాన్ని ముంబైలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్‌లో ఒకటిగా పరిగణిస్తారు.అపార్ట్‌మెంట్‌ భవనంలోని 47వ అంతస్తులో మావ్‌జీభాయ్‌ కొన్న ఫ్లాట్ 14,911 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ విస్తీర్ణాన్ని మరో 884 చదరపు అడుగులు విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పత్రాల ప్రకారం.. దీని విక్రేత ఒయాసిస్ రియాల్టీ భాగస్వామి అయిన స్కైలార్క్ బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అపార్ట్‌మెంట్ తొమ్మిది కార్ పార్కింగ్ స్లాట్‌లతో వస్తుంది. సేల్ డీడ్‌ ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీపై పటేల్ రూ.5.8 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.ముంబైలోని 360 వెస్ట్ ప్రాజెక్ట్‌ 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే యూనిట్‌లను కలిగి ఉంటుంది. రెండు టవర్లుగా ఉండే ఈ భవనంలో ఒక దాంట్లో రిట్జ్-కార్ల్‌టన్ హోటల్ ఉండగా మరో టవర్‌లో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. వీటిని గ్లోబల్ హాస్పిటాలిటీ చైన్ నిర్వహిస్తోంది. సముద్ర వీక్షణ ప్రాజెక్ట్ అయిన దీని ఎత్తు 360 మీటర్లు ఉండటం, అన్ని అపార్ట్‌మెంట్‌లు పడమర వైపు ఉన్నందున దీనికి ఈ పేరు వచ్చింది.

Major changes in ITR-1 for AY2024-25
ఐటీ రిటర్న్స్‌.. కీలక మార్పులు

ITR filing: ఆదాయపు పన్ను రిటర్న్స్‌ ఫైలింగ్ సీజన్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్స్‌ దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువు ఉంది. వ్యక్తులు, వ్యక్తిగత సంస్థలు లేదా సంఘాలు జూలై 31 లోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఐటీఆర్‌ ఫైల్ చేయవచ్చు.ఐటీఆర్‌-1 ఫారంఅత్యధిక పన్ను రిటర్న్స్‌ ఐటీఆర్‌-1 (ITR-1) ఫారం ద్వారానే దాఖలవుతాయి. దీన్ని సహజ్ ఫారం అని కూడా పిలుస్తారు. ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 50 లక్షలకు మించని వ్యక్తులు ఈ కేటగిరీ కింద రిటర్న్స్‌ ఫైల్ చేయడానికి అర్హులు. జీతం, ఒకే ఇంటి ఆస్తి, కుటుంబ పెన్షన్, వ్యవసాయం (రూ. 5,000 వరకు), పొదుపు ఖాతాల నుంచి వడ్డీ, డిపాజిట్లు (బ్యాంక్/పోస్ట్ ఆఫీస్/కోఆపరేటివ్ సొసైటీ), ఆదాయపు పన్ను రీఫండ్‌ వడ్డీ.. ఇలా వివిధ మార్గాలలో లభించే ఆదాయంపై పన్ను రిటర్న్స్‌ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది.ITR-1కి చేసిన కీలక మార్పులు2024-25 అసెస్‌మెంట్‌ ఇయర్‌కి గానూ ఐటీఆర్‌-1 ఫారం దాఖలులో ఆదాయపు పన్ను శాఖ పలు కీలక మార్పులు చేసింది. అవేంటంటే..ITR-1 ఫారమ్‌ను ఫైల్ చేసే వ్యక్తులు తమ పన్ను రిటర్న్ ఫైలింగ్‌లో తమకు ఇష్టమైన పన్ను విధానాన్ని పేర్కొనాలి.సెక్షన్ 115BACలో ఫైనాన్స్ యాక్ట్ 2023 ప్రవేశపెట్టిన సవరణలను అనుసరించి కొత్త పన్ను విధానం ఇప్పుడు డిఫాల్ట్ పన్ను విధానం. వ్యక్తులు, హోచ్‌యూఎఫ్‌లు, ఏఓపీలు, బీఓఐలకు కొత్త పన్ను విధానం స్వయంచాలకంగా వర్తిస్తుంది. పాత పన్ను విధానాన్ని కొనసాగించాలనుకునే వారు సెక్షన్ 115BAC(6) నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టంగా తెలియజేయాలి.వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయం కాకుండా ఇతర ఆదాయం ఉన్న వ్యక్తులు సెక్షన్ 139(1) ప్రకారం సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లో తప్పనిసరిగా తమ ప్రాధాన్య పన్ను విధానాన్ని పేర్కొనాలి.ఆర్థిక చట్టం 2023 ద్వారా ప్రవేశపెట్టిన సెక్షన్ 80CCH ప్రకారం.. 2022 నవంబర్ 1, ఆ తర్వాత అగ్నిపథ్ స్కీమ్‌లో చేరి అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్న వ్యక్తులు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమ చేసిన మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపునకు అర్హులు.ఈ మార్పునకు అనుగుణంగా, ITR-1 ఫారంను కొత్త కాలమ్‌ను పొందుపరుస్తూ సవరణలు చేశారు. సెక్షన్ 80CCH కింద మినహాయింపు కోసం అర్హత ఉన్న మొత్తానికి సంబంధించిన వివరాలను కొత్త ఐటీఆర్‌-1 ఫారం ద్వారా పన్ను చెల్లింపుదారులు అందించాల్సి ఉంటుంది.

Dish TV Smart+ Offering TV and OTT On Any Screen Anywhere
ఒకే ప్లాన్‌తో టీవీ చానళ్లు, ఓటీటీ యాప్‌లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఒకే ప్లాన్‌తో ఇటు టీవీ చానళ్లు, అటు ఓటీటీ యాప్స్‌ను కూడా పొందే విధంగా డిష్‌ టీవీ కొత్తగా స్మార్ట్‌ప్లస్‌ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్లాన్‌ కిందే వీటిని పొందవచ్చని సంస్థ సీఈవో మనోజ్‌ దోభల్‌ తెలిపారు.రూ. 200 ప్యాక్‌ నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. పాత, కొత్త కస్టమర్లు.. స్మార్ట్‌ప్లస్‌ కింద సదరు ప్లాన్‌లోని టీవీ ఛానళ్లతో పాటు డిఫాల్టుగా లభించే హంగామా వంటి అయిదు ఓటీటీ యాప్‌లతో పాటు జీ5, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్, సోనీ లివ్‌ తదితర యాప్‌ల నుంచి ఒకటి ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే మూడు రోజుల తర్వాత మరో యాప్‌నకు మారవచ్చు.పూర్తిగా 16 యాప్‌లు పొందాలంటే నెలకు రూ. 179 చార్జీ ఉంటుంది. కొత్త సర్వీసులతో మార్కెట్‌ వాటా 3–4 శాతం మేర పెంచుకోగలమని ఆశిస్తున్నట్లు మనోజ్‌ తెలిపారు. ప్రస్తుతం తమకు డీటీహెచ్‌ మార్కెట్లో 21 శాతం వాటా ఉందని వివరించారు. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో ఆండ్రాయిడ్‌ 4కే బాక్స్, క్లౌడ్‌ టీవీ వంటి ఉత్పత్తులు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు.

New Bentley Continental GT V8 PHEV Teased
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు

బెంట్లీ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త 'కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ' అధికారికంగా మార్కెట్లో లాంచ్ కాకముందే.. ఫోటోలు విడుదలయ్యాయి. ఇప్పటికి విడుదలైన ఫోటోల ప్రకారం.. బెంట్లీ కాంటినెంటల్ జీటీ మంచి స్టైలింగ్ అప్‌డేట్‌లను పొందుతుందని స్పష్టమవుతోంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ టియర్‌డ్రాప్ డిజైన్ హెడ్‌లైట్‌లను పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉండటం వల్ల మొత్తం డిజైన్ వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుందని స్పష్టమవుతోంది.బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ ఒక ఎలక్ట్రిక్ మోటార్‌తో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్, ఇంజిన్ రెండూ కలిసి 782 హార్స్ పవర్, 1001 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈవీ మొదట గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఆ తరువాత భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు తెలియాల్సి ఉంది.A new era is coming.Discover more: https://t.co/anuS4iG6oX-CO2 Emissions and fuel consumption data for EU27 is pending; subject to EU Type Approval pic.twitter.com/eJZih65PYf— Bentley Motors (@BentleyMotors) May 16, 2024

Every India Child Must Read This Book Says Infosys Narayana Murthy
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

"మేఘాలయ నుంచి కన్యాకుమారి వరకు, శ్రీనగర్ నుంచి జామ్‌నగర్" వరకు భారతదేశంలోని ప్రతి పిల్లవాడు చదవాల్సిన పుస్తకాలలో ఒకటి ఉందని ఇన్ఫోసిస్ 'నారాయణమూర్తి' ఇటీవల పేర్కొన్నారు. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన సూచించారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రస్తుతం 'కాన్సెప్టువల్ ఫిజిక్స్' చదువుతున్నట్లు పేర్కొన్నారు. పాల్ హెవిట్ అనే హైస్కూల్ టీచర్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.'కాన్సెప్చువల్ ఫిజిక్స్' మొదటిసారిగా 1971లో ప్రచురించారు. ఇందులో క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఆధునిక భౌతికశాస్త్రం వరకు సారూప్యతలు, సూత్రాల చిత్రాలతో వెల్లడించారు. ఇది పాఠకులను ఎంతగానో ఆకర్షిస్తుందని నారాయణ మూర్తి అన్నారు.

Rishi Sunak, Wife Akshata Murty Wealth Soars
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్‌లిస్ట్‌లో రిషి సునాక్‌ దంపతులు

ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా యూకే ప్రధాని రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి వ్యక్తిగత సందప అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిషిసునాక్‌ దంపతుల వ్యక్తిగత ఆస్తి 120 మిలియన్‌ యూరోలకు పెరిగింది. ‘సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ వార్షిక నివేదికలో రిషి సునాక్‌ దంపతుల ఆస్తుల వివరాల్ని వెల్లడించింది. అయితే యూకేలో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న వారి ఆస్తులు పెరిగిపోతుండడం గమనార్హం.ఇన్ఫోసిస్‌లో2023లో రిషి సునాక్‌ దంపతుల సంపద 529 యూరోల నుంచి 651 మిలియన్‌ యూరోలకు చేరింది. ఈ మొత్తం సంపద పెరుగుదల ఇన్ఫోసిస్‌లోని వాటానే కారణమని సమాచారం. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి వాటా విలువ 55.3 బిలియన్‌ యూరోలు. ఆమె షేర్ల విలువ 108.8 మిలియన్‌ యూరోలకు పెరగ్గా.. ఏడాది కాలానికి ఆ విలువ 590 యూరోలకు చేరింది. కింగ్ చార్లెస్ సంపదఇదిలా ఉండగా, కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో పెరిగిందని, 600 మిలియన్‌ యూరోల నుండి 610 మిలియన్‌ యూరోలకు పెరిగినట్లు సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌ నివేదించింది. అదే సమయంలో బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య తగ్గిపోయిందని ఈ నివేదిక హైలెట్‌ చేసింది. తగ్గిపోతున్న బిలియనీర్లు2022లో బిలియనీర్ల గరిష్ట సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా.. మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది .యూకేలోనూ భారతీయుల హవాబ్రిటన్‌లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్‌ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్‌ యూరోల నుండి 37.2 బిలియన్‌ యూరోలకు పెరిగింది.

Twitter Domain Name Change As A X
ట్విటర్‌ రీ బ్రాండింగ్‌పై మస్క్‌ ట్వీట్‌

ట్విటర్‌ పూర్తిగా ఎక్స్‌.కామ్‌గా రీబ్రాండ్‌ అయ్యింది. ఎక్స్‌.కామ్‌లో పలు కార్యకలాపాలు ట్విటర్‌ పేరు మీదే జరిగేవి. అయితే ఇప్పుడు పూర్తి ఎక్స్‌.కామ్‌ నుంచే జరుగుతున్నాయని ఆ సంస్థ అధినేత ఎలోన్‌ మస్క్‌ శుక్రవారం తెలిపారు.ఎలోన్‌ మస్క్‌ 2022 చివరిలో 44 బిలియన్ల డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల అనంతరం గత ఏడాది జులైలో ట్విటర్‌ను ఎక్స్‌. కామ్‌గా రీ బ్రాండ్‌ చేస్తున్నట్లు మస్క్‌ వెల్లడించారు. అయితే నిన్నటి వరకు ట్విటర్‌ లోగో, బ్రాండింగ్‌ మారింది. కానీ డొమైన్‌ పేరు ట్విటర్‌గా కొనసాగుతూ వచ్చింది. తాజాగా ట్విటర్‌.కామ్‌ డొమైన్‌ స్థానంలో ఇప్పుడు ఎక్స్‌.కామ్‌ వచ్చి చేరినట్లు మస్క్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. పోస్ట్‌ పోస్ట్ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్ చేయడం లేదా రీట్వీట్ చేసేందుకు గాను యూజర్లు కొద్ది మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని గత నెలలో మస్క్ ప్రకటించారు. ఆ మొత్తం సబ్‌స్క్రిప్షన్‌ ఏడాదికి రూ.100లోపు ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి ఈ సబ్‌స్క్రిప్షన్‌ పద్దతి న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో పరీక్షిస్తున్నారు. త్వరలో దీనిని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేసేందుకు మస్క్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. 2,500 కంటే ఎక్కువమంది ఫాలోవర్స్‌ కలిగి ఉన్న యూజర్‌ అకౌంట్‌లు ఎక్స్‌.కామ్‌లో ప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నట్లు మస్క్‌ ప్రకటించారు. 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉన్న అకౌంట్లకు ప్రీమియం ప్లస్‌ ఉచితంగా లభిస్తుంది అని మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Elon Musk claims aliens have never visited Earth
ఏలియన్స్‌ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్‌ ఏమన్నారంటే?

ఏలియన్స్‌.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్‌ కలిగించే టాపిక్‌. ఎలియన్స్‌ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఎలియన్స్‌ లేవని తేల్చేశారు. ఏలియన్స్‌ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్‌వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్‌ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్‌ లిస్ట్‌లోకి యాడ్‌ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఏలియన్స్‌ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.ఎలాన్‌ మస్క్‌..! ఈ జనరేషన్‌కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్‌ మస్క్‌.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్‌ను చూపించిన ఘనత ఎలాన్‌ మస్క్‌కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్‌లో చిప్‌ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్‌ ఎక్స్‌ పేరుతో శాటిలైట్‌లు లాంచ్‌ చేసినా.. సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్‌ అని పేరు మార్చినా అది.. ఎలాన్‌ మస్క్‌కే సాధ్యం.అలాంటి ఇలాన్‌ మస్క్‌.. ఏలియన్స్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్‌ లేవని మస్క్‌ తేల్చిపారేశారు. ఏలియన్స్‌ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్‌లో పాల్గొన్న మస్క్‌.. ఏలియన్స్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్‌ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్‌ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్‌ బ్యాండ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్‌ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్‌ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్‌ ఉనికే లేదని చెప్పేశారు.మరి నిజంగానే ఏలియన్స్‌ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్‌ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్‌ మస్క్‌ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..!

Stock Market Rally On Today Closing
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 22,464 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 249 పాయింట్లు పుంజుకుని 73,917 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఎం అండ్‌ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, మారుతీసుజుకీ, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.టీసీఎస్‌, నెస్లే, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, భారతీఎయిర్‌టెల్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 92500.00 92500.00 0.00
Gold 22K 10gm 67600.00 67600.00 -250.00
Gold 24k 10 gm 73750.00 73750.00 -270.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement