Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Rbi Governor Shaktikanta Das Cast His Vote
ప్రతి భారతీయుడికి ఓ గర్వకారణం.. ఎన్నికల పోలింగ్‌పై ఆర్‌బీఐ గవర్నర్‌

దేశంలో 5వ విడుత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో ముఖేష్‌ అంబానీ సోదరులు అనిల్‌ అంబానీ, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ముంబైలోని పెద్దార్ రోడ్డులోని యాక్టివిటీ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి గవర్నర్ తన భార్య, కుమార్తెతో కలిసి వచ్చారు. ఓటు వేసిన అనంతరం..140 కోట్ల మంది ప్రజలు ఎన్నికల‍్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వించదగ్గ తరుణం. ప్రతి భారతీయుడికి ఓ గర్వకారణం అని అన్నారు. ఆర్థిక విషయాల గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని, జూన్ 7న తదుపరి ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం వరకు వేచి చూడాల్సిందేనని అన్నారు. #WATCH | Industrialist Anil Ambani casts his vote at a polling booth in Mumbai, for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/2CpXIZ6I0l— ANI (@ANI) May 20, 2024 మనదేశానికి ఎంతో గర్వకారణమైన ఈ ఎన్నికల్లో దేశ పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శక్తికాంత దాస్‌ విజ్ఞప్తి చేశారు. ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఎంతో కఠినమైన ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిగేలా అహర్నిశలు శ్రమిస్తున్న భారత ఎన్నికల సంఘానికి, ఎన్నికల‍్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు.కాగా, దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజక వర్గాలకు (మే 20న)ఈ రోజు పోలింగ్‌ కొనసాగుతోంది.

Godfather Of AI Warns About Massive Job Losses
‘AI’తో ప్రమాదమే.. గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ వార్నింగ్‌

ఆటోమేటిక్‌గా నడిచే కార్లు, బైక్‌లు.. ఇలా ఎక్కడ చూసినా కృత్రిమ మేధ మన జీవితంలో ఓ భాగంగా మారిపోతోంది. అయితే దీంతో చాలా పనులు సులభంగా పూర్తవుతున్నందుకు సంతోషంగానే ఉన్నా.. ఇది మన ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడుతుందోనన్న భయం నెలకొంది. తాజాగా, గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ జెఫ్రీ హింటన్ సైతం ఇదే ఆందోళనను వెలిబుచ్చారు. ఓ ఇంటర్వ్యూలో అన్నీ రంగాల్లో పెరిగిపోతున్న ఏఐ వినియోగం గురించి చర్చించారు. రానున్న రోజుల్లో దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో హెచ్చరించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడంపై జెఫ్రీ హింటన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏఐ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ప్రపంచానికి ఆదాయం అవసరమని, అలాంటి అవకాశాల్ని ప్రభుత్వాలే సృష్టించాలని తెలిపారు. ఇక లేఆఫ్స్‌ గురైన ఉద్యోగులకు ప్రభుత్వాలు బేసిక్‌ పే శాలరీ చెల్లిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

RBI likely to transfer Rs 1 lakh crore to govt
లక్ష కోట్ల డివిడెండ్?.. కేంద్రానికి చెల్లించనున్న ఆర్బీఐ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు ఎకనమిక్స్‌ టైమ్స్‌ నివేదించింది. కేంద్రం ట్రెజరీ బిల్లుల ద్వారా తన రుణాలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ మొత్తం రూ .60,000 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆమొత్తాన్ని కేంద్రం ఆర్‌బీఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సెంట్రల్‌ బ్యాంక్‌ .. కేంద్రానికి లక్షకోట్ల డివిడెండ్‌ను చెల్లించనుంది.అయితే దీనిపై ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆర్బీఐ దగ్గర ఎన్ని నగదు నిల్వలుంటే అంత మంచిదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అనిశ్చితి సమయాల్లో దేశ ఆర్ధిక వ్యవస్థకు అండగా ఉంటాయి. కానీ కేంద్రం ముక్కుపిండి వసూలు చేస్తున్న డివిడెండ్లు.. ప్రమాదం తెచ్చిపెట్టవచ్చని హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో తీసుకుంటున్న డివిడెండ్లు సరికాదన్న అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చుతున్నారు.

Today Gold Rate In India
దేశంలో బంగారం ధరలు .. ఎలా ఉన్నాయంటే?

గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు (మే 20) పసిడి అత్యంత స్వల్పంగా తగ్గింది.ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటేహైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,390 వద్ద ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ. 74,610 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,540 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.74,760గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,610గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,490 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.74,7200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.68,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,610 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Air India Passenger Flying From New York To Delhi Shared A Viral Video On Instagram
ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం

ఎయిరిండియా విమానంలో సౌకర్యాలపై ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. అకల్ ధింగ్రా న్యూయార్క్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియాలో విమానంలో ప్రయాణించారు. ప్రయాణంలో తాను ఆహారం, చైర్లు ఇతర సదుపాయాలపై అసౌకర్యానికి గురయ్యాడు. మరో నెలలో ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళుతున్నానని, పొరపాటున కూడా ఎయిరిండియా విమానం ఎక్కబోనంటూ ఆ వీడియోలో తెలిపాడు.అకల్‌ ధింగ్రా వీడియోలో స్లైడింగ్ టేబుల్ సరిగా పనిచేయకపోవడం, దెబ్బతిన్న హెడ్‌ఫోన్ జాక్ వంటి అనేక సమస్యల్ని ఎత్తి చూపాడు. విమానంలో అందించిన ఆహారం కూడా నాణ్యతగా లేదని కూడా చెప్పాడు. చివరగా.. ‘న్యూయార్క్‌ నుండి ఢిల్లీకి నా ఎయిర్ ఇండియా విమానం విపత్తు!’ అని వీడియో క్యాప్షన్‌లో జతచేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు ఎయిరిండియా విమాన ప్రయాణంలో తమకు చేదు అనుభవాలున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Akul Dhingra (@akuldhingra)

Who Is Noland Arbaugh And How Neuralink First Brain Implant
న్యూరాలింక్‌ అద్భుతం, బ్రెయిన్‌లో చిప్‌ను అమర్చి.. ఆపై తొలగించి

ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలోన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ కంపెనీ న్యూరోటెక్నాలజీలో అరుదైన ఘనతను సాధించింది. ఈ ఏడాది మార్చిలో పక్షవాతానికి గురైన ఓ యువకుడి బ్రెయిన్‌ (పుర్రెభాగం- skull)లో చిప్‌ను విజయవంతంగా అమర్చింది. అయితే సమస్యలు ఉత్పన్నం కావడంతో ఆ చిప్‌ను వైద్యులు తొలగించారు. చిప్‌లోని లోపాల్ని సరిచేసి మరోసారి బ్రెయిన్‌లో అమర్చారు.ఇప్పుడా యువకుడు చేతుల అవసరం లేకుండా కేవలం తన ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్‌ సాయంతో కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నాడు. ఈ సందర్భంగా టెక్నాలజీ తన జీవితాన్ని మార్చేసిందంటూ భావోద్వేగానికి గురవుతున్నాడు.పక్షవాతంతో వీల్‌ ఛైర్‌కే2016లో సమ్మర్‌ క్యాప్‌ కౌన్సిలర్‌గా పనిచేసే సమయంలో నోలాండ్‌ అర్బాగ్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని వెన్నుముక విరిగి పక్షవాతంతో వీల్‌ ఛైర్‌కే పరిమితమయ్యాడు.ఎన్‌1 అనే చిప్‌ సాయంతోమెడకింది భాగం వరకు చచ్చుపడిపోవడంతో తాను ఏ పనిచేసుకోలేకపోయేవాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్‌ ఈ ఏడాది మార్చిలో నోలాండ్‌ అర్బాగ్‌ పుర్రెలో ఓ భాగాన్ని తొలగించి అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్‌1 అనే చిప్‌ను చొప్పించింది. ఇదే విషయాన్ని మస్క్‌ అధికారింగా ప్రకటించారు.Livestream of @Neuralink demonstrating “Telepathy” – controlling a computer and playing video games just by thinking https://t.co/0kHJdayfYy— Elon Musk (@elonmusk) March 20, 2024 డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికిఈ నేపథ్యంలో ఆర్బాగ్‌ బ్రెయిన్‌లో అమర్చిన చిప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో న్యూరాలింక్‌ సంస్థ బాధితుడి బ్రెయిన్‌ నుంచి చిప్‌ను తొలగించింది. ఆపై సరిచేసి మళ్లీ ఇంప్లాంట్‌ చేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చిప్‌ తొలగించిన తాను భయపడినట్లు నోలాండ్‌ అర్బాగ్‌ చెప్పారు.న్యూరాలింక్ అద్భుతం చేసింది‘ఈ చిప్‌ నా జీవితాన్ని మార్చేసింది. కానీ చిప్‌లో డేటా పోవడంతో.. చిప్ అమర్చిన తర్వాత గడిపిన అద్భుత క్షణాల్ని కోల్పోతాననే భయం మొదలైంది. అయినప్పటికీ, న్యూరాలింక్ అద్భుతం చేసింది. సాంకేతికతకు మార్పులు చేసి మెరుగుపరచగలిగింది’ అంటూ గుడ్‌ మార్నింగ్‌ అమెరికా ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్‌ చేశారు నోలాండ్‌ అర్బాగ్‌

Indian Pilot Gopi Thotakura Takes Space Tour On Blue Origin Flight
స్పేస్‌లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం

స్పేస్‌ టూరిజంలో అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్‌ మరో అడుగు ముందుకు వేసింది. బ్లూ ఆరిజన్‌ సంస్థ టెక్సాస్‌ కేంద్రంగా అంతరిక్షం అంచు వరకు వెళ్లే మానవ రాకెట్‌ ప్రయోగాన్ని ప్రారంభించింది. బ్లూ ఆరిజన్‌ న్యూ షెపర్డ్‌ మిషన్‌ ఎన్‌ఎస్‌-25 మిషన్‌ను పశ్చిమ టెక్సాస్‌లోని లాంచ్ సైట్ వన్ నుండి మే 19న ఉదయం 8.30 (భారత్‌ కాలమాన ప్రకారం..సాయంత్రం 7.30) గంటలకు రాకెట్‌ బయలుదేరుతుంది. ఈ ఎన్‌ఎస్‌ -25 మెషిన్‌లో భారత్‌కు చెందిన గోపి తోటకూర సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు.కాగా, గోపి తోటకూరతో పాటు వెంచర్‌ క్యాపిలిస్ట్‌ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్‌ బిజినెస్‌మెన్ సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్‌ బిజినెస్‌మెన్ కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్‌ షాలర్‌, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్‌ ఎడ్‌ డ్వైట్‌.. ఈ స్పేస్ యాత్రకు వెళ్లారు.

Attero To Invest Over Rs 8 000 Crore Details
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?

ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ 'అటెరో' వచ్చే ఐదేళ్లలో సుమారు రూ. 8300 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈవో, కో ఫౌండర్ 'నితిన్ గుప్తా' తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సంవత్సరానికి 1,44,000 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను(ఈ-వేస్ట్ ), 15,000 టన్నుల లిథియం అయాన్ బ్యాటరీని రీసైకిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాబోయే రోజుల్లో ఈ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సంస్థ ఈ పెట్టుబడి పెట్టింది.సంస్థ ప్రతి ఏటా 100 శాతం వృద్ధి సాధిస్తోందని, ఈ క్రమంలోనే సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఐరోపా దేశంలో ఇప్పటికే తన కార్యకలాపాలనను ప్రారంభించింది. భారతదేశంలో మరొక గ్రీన్‌ఫీల్డ్ సౌకర్యాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ / జార్ఖండ్‌లో స్థలాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం.కంపెనీ తన ఉనికిని విస్తరించిన తరువాత రీసైక్లింగ్ కెపాసిటీ ఏడాదికి 50000 టన్నులకు చేరుతుంది. ప్రస్తుతానికి కంపెనీ రీసైక్లింగ్ సామర్థ్యం 415000 టన్నులు అని తెలుస్తోంది. కంపెనీ 2027 నాటికి దాదాపు రూ. 16500 కోట్ల ఆదాయం గడించాలని యోచిస్తోంది. 2023లో కంపెనీ ఆదాయం రూ. 285 కోట్లు, 2024లో రూ. 440 కోట్లు.అటెరోకు ప్రస్తుతం 25 శాతం మార్కెట్ వాటా అది. ఇది వచ్చే ఏడాదికి 35 శాతానికి పెరుగుతుంది. అయితే మార్కెట్ వాటా పరంగా కంపెనీ దాని ప్రత్యర్థుల కంటే 10 శాతం తక్కువగా ఉంటుందని సమాచారం. రాబోయే రోజుల్లో కంపెనీ గణనీయమైన వృద్ధి సాదిస్తుందని భావిస్తున్నట్లు నితిన్ గుప్తా పేర్కొన్నారు.

Mahindra To Launch 16 New Models In India By 2030 Details
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో రాబోయే 6 సంవత్సరాల్లో ఏకంగా 16 కొత్త కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. 2030 నాటికి 9 ఫ్యూయెల్ కార్లు, 7 ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని సంస్థ యోచిస్తోంది.కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేయడంతో పాటు తన వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి యోచిస్తోంది. దీనికోసం మహీంద్రా రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో 27,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. కంపెనీ ప్యాసింజర్ వాహనాలను మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాలను విడుదల చేస్తూ దేశీయ విఫణిలో, గ్లోబల్ మార్కెట్లో కూడా దూసుకెళ్తోంది.మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL)లో కంపెనీ ఇప్పటికే రూ. 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి మాత్రమే కాకుండా.. మార్కెట్లో కంపెనీ ఉత్పత్తుల డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించనుంది.ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ 10000 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సంఖ్య FY2026 నాటికి 18000 చేరే అవకాశం ఉంది. కాగా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి FY2025 చివరి త్రైమాసికం నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.

Do You Know How Many Bank Accounts Should You Have
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్‌బీఐ ఏం చెబుతోంది?

ఈ రోజుల్లో దాదాపు పుట్టిన బిడ్డ దగ్గర మొదలుకొని.. అందరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఏమైనా సమస్య వస్తుందా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఓ సంస్థ నుంచి మరో సంస్థకు మారిన ప్రతిసారీ బ్యాంక్ అకౌంట్ కూడా మారుతుంది. ఇలా ఒక వ్యక్తికి కనీస నాలుగు లేదా ఐదు అకౌంట్స్ ఉంటాయి. ఉద్యోగులకు మాత్రమే కాకుండా రైతులకు, సాధారణ వ్యక్తులకు కూడా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఒక వ్యక్తికి ఇన్ని అకౌంట్స్ మాత్రమే ఉండాలి అనే నిబంధన విధించలేదు. కాబట్టి ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా ఉండవచ్చు. అయితే ప్రతి ఖాతాలోనూ మినిమమ్ బ్యాలెన్స్ అనేది ఉంచాల్సి ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా దాని కొంత మొత్తంలో ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. అయితే అన్ని బ్యాంకులు ఇలా ఫైన్ వేస్తాయని చెప్పలేము.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 92500.00 92500.00 0.00
Gold 22K 10gm 67600.00 67600.00 -250.00
Gold 24k 10 gm 73750.00 73750.00 -270.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement