Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Google Doodle today 4th phase of Lok Sabha Elections 2024 begins
గూగుల్‌కు ఓటింగ్‌ శోభ!

లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్‌ ఈరోజు ప్రారంభమైంది. దేశంలోని ప్రతి ఓటరు చూపుడు వేలు ఇంక్‌తో మెరిసే తరుణమిది. ఈ ప్రజాస్వామ్య పండుగ గూగుల్‌కు కొత్త శోభ తెచ్చింది. ఇంక్‌ అద్దిన వేలుతో సరికొత్త గూడుల్‌ను గూగుల్‌ సెర్చ్‌ పేజీపై ప్రదర్శిస్తోంది.దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నాల్గవ దశ ఓటింగ్ ప్రారంభమైంది. అదనంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 స్థానాలు, ఒడిశాలోని 28 స్థానాలకు కూడా ఈరోజు పోలింగ్ జరగనుంది. 4వ దశ ఎన్నికలలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.సార్వత్రిక ఎన్నికలలో నాల్గవ దశ ఓటింగ్‌పై నేటి గూగుల్ డూడుల్ భారత్‌లోని యూజర్లకు మాత్రమే కనిపిస్తుంది. అంతకుముందు, ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీలలో జరిగిన మునుపటి దశల పోలింగ్‌ అప్పుడు కూడా ఇంక్డ్ ఫింగర్ ఐకాన్ లోగోతో గూగుల్ డూడుల్ మెరిసింది.ఈరోజు పోలింగ్‌ జరుగుతన్న మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్‌లో 8, పశ్చిమ బెంగాల్‌లో 8, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్‌లో 1 ఉన్నాయి.

Real Estate vs Equity Investment in India: Comparative Analysis
పెట్టుబడి మొత్తం ఈక్విటీలకేనా?

సంపాదనను సంపదగా మార్చుకోవాలంటే అనుకూలమైన వేదికల్లో ఈక్విటీ ముందుంటుంది. రియల్‌ ఎస్టేట్‌ సైతం దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టికి మార్గమవుతుంది. కానీ, ఈక్విటీ మాదిరి సులభమైన లిక్విడిటీ సాధనం రియల్‌ ఎస్టేట్‌ కాబోదు. మొత్తం పెట్టుబడిని ఒకటి రెండు రోజుల్లోనే వెనక్కి తీసుకోవడానికి స్టాక్‌ మార్కెట్‌ వీలు కలి్పస్తుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఈ విభాగం వైపు అడుగులు వేయడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి. అయితే, ఒకరి పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులు ఎంత మేర ఉండాలి..? రిటైల్‌ ఇన్వెస్టర్లలో చాలా మంది దీనికి సూటిగా బదులు ఇవ్వలేరు. ఈక్విటీల జిగేల్‌ రాబడులు చూసి చాలా మంది తమ పెట్టుబడులు మొత్తాన్ని స్టాక్స్‌లోనే పెట్టేస్తుంటారు. ఇలా చేయడం ఎంత వరకు సబబు? అసలు ఈ విధంగా చేయవచ్చా? ఒకరి పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉండాలి? ఈ విషయాలపై స్పష్టత కోసం కొన్ని కీలక అంశాలను ఒకసారి మననం చేసుకోవాల్సిందే. మీరు ఎలాంటి వారు? బుల్‌ మార్కెట్లో రిస్క్‌ తీసుకునేందుకు వెనుకాడకపోవడం.. బేర్‌ మార్కెట్లో రిస్‌్కకు దూరంగా ఉండడం రిటైల్‌ ఇన్వెస్టర్లలో కనిపించే సాధారణ లక్షణం. సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం. ‘‘ఇతరులు అత్యాశ చూపుతున్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయపడుతున్నప్పడు అత్యాశ చూపాలి’’ అన్నది బఫెట్‌ స్వీయ అనుభవ సారం. మెజారిటీ రిటైల్‌ ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పైగా తమ రిస్క్‌ స్థాయి ఎంతన్నది కూడా పరిశీలించుకోరు. పెట్టుబడిపై భారీ రాబడుల అంచనాలే వారి నిర్ణయాలను నడిపిస్తుంటాయి. దీర్ఘకాలంలో స్టాక్‌ మార్కెట్లో రాణించాలంటే ఇలాంటి ప్రతికూల ధోరణలు అస్సలు పనికిరావు. అత్యవసర నిధి ఉన్నట్టుండి ఉపాధి కోల్పోయి ఏడాది, రెండేళ్ల పాటు ఎలాంటి ఆదాయం రాకపోయినా జీవించగలరా? ప్రతి ఒక్కరూ ఒకసారి ఇలా ప్రశ్నించుకోవాలి. లేదంటే ఏడాది, రెండేళ్ల జీవన అవసరాలు తీర్చే దిశగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాల్సిందే. దీర్ఘకాలం కోసమేనా?దీర్ఘకాలం అంటే ఎంత? అనే దానిపై ఇన్వెస్టర్లలో భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు 2–3 ఏళ్లు, కొందరు 5–10 ఏళ్లను దీర్ఘకాలంగా భావిస్తుంటారు. కానీ, ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేసే వారు స్వల్పకాలాన్ని మరిచి.. అవసరమైతే దశాబ్దాల పాటు ఆ పెట్టుబడులు కొనసాగించే మైండ్‌సెట్‌తో ఉండాలి. బేర్‌ మార్కెట్‌ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్‌ మార్కెట్‌ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్‌ మార్కెట్‌ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్‌ మార్కెట్‌ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్‌ మార్కెట్‌లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్‌ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్‌ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్‌ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. నూరు శాతం కాదు..? ఎన్ని చెప్పుకున్నా.. మధ్యమధ్యలో అనుకోని ఆర్థిక అవసరాలు ఎదురవుతుంటాయి. కనుక సామాన్య మధ్యతరగతి ఇన్వెస్టర్లు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకుకోవడం సమంజసం కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇలాంటి వారు ఒకటి కంటే ఎక్కువ సాధనాల మధ్య పెట్టుబడులు వర్గీకరించుకోవాలి (అస్సెట్‌ అలోకేషన్‌). ఏ సాధనంలో ఎంతమేర అన్నది నిర్ణయించుకోవాలంటే.. విడిగా ఒక్కొక్కరి ఆరి్ధక అవసరాలు, లక్ష్యాలు, ఆశించే రాబడులు, రిస్క్‌ సామర్థ్యం, పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న కాల వ్యవధి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అస్సెట్‌ అలోకేషన్‌ అంటే? ఒకరు రూ.100 ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే.. ఇందులో ఈక్విటీకి ఎంత, డెట్‌కు ఎంత అన్నది నిర్ణయించుకోవడం. ఈ రెండు సాధనాలే కాదు, బంగారం, రియల్‌ ఎస్టేట్‌ తదితర సాధనాలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరికైనా ఈ నాలుగు సాధనాలు సరిపోతాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తుంటే ఈక్విటీ ఫండ్స్, డెట్‌ ఫండ్స్, గోల్డ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డెట్‌లో రిస్క్‌ డెట్‌లో రిస్క్‌ లేదా? అంటే లేదని చెప్పలేం. ఇందులో వడ్డీ రేట్లు, క్రెడిట్‌ రిస్క్‌ ఉంటాయి. అందుకే ఏఏఏ రేటెడ్‌ సాధనాల ద్వారా క్రెడిట్‌ రిస్‌్కను దాదాపు తగ్గించుకోవచ్చు. డెట్‌కు సింహ భాగం, కొంత శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే ‘ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌’ను సైతం అరుణ్‌ కుమార్‌ సూచించారు.బేర్‌ మార్కెట్‌ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్‌ మార్కెట్‌ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్‌ మార్కెట్‌ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్‌ మార్కెట్‌ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్‌ మార్కెట్‌లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్‌ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్‌ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్‌ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. రాబడులు దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తే కచి్చతంగా రాబడులే వస్తాయా? నిఫ్టీ 50 టీఆర్‌ఐ (రోలింగ్‌ రాబడులు) ఐదేళ్ల కాల పనితీరును గమనిస్తే ఒక్కో ఏడాది 47 శాతం పెరగ్గా, ఒక ఏడాది మైనస్‌ 1 శాతం క్షీణించింది. 2007 నుంచి 2023 మధ్య ఒక ఏడాది 52 శాతం, మరొక ఏడాది 25 శాతం వరకు నిఫ్టీ సూచీ నష్టపోయింది. కానీ, 55 శాతం, 76 శాతం రాబడులు ఇచి్చన సంవత్సరాలూ ఉన్నాయి.ఏ సాధనానికి ఎంత? సాధారణంగా ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాం. కనుక 20–30 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 70–80 శాతం వరకు కేటాయించుకున్నా పెద్ద రిస్క్‌ ఉండబోదు. ఎందుకంటే వారు తమ పెట్టుబడులను దీర్ఘకాలంపాటు అంటే 20 ఏళ్ల పాటు కొనసాగించే వెసులుబాటుతో ఉంటారు. అదే 30–40 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 50–70 శాతం మధ్య కేటాయించుకోవచ్చు. అంతకుపైన వయసున్న వారు 50 శాతం మించకుండా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. 70 శాతం ఈక్విటీ కేటాయింపులు చేసుకునే వారు 20 శాతం డెట్‌కు, 10 శాతం బంగారంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. 50 శాతం ఈక్విటీలకు కేటాయించే వారు 30–40 శాతం డేట్‌కు, బంగారానికి 10 శాతం వరకు కేటాయించొచ్చు. ఈ గణాంకాలన్నీ సాధారణీకరించి చెప్పినవి. విడిగా చూస్తే, 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి 5 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని అనుకుందాం. అటువంటప్పుడు పిల్లల ఉన్నత విద్యకు 10–15 ఏళ్ల కాలంలో నిరీ్ణత మొత్తం కావాల్సి వస్తుంది. అటువంటప్పుడు పెట్టుబడులకు 10–15 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక ఈక్విటీలకు 70 శాతం వరకు, మిగిలినది డెట్, గోల్డ్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు. పిల్లల వివాహం కోసం అయితే 20 ఏళ్లు, రిటైర్మెంట్‌ కోసం అయితే 30 ఏళ్ల కాలం ఉంటుంది. వీటి కోసం కూడా ఈక్విటీలకు గణనీయమైన కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ ఐదేళ్లలోపు లక్ష్యాలు అయితే 80 శాతం డెట్‌కు, 20 శాతం ఈక్విటీలకు (ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌) కేటాయించుకోవచ్చు. మూడేళ్ల లక్ష్యాల కోసం అయితే పూర్తిగా డెట్‌కే పరిమితం కావడం శ్రేయస్కరం.3టీ కార్యాచరణ అస్సెట్‌ అలోకేషన్‌ విషయంలో మూడు ‘టీ’ల కార్యాచరణను ఫండ్స్‌ ఇండియా రీసెర్చ్‌ హెడ్‌ అరుణ్‌ కుమార్‌ తెలియజేశారు. మొదటిది కాలం (టైమ్‌). ‘‘చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో డెట్‌ (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌)తో పోలి్చనప్పుడు ఈక్విటీలే మెరుగైన పనితీరు చూపించాయి. కానీ స్వల్పకాలంలో 10–20 శాతం వరకు పతనాలు కనిపిస్తుంటాయి. అలాగే ఏడు–పదేళ్లకోసారి 30–60 శాతం వరకు పతనాలు కూడా సంభవిస్తుంటాయి. గత 40 ఏళ్ల చరిత్ర చూస్తే ఇదే తెలుస్తుంది. కానీ, ఈ 10–20 శాతం దిద్దుబాట్లు 30–60 శాతం పతనాలుగా ఎప్పుడు మారతాయన్నది ఎవరూ అంచనా వేయలేరు. ఇలాంటి పతనాలను ఎక్కువ మంది తట్టుకోలేరు. అందుకే పోర్ట్‌ఫోలియోలో డెట్‌ను చేర్చుకోవాలి. ఇది నిలకడైనది. దీర్ఘకాలంలో రాబడి 5–7 శాతం మధ్యే ఉంటుంది. కనుక ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్న విషయంలో కాలాన్ని చూడాలి. ఎంత ఎక్కువ కాలం ఉంటే, ఈక్విటీలకు ఎక్కువ పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. రెండోది టోలరెన్స్‌(టీ). అంటే నష్టాలను భరించే సామర్థ్యం. స్వల్పకాలంలో 10–20 శాతం పతనాలను తట్టుకునే సామర్థ్యం లేని వారు డెట్‌ కేటాయింపులు మరికాస్త పెంచుకోవచ్చు. ఈక్విటీలకు 50 శాతమే కేటాయించుకుంటే తరచూ వచ్చే పతనాల ప్రభావం తమ పోర్ట్‌ఫోలియోపై 10 శాతం, ఏడు–పదేళ్లకోసారి వచ్చే భారీ పతన ప్రభావాన్ని 25 శాతానికి తగ్గించుకోవచ్చు. మూడోది. ట్రేడాఫ్‌ (టీ). పెట్టుబడికి దీర్ఘకాలం ఉన్నప్పటికీ నష్టాల భయంతో రాబడుల్లో రాజీపడడం. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీల్లో దీర్ఘకాలం సగటు వార్షిక రాబడి) సంపాదిస్తే 20 ఏళ్లలో పెట్టుబడి 10 రెట్లు అవుతుంది. రాబడి ఏటా 10 శాతమే ఉంటే 20 ఏళ్లలో పెట్టుబడి ఏడు రెట్లే పెరుగుతుంది. 8 శాతం వార్షిక రాబడే వస్తే 20 ఏళ్లలో పెట్టుబడి ఐదు రేట్లే వృద్ధి చెందుతుంది. డెట్‌కు కేటాయింపులు పెంచుకున్నకొద్దీ అంతిమంగా నికర రాబడులు తగ్గుతుంటాయి’’ అని అరుణ్‌ కుమార్‌ వివరించారు. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే వారు 70–80 శాతం లార్జ్‌క్యాప్‌నకు, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు 10–15 శాతం, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌కు 5–10 శాతం మధ్య కేటాయించుకోవచ్చని సూచించారు. ఫండ్స్‌ ద్వారా అయినా సరే ఇంతే మేర ఆయా విభాగాల ఫండ్స్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు.

Sales in Gold ETFs
గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు..

న్యూఢిల్లీ: గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లలో గత నెల (ఏప్రిల్‌) ఇన్వెస్టర్లు నికరంగా రూ. 396 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే, గోల్డ్‌ ఫండ్స్‌ నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) మార్చి నెలాఖరున ఉన్న రూ. 31,224 కోట్ల నుంచి 5 శాతం పెరిగి రూ. 32,789 కోట్లకు చేరింది. రూపాయి మారకంలో చూస్తే పసిడి గత ఏడాది వ్యవధిలో మెరుగైన పనితీరే కనపర్చినప్పటికీ ఈక్విటీలతో పోలిస్తే తక్కువేనని మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా అనలిస్ట్‌ మెలి్వన్‌ శాంటారీటా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈటీఎఫ్‌లలో మదుపరులు కొంత లాభాలు స్వీకరించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. దీంతో ధర పెరిగినా ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులు నికరంగా తరలిపోయి ఉంటాయని వివరించారు. 2023 మార్చి తర్వాత గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం ఇదే ప్రథమం. మ్యుచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫీ) డేటా ప్రకారం గతేడాది మార్చిలో నికరంగా రూ. 266 కోట్లు తరలిపోయాయి. తాజాగా మార్చిలో రూ. 373 కోట్లు వచ్చాయి. ఇక, గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ఫోలియోల సంఖ్య మార్చిలో 50.61 లక్షలుగా ఉండగా.. ఏప్రిల్‌లో సుమారు 1 లక్ష పెరిగి రూ. 51.94 లక్షలకు చేరింది. 2022లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ. 459 కోట్లు రాగా, 2023లో దానికి అనేక రెట్లు అధికంగా రూ. 2,920 కోట్లు వచ్చాయి. గతేడాది నెలకొన్న పరిస్థితుల కారణంగా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా, ద్రవ్యోల్బణానికి తగిన హెడ్జింగ్‌ సాధనంగా పసిడికి ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారడం తదితర అంశాల వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపారు.

Inflation data, Q4 earnings, global trends to drive stock says market experts
సూచీల స్థిరీకరణ కొనసాగొచ్చు

ముంబై: ద్రవ్యోల్బణ డేటా, క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్‌ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్‌ నిపుణులు తెలిపారు. ప్రపంచ పరిణామాలు, ఎన్నికల సరళిపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు తీరుతెన్నులపైనా దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్‌ ఇండెక్స్, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్, క్రూడాయిల్‌ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి దృష్ట్యా దేశీయ ఈక్విటీ మార్కెట్‌ ప్రస్తుత ట్రెండ్‌ స్వల్పకాలికానికి పరిమితమైంది. కావున సూచీలు స్థిరీకరణ కొంతకాలం కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా 22,300 స్థాయిని చేధించి, కొంతకాలం ఈ స్థాయిని నిలుపుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ప్రస్తుతానికి 21,900 వద్ద తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా కన్జూమర్‌ ద్రవ్యోల్బణ అంచనాలు (సోమవారం), జపాన్‌ మెషనరీ టూల్‌ ఆర్డర్ల డేటా, భారత రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు (మంగళవారం), యూరోజోన్‌ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్‌ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్‌ రిటైల్‌ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్‌ ఏప్రిల్‌ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. జొమాటో, ఐనాక్స్‌ ఇండెక్స్, వరుణ్‌ బేవరేజెస్, భారతీ ఎయిర్‌టెల్, పీవీఆర్‌ ఐనాక్స్, రాడికో ఖైతాన్, ఎడెలీ్వజ్‌ ఫైనాన్సియల్‌ సరీ్వసెస్, ఆంధ్రా సిమెంట్, పీఎఫ్‌సీ, ఆర్‌వీఎన్‌ఎల్, టిటాఘర్‌ వికాస్‌ నిగమ్‌ కంపెనీలు ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. పది రోజుల్లో రూ.17వేల కోట్లు వెనక్కి విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల తొలి 10 రోజుల్లో రూ.17వేల కోట్ల దేశీయ ఈక్విటీలను విక్రయించారు. ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. గత ఏప్రిల్‌లో మొత్తం ఉపసంహరణ రూ.8,700 కోట్ల పోలిస్తే ఇది ఎక్కువ. ‘‘ఎన్నికల ఫలితాలతోపాటు గత ఆర్థిక సంవత్సరం కార్పొరేట్‌ సంస్థల మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు కేంద్రీకరించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ విదేశీ పోర్ట్‌ ఫోలియో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తారు’’ అని ట్రేడ్జిని సీఓఓ త్రివేష్‌ డీ పేర్కొన్నారు.

60percent of millennials are choosing new age fractional investment
పాక్షిక పెట్టుబడుల్లో మిలీనియల్స్‌

న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పెట్టుబడులు యువ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని డిజిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ గ్రిప్‌ ఇన్వెస్ట్‌ తెలిపింది. పాక్షిక పెట్టుబడుల్లో (ఫ్రాక్షనల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌) మిలీనియల్స్‌ ఇన్వెస్టర్ల సంఖ్య 60 శాతం ఉందని వెల్లడించింది. గ్రిప్‌ ఇన్వెస్ట్‌ వేదికగా 26,000 పైచిలుకు ఇన్వెస్టర్లు ఉన్నారు. ‘మిలీనియల్స్‌ తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరిచే ప్రయత్నంలో భాగంగా ఫ్రాక్షనల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వైపు ఎక్కువగా చూస్తున్నారు. మొత్తం ఆర్డర్లలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెట్టుబడిదారుల నుండి వచి్చనవి 60 శాతం ఉన్నాయి. జెన్‌ ఎక్స్‌ కస్టమర్లు 20 శాతం మంది ఉన్నారు. 21 ఏళ్లున్న పెట్టుబడిదారులు పాక్షిక అధిక–దిగుబడి ఆస్తులను ఎంచుకుంటున్నారు. గ్రిప్‌ ఇన్వెస్ట్‌ ప్లాట్‌ఫామ్‌లోని 77 శాతం మంది కస్టమర్లు డూ–ఇట్‌–యువర్‌సెల్ఫ్‌ విధానాన్ని ఇష్టపడుతున్నారు. ఇన్వెస్టర్లు వ్యక్తిగత పరిశోధన ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో భారత్‌లోని మిలీనియల్స్‌ ఉత్సుకత చూపిస్తూనే జాగ్రత్తగా ఇన్వెస్ట్‌ చేస్తారు’ అని గ్రిప్‌ ఇన్వెస్ట్‌ వివరించింది. 1981–1996 మధ్య జని్మంచినవారిని మిలీనియల్స్‌గా, 1960 మధ్య కాలం నుంచి 1980 ప్రారంభంలో పుట్టినవారిని జెన్‌ ఎక్స్‌గా పరిగణిస్తారు.

India exports reach 115 countries amidst global uncertainties
భారత్‌ ఎగుమతులు విస్తరించాయ్‌!

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, మార్చితో ముగిసిన గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఎగుమతులు విస్తరించాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం, 115 దేశాలకు భారత్‌ ఎగుమతులు పెరిగాయి. భారత్‌ మొత్తం ఎగుమతుల్లో 46.5 శాతం వెయిటేజ్‌ కలిగిన ఈ దేశాల్లో అమెరికా, యూఏఈ, నెథర్లాండ్స్, చైనా, బ్రిటన్, సౌదీ అరేబియా, సింగపూర్, బంగ్లాదేశ్, జర్మనీ, ఇటలీ ఉన్నాయి. కాగా మొత్తం ఎగుమతులు 2022–23తో పోలి్చతే 2023–24లో 3 శాతం పతనమై 437.1 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే సేవల రంగం ఎగుమతులు ఇదే కాలంలో 325.3 బిలియన్‌ డాలర్ల నుంచి 341.1 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. ఈ ప్రాతిపదిన మొత్తం ఎగుమతులు స్వల్పంగా 0.23 శాతం పెరిగి 776.4 బిలియన్‌ డాలర్ల నుంచి 778.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ప్రపంచ వస్తు వాణిజ్యంలో భారత్‌ వాటా 2014లో 1.70 శాతం ఉంటే, 2023లో 1.82 శాతానికి ఎగశాయి. భారత్‌ ర్యాంక్‌ సైతం ఈ విషయంలో 19 నుంచి 17 శాతానికి మెరుగుపడింది.

Woman Duped Rs 18 Lakh By Fake E commerce Scratch Card
బెంగళూరులో నయా స్కాం.. ఫేక్‌ స్క్రాచ్ కార్డ్‌తో రూ.18 లక్షలు దోపిడీ

డిజిటలైజేషన్ అనేక మార్పులు తీసుకొచ్చింది. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. కానీ దానికి పెరుగుతున్న ఆదరణతో పాటు, నేరాలు, మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యులను దోపిడీ చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నారు.బెంగళూరులో కొత్త స్కామ్ బయటపడింది. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం.. అన్నపూర్ణేశ్వరి నగర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ ఈ మోసానికి గురై రూ. 18 లక్షలు పోగొట్టుకుంది. ఈ స్కామ్‌లో మోసగాళ్లు ప్రసిద్ధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పేరుతో స్క్రాచ్ కార్డ్‌లను పంపుతారు. ఈ మహిళకు కూడా ఈ-కామర్స్ వెబ్‌సైట్ మీషో నుంచి పంపుతున్నట్లుగా స్క్రాచ్ కార్డ్‌ పంపారు.ఆమె కార్డును స్క్రాచ్ చేయగా, ఆమె 15.51 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు వచ్చింది. ఆమె బహుమతిని క్లెయిమ్ చేయడానికి అందించిన నంబర్‌ను వెంటనే సంప్రదించింది. అవతలి వైపు వ్యక్తి స్క్రాచ్ కార్డ్ ఫోటోలు, గుర్తింపు రుజువును కోరారు. వారు చెప్పినట్లే ఆమె వివరాలను అందించింది. ఆ తర్వాత కర్ణాటకలో లాటరీ టిక్కెట్ల అక్రమం కారణంగా 30 శాతం పన్నులు ముందుగా చెల్లించాలని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు. దీంతో బాధితురాలు ఫిబ్రవరి, మే మధ్య అనేకసార్లు మొత్తం రూ. 18 లక్షలు ఆర్‌టీజీఎస్‌ ద్వారా బదిలీ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు తదుపరి సమాచారం అందకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Air India Members Join Duty After Mass Sick Leave
విధుల్లో చేరిన ఎయిర్ ఇండియా సిబ్బంది

ముంబై: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా తన విమానాలను పునరుద్ధరిస్తోంది. అనారోగ్యంతో సెలవు తీసుకున్న సిబ్బంది అంతా విధుల్లో చేరినట్లు ఓ అధికారి పేర్కొన్నారు.ప్రతిరోజూ సుమారు 380 విమానాలను నడుపుతున్న టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ సిబ్బంది సెలవులు తీసుకోవడం వల్ల 20 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది. మంగళవారం ఉదయం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.మరో వైపు గురువారం ఢిల్లీలో చీఫ్ లేబర్ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశం తర్వాత క్యాబిన్‌ సిబ్బంది తమ సమ్మెను విరమించుకున్నారు. దీంతో 25 మంది సిబ్బందికి జారీ చేసిన టెర్మినేషన్ లేఖలను సంస్థ ఉపసంహరించుకుంది. అనారోగ్య సెలవుల్లో ఉన్నవారు కూడా విధుల్లో చేరటం వల్ల మళ్ళీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సాధారణ స్థితికి వస్తుందని తెలుస్తోంది.All the cabin crew members who reported sick have joined their duty by 11th May 2024. However, due to a software glitch in the company scheduling software, as it was recently introduced, it is still showing that staff are reported sick. Further, the flights to take off today were… pic.twitter.com/WVqtDCUSf6— ANI (@ANI) May 12, 2024

A 91 Year Old Subbamma Jasti India Oldest Woman Billionaire
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్‌ బిలియనీర్‌

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో సుబ్బమ్మ జాస్తి భారతదేశపు అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్‌గా నిలిచారు. సుబ్బమ్మ గత నెలలో ఫోర్బ్స్ జాబితాలో అరంగేట్రం చేశారు. ఆమె నికర సంపద 1.1 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.91.9 వేల కోట్లు) చేరుకుంది.ఎవరీ సుబ్బమ్మ..?సువెన్ ఫార్మాస్యూటికల్స్‌ సహ వ్యవస్థాపకుడు వెంకటేశ్వరులు జాస్తి తల్లి సుబ్బమ్మ జాస్తి. ఈమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఈమె కుమారుడు వెంకటేశ్వరులు 1970, 1980లలో యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల చైన్స్‌ నడిపేవారు. ఫోర్బ్స్ ప్రకారం, 2022లో సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు గణనీయమైన వాటాను విక్రయించడం ద్వారా ఆమెకు అతిపెద్ద భాగం వచ్చింది.సుబ్బమ్మ భర్త సుబ్బారావు జాస్తి గత ఏడాది ఫిబ్రవరిలో మరణించిన తర్వాత ఆయన ఆస్తులను వారసత్వంగా పొందారు. ప్రపంచంలోని ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఆమె 2,653 స్థానంలో ఉన్నారు. భారతీయ మహిళా బిలియనీర్ల విషయానికి వస్తే సావిత్రి జిందాల్ 34.9 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమె జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

Happy Mothers Day Ma Anand Mahindra Tweet Viral
మదర్స్ డే స్పెషల్: 47 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మాతృ దినోత్సవం సందర్భంగా ఓ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్ 1977 నాటి చిత్రం. ఇందులో ఆనంద్ మహీంద్రా తన తల్లితో ఉండటం చూడవచ్చు. నేను కాలేజీకి వెళ్ళడానికి ముందు అంటూ.. అమ్మ ఎప్పుడూ కెమెరా వైపు కాకుండా దూరంగా చూస్తూ ఉంది. ఇందులో తన బిడ్డ భవిష్యత్తును ఆశించింది. చదువులో విజయం సాధించి తన బిడ్డ సంతోషన్ని పొందాలని ఆమె ఆశించిందని ట్వీట్ చేసారు. అంతే కాకుండా హ్యాప్పీ మదర్స్ డే అమ్మా అంటూ మీ కలలను నెరవేర్చడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటామని అన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ పోస్టును.. లెక్కకు మించిన నెటిజన్లు లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు.Back in 1977. Just before I left for college.My mother wasn’t looking into the camera;As usual she was gazing into the distance…trying to envision her childrens’ future, hoping that a good education would be their passport to success—and happiness.Happy #MothersDay Ma.… pic.twitter.com/nxPZEWzKSD— anand mahindra (@anandmahindra) May 12, 2024

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 1 Kg 88700.00 200.00
Gold 22K 10gm 66150.00 -100.00
Gold 24k 10 gm 72160.00 -100.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement