Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Today Gold Rate In India
బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట

దేశంలో బంగారం కొనుగోలు దారులకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.650 తగ్గింది.దీంతో తగ్గిన బంగారం ధరలు దేశంలో పలు ప్రధాన నగరాల్లోహైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,840 గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,660గా ఉంది.

Audi Q7 Bold Edition Launched in India
భారత్‌లో మరో జర్మన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. ఎట్టకేలకు 'క్యూ7 బోల్డ్ ఎడిషన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.97.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.కొత్త ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ గ్లేసియర్ వైట్, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ, సమురాయ్ గ్రే. అనే నాలుగు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కొత్త వెర్షన్ లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కాబట్టి అదే ఇంజిన్ ఉంటుంది. పనితీరు పరంగా ఎటువంటి మార్పులు ఉండదు.ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ 3.0 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. 335 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇది కేవలం 5.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. క్యూ 7 మోడల్ ఆడి ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటు ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్ రోడ్, ఇండివిజువల్ అనే 7 డ్రైవ్ మోడ్‌లను పొందుతుంది.Make heads turn as you drive the new Audi Q7 Bold Edition.*Terms and conditions apply. European model shown. Accessories and equipment shown may not be currently offered in India. Bold Edition is available on select variants and select colours only.#AudiQ7 #BoldEdition pic.twitter.com/5hQZVQpQXL— Audi India (@AudiIN) May 21, 2024

Sbi Warn Customers About Banking Frauds
బ్యాంక్‌ ఖాతాదారులకు ఎస్‌బీఐ అలెర్ట్‌

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్‌. రీడమ్‌ పాయింట్ల పేరుతో ఖాతాదారుల్ని మోసం చేసేందుకు సైబర్‌ నేరస్తులు ప్రయత్నిస్తున్నారని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సదరు బ్యాంకులు ఖాతాదారుల్ని హెచ్చరిస్తున్నాయి. డిజిటల్‌ బ్యాంకింగ్‌ వినియోగం పెరిగే కొద్ది సైబర్‌ నేరుస్తులు తమ పంథాను మారుస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా బ్యాంక్‌ ఖాతాదారుల బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరుణంలో ఎస్‌బీఐతో పాటు పలు ప్రైవేట్‌ బ్యాంక్‌లు కస్టమర్లను అలెర్ట్‌ చేస్తున్నాయి. పెరిగిపోతున్న స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎస్‌బీఐ ఖాతాదారుల్ని సైబర్‌ నేరస్తులు మోసం చేసేందుకు రివార్డ్‌ పాయింట్లను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని ట్వీట్‌ చేసింది. Your safety is our top priority.Here is an important message for all our esteemed customers!#SBI #TheBankerToEveryIndian #StaySafe #StayVigilant #FraudAlert #ThinkBeforeYouClick pic.twitter.com/CXiMC5uAO8— State Bank of India (@TheOfficialSBI) May 18, 2024 ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసే నెపంతో వినియోగదారులకు ఆండ్రాయిడ్‌ అప్లికేషన్ ఫైల్‌ను( APK ) పంపిస్తున్నారు. అలాంటి వాటి పట్ల ఖాతాదారులు అప్రత్తంగా ఉండాలని కోరింది.రీడీమ్ చేసుకోవాలంటూ మోసగాళ్లు ఎస్‌ఎంఎస్‌, వాట్సప్‌ ద్వారా ఏపీఏకే ఫైల్స్‌, మెసేజెస్‌ పంపిస్తారు. వాటిని క్లిక్‌ చేయొద్దని కోరింది. ఇలాంటి ఏపీకే ఫైల్స్‌ పట్ల ఎస్‌బీఐతో పాటు ఏఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాదారులు మోసపోతున్నారని, వాటి జోలికి పోవద్దని తెలిపాయి. Don't get caught in the web of fake links! Stay sharp, stay safe!@CyberdostTo report Cyber Crime, visit https://t.co/qb66kKVmLw or Dial 1930 for assistance#FoolTheFraudster #Fraud #Awareness #PNB #Digital pic.twitter.com/LOYUBy0nYf— Punjab National Bank (@pnbindia) May 1, 2024Stay vigilant against investment or task-based fraud! Protect your financial and personal information by verifying sources, researching thoroughly, and never sharing sensitive details online. #StaySafe #FraudPrevention pic.twitter.com/87xrfSd2Sy— Axis Bank (@AxisBank) May 13, 2024Is that scan hiding a potential scam? Watch the video to uncover the hidden risks of QUISHING and learn how to stay one step ahead of the fraudsters.To report a fraud,📞National Cyber Crime Helpline on 1930 or🌐Visit https://t.co/5QHgCWZl7n#BeatTheCheats #SafeBanking pic.twitter.com/MSMs2jti1l— ICICI Bank (@ICICIBank) May 19, 2024

Elon Musk met with Sri Lanka President Ranil Wickremesinghe at the World Water Forum in Bali
శ్రీలంకలో స్టార్‌లింక్‌ సేవలకై చర్చ

టెస్లా అధినేత ఎలొన్‌మస్క్‌ శ్రీలంకలో స్టార్‌లింక్‌ సేవలు విస్తరించాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇండోనేషియా-బాలిలో జరిగిన 10వ వరల్డ్ వాటర్ ఫోరమ్‌లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో మస్క్‌ సమావేశమయ్యారు.ఎలొన్‌మస్క్‌ ఇటీవల చైనాతోపాటు ఇండోనేషియాను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలోని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రారంభించారు. తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. శ్రీలంకలోనూ స్టార్‌లింక్ సేవలు అందించాలనే చర్చ జరిగినట్లు తెలిసింది.ప్రెసిడెంట్‌ మీడియా విభాగం తన ఎక్స్‌ ఖాతాలో ఈ మేరకు సమాచారాన్ని పంచుకుంది. ‘వరల్డ్ వాటర్ ఫోరమ్‌లో దేశాధ్యక్షుడు స్టార్‌లింక్‌ అమలుపై మస్క్‌తో చర్చించారు’ అని తెలిపింది. శ్రీలంక నీటి సరఫరా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ మినిస్టర్‌ జీవన్ తొండమాన్ తన ఎక్స్‌ ఖాతాలో స్పందిస్తూ..‘బాలిలో జరుగుతున్న ఈవెంట్‌లో దేశ అధ్యక్షుడు, ఎలొన్‌మస్క్‌తో కలిసి సమావేశం అయ్యారు. దేశ ఆర్థిక పునరుద్ధరణ, పెట్టుబడికి కొత్త అవకాశాలు వంటి అంశాలపై చర్చించాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా మస్క్‌ స్పందిస్తూ..‘రిమోట్ కమ్యూనిటీలకు ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీను అందుబాటులోకి తీసుకొస్తే విద్య, ఆర్థిక అవకాశాలు మెరుగుపడుతాయి’ అని పేర్కొన్నారు.Bringing connectivity to remote communities radically improves access to education and economic opportunitiespic.twitter.com/hDVYvpRDKZ— Elon Musk (@elonmusk) May 19, 2024

RBI employee loses Rs 24.5 lakh to scammers
సైబర్‌ కేటుగాళ్లు దోచేశారు.. ఆర్‌బీఐ ఉద్యోగినికి రూ.24.5లక్షల టోకరా

సైబర్‌ నేరస్తులు బెంగళూరులోని ఆర్‌బీఐ ఉద్యోగిని నిండా ముంచారు. అందిన కాడికి రూ.24.5లక్షలు దోచుకున్నారు. నగరంలోని కన్నింగ్‌హామ్ రోడ్ ప్రాంతంలో నివసించే ఆర్‌బీఐ ఉద్యోగికి లాజిస్టిక్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ పేరుతో ఓ అగంతకుడు ఆమెకు కాల్‌ చేశాడు. మేడం.. మీ పేరుతో ఓ పార్శిల్‌ వచ్చింది. ఆ పార్శిల్‌లో ముంబైలో ఐదు పాస్‌పోర్ట్‌లు, 5 కిలోల బట్టలు, మూడు క్రెడిట్ కార్డ్‌లతో పాటు ఇతర అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి. ముంబై పోలీసులు మీ పార్శిల్‌పై ఆరా తీశారు. ఈ కాల్‌ను ఇప్పుడే వాళ్లకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాం..అంటూ ప్లాన్‌ ప్రకారం.. కాన్ఫిరెన్స్‌ కాల్‌లో మరో సైబర్‌ నేరస్తుడు లైన్‌లోకి వచ్చాడు. తనిను తాను ముంబై సీనియర్ పోలీస్‌ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ పార్శిల్‌ విదేశానికి సంబంధించింది. అది మీ పేరుమీద ఉంది. మీ ఆధార్ కార్డును ఐడి ప్రూఫ్‌గా ఉపయోగించారని అన్నాడు. మీ బ్యాంక్‌ అకౌంట్‌ను మనీ ల్యాండరింగ్‌కు ఉపయోగించారని మరింత బయపెట్టించాడు.ఈ కేసు సున్నిమైంది ఎవరికి చెప్పొద్దు. మీ బ్యాంక్‌ అకౌంట్‌ను పరిశీలిస్తున్నాం. ఆ అకౌంట్‌లో ఉన్న మొత్తాన్ని మేం చెప్పిన బ్యాంక్‌ అకౌంట్‌కు పంపించండి. విచారణ పూర‍్తయిన వెంటనే మీ డబ్బుల్ని మీకు పంపిస్తామని హామీ ఇచ్చాడు. సైబర్‌ నేరస్తుడి మాటల్ని నమ్మని బాధితురాలు తొలిసారి రూ.14.2 లక్షలు, రెండో సారి మరో అకౌంట్‌కు రూ.5.5 లక్షలు, మూడో అకౌంట్‌కు రూ.4.8 లక్షలు పంపింది. మొత్తంగా రూ.24.5లక్షల ట్రాన్స్‌ ఫర్‌ చేసింది. అయితే మరుసటి రోజు తాను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ అదే రోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

BIAL suspends entry fee for arrival pickup lanes at Kempegowda Airport after protests
కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్‌

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(కేఐఏ)లో పికప్ లేన్‌ల ప్రవేశ రుసుమును రద్దుచేస్తూ బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(బీఐఏఎల్‌) ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయ పరిధిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు స్పీడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పింది.అవసరం ఉన్నా, లేకపోయినా కేఐఏ పికప్‌లేన్‌ పరిధిలోకి పెద్దసంఖ్యలో వాహనాలు వస్తూండడం బీఐఏఎల్‌ దృష్టికి వెళ్లింది. దాంతోపాటు ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లో భారీగా వాహనాలు చేరుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించింది. వాటిని నివారించాలంటే కొన్ని మార్పులు తీసుకురావాలని భావించింది. బీఐఏఎల్‌ టెర్మినల్‌ 1, 2లో అరైవల్ పికప్ లేన్‌లను చేరడానికి ఎంట్రీ ఫీజును ప్రవేశ పెట్టింది. రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఆధారంగా వాహనాలపై ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పింది. అయితే ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే ట్యాక్సీడ్రైవర్లు, ఇతర కమ్యునిటీల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో ప్రవేశ రుసుమును రద్దుచేస్తున్నట్లు బీఏఐఎల్‌ తిరిగి ప్రకటన విడుదల చేసింది.బీఐఏఎల్‌ ముందుగా చేసిన ప్రకటన ప్రకారం..ప్రైవేట్ వాహనాలు పికప్ లేన్‌లలోకి ప్రవేశించిన ఏడు నుంచి 14 నిమిషాల సమయానికి రూ.150 రుసుము చెల్లించాలి. వాణిజ్య వాహనదారులు మొదటి ఏడు నిమిషాలకు రూ.150, తర్వాతి ఏడు నిమిషాలకు రూ.300 చెల్లించాలి. బస్సు ప్రయాణికులు ఏడు నిమిషాలకు రూ.600, ట్రావెలర్స్‌ రూ.300 చెల్లించాలని నిర్ణయించారు. ఒకవేళ టికెట్‌పోతే రూ.600 నిర్ణీత రుసుము చెల్లించాలి. పికప్ ఏరియాలో 15 నిమిషాలకు మించి ఉంటే ఆ వాహనాలను యజమాని ఖర్చుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలి.వైట్‌ రిజిస్ట్రేషన్ ప్లేట్‌ కలిగి ఉండే వాహనాలను ప్రైవేట్ వాహనాలుగా, ట్రావెల్స్‌, ఆన్‌లైన్‌ బుకింగ్‌ వెహికిల్స్‌, పసుపు రిజిస్ట్రేషన్ ప్లేట్‌తోపాటు కొన్ని ఈవీలను వాణిజ్య వాహనాలుగా వర్గీకరించారు. కర్ణాటక రాష్ట్ర ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ హోల్లా మాట్లాడుతూ..‘ఎయిర్‌పోర్ట్‌ రావాలనుకునే ప్రయాణికులు ఇప్పటికే సాదహళ్లి టోల్‌గేట్ వద్ద ఛార్జీ చెల్లిస్తున్నారు. మళ్లీ అరైవల్‌-పికప్‌ ఏరియాలో రుసుము చెల్లించాలనే నిర్ణయం సరికాదు’ అన్నారు.కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) స్పీడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు నిబంధనల కంటే వేగంగా వెళ్లే వారిని గుర్తించి జరిమానాలను విధిస్తాయి.

WhatsApp to let users clear unread messages soon
వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే?

వాట్సప్‌ యూజర్లకు శుభవార్త. యూజర్ల సౌలభ్యం వాట్సప్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. సాధారణంగా వాట్సప్‌ ఓపెన్‌ చేయగానే వాట్సప్‌ నిండా ఇబ్బడి ముబ్బడిగా ఉన్న మెసేజ్‌లు కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తుంటాయి.ఈ సమస్యను అదిగమించేందుకు వాట్సప్‌ యాజమాన్యం కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తేనున్నట్లు వీబీటా ఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఎంపిక చేసిన బీటా వెర్షన్‌ యూజర్ల వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.ఇక ఈ ఫీచర్‌ వినియోగంలోకి వస్తే.. లేటెస్ట్‌గా వాట్సప్‌కు వచ్చే మెసేజ్‌లకు నోటిఫికేషన్‌ వస్తుంది. చదవని వాట్సప్‌ మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్‌ అవ్వనున్నాయి.

Scarlett Johansson Accused Open Ai
వివాదంలో చాట్‌జీపీటీ.. అడ్డంగా బుక్కైన సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌

ఓపెన్‌ ఏఐ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల‍్ట్‌మన్‌ అడ్డంగా దొరికిపోయారు. ఇక చేసిది లేక తన చాట్‌జీపీటీ స్కై వాయిస్‌ను నిలిపి వేశారు.యాపిల్‌ సిరి వాయిస్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ తరహాలో చాట్‌ జీపీటీ యూజర్లకు వాయిస్‌ అసిస్టెంట్‌ సేవల్ని అందించేందుకు సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ పనిచేస్తున్నారు. స్కై వాయిస్‌ పేరుతో తెచ్చే ఈ ఫీచర్‌లో ప్రముఖుల వాయిస్‌ వినిపిస్తుంది. మీకు ఎవరి వాయిస్‌ కావాలనుకుంటారో.. దాన్ని సెలక్ట్‌ చేసుకుంటే చాట్‌ జీపీటీ సమాధానాల్ని టెక్ట్స్‌ కాకుండా వాయిస్‌లో రూపంలో అందిస్తుంది.నా అనుమతి లేకుండా నా వాయిస్‌ను దీన్ని డెవలప్‌ చేసే సమయంలో శామ్‌ ఆల్ట్‌మన్‌.. అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్‌గా, హాలీవుడ్‌లోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్‌ను వినియోగించారు. దీంతో తనని సంప్రదించకుండా తన వాయిస్‌ను కాపీ చేసి చాట్‌జీపీటీ స్కైవాయిస్‌లో ఎలా వినియోగిస్తారంటూ స్కార్లెట్‌ జాన్సన్‌.. ఓపెన్‌ ఏఐ సీఈఓపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదనిఆరోపణలపై శామ్‌ ఆల్ట్‌మన్‌ స్పందించారు. కంపెనీనీ ప్రశ్నార్థకంలో పడేసి చాట్‌జీపీటీ వాయిస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో స్కై సిస్టమ్ వాయిస్ స్కార్లెట్‌ జాన్సన్‌ది కాదని, వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదని తెలిపారు. స్కార్లెట్‌ జాన్సన్‌ ఏమన్నారంటే తన వాయిస్‌ను ఓపెన్‌ ఏఐ కాపీ చేయడంపై అవెంజర్‌ ముద్దుగమ్మ స్కార్లెట్‌ జాన్సన్‌ మాట్లాడుతూ.. ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ చాట్‌జీపీటీ వాయిస్‌ ఆప్షన్‌ కోసం గతేడాది సెప్టెంబర్‌లో నన్ను సంప్రదించారు.అయితే, ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించా. అయినప్పటికీ ఆల్ట్‌మన్ తనలాగే వినిపించే 'చాట్‌జీపీటీ 4.0 సిస్టమ్' కోసం నా ప్రమేయం లేకుండా నా వాయిస్‌ని ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు. జాన్సన్ ఆరోపణల్ని ఖండించిన ఓపెన్‌ఏఐ అయితే స్కార్లెట్‌ జాన్సన్‌ వ్యాఖ్యల్ని శామ్‌ ఆల్ట్‌మన్ ఖండించారు. చాట్‌జీపీటీ స్కై వాయిస్ స్కార్లెట్ జాన్సన్‌ వాయిస్‌ కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాన్సన్‌ పట్ల ఉన్న గౌరవంతో మేం మా ప్రొడక్ట్‌లలో స్కై వాయిస్‌ ఉపయోగించడం నిలిపివేశాము. ఈ విషయంలో జాన్సన్‌కు తగిన విధంగా సమాచారం అందించకపోవడం క్షమాపణలు చెప్పారు.

Wipro More To Changes Under Ceo Srini Pallia
కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియా రాకతో ‘విప్రో’లో సీను మారింది

ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విప్రో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పల్లియా.. రెండు నెలలు లోపే సంస్థ మాజీ సీఈఓ థియరీ డెలాపోర్టే సీఈఓగా పని చేసే సమయంలో పలు విభాగాల్లో ముఖ్యపాత్ర పోషించిన టాప్‌ మేనేజ్మెంట్‌ను ఇతర విభాగాలకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు.విప్రోను ముందుకు నడిపించే తన నమ‍్మకస్తుల్ని అక్కున చేర్చుకుంటున్నారు పల్లియా. ఇందులో భాగంగా థియరీ డెలాపోర్టేకు నమ్మకస్తులైన ముగ్గురు టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లు బదిలి చేశారు. ఇక విప్రో వ్యాపారం పుంజుకునేలా శ్రీనివాస్‌ పల్లియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విప్రోలో ప్రముఖ పాత్ర పోషించే ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ ఫ్యూచరింగ్, ఇంజనీరింగ్ ఎడ్జ్ అండ్‌ కన్సల్టింగ్‌ విభాగాల్లో మార్పులు చేశారు.సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎకోసిస్టమ్స్ & పార్ట్‌నర్‌షిప్‌ గ్లోబల్ హెడ్, జాసన్ ఐచెన్‌హోల్జ్ వ్యాపార కార్యకలాపాల గురించి ఇప్పుడు విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ బిజినెస్ లైన్ హెడ్ జో డెబెకర్‌కి రిపోర్ట్‌ చేయాలి. ఐచెన్‌హోల్జ్ ఆగస్ట్ 2021లో విప్రోలో చేరగా, డెబెకర్ జనవరి 2022లో విప్రోలో బాధ్యతలు చేపట్టారు.విప్రో ఆసియా పసిపిక్‌, మిడిల్‌ ఈస్ట్‌ అండ్‌ ఆఫ్రికా (APMEA) స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్‌కు సీఈఓగా వినయ్ ఫిరాకే కొద్ది రోజుల క్రితం నియమించింది. ఆయన నియమాకం తర్వాత విప్రో కంపెనీ బెనెలక్స్, నార్డిక్ దేశాలు కార్యకలాపాలను కలిపి ఒకే ఉత్తర ఐరోపా ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది .ప్రస్తుత బెనెలక్స్ దేశ విప్రో మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ కొత్త ఉత్తర ఐరోపా ప్రాంతానికి నాయకత్వం వహిస్తారని కంపెనీ తెలిపింది.దీంతో పాటు విప్రో ఉనికి ఎక్కువగా ఉన్న యూరోపియన్‌ దేశాల్లో తన వ్యాపారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు యూకే, ఐర్లాండ్‌, జర్మనీ, స్విట్జర్లాండ్, నార్డిక్స్, బెనెలక్స్, దక్షిణ ఐరోపాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తన డెలివరీ లొకేషన్లను ఏర్పాటు చేయనుంది.విప్రో ఇంజినీరింగ్ ఎడ్జ్‌లో, నోకియాతో ప్రైవేట్ వైర్‌లెస్ జాయింట్ సొల్యూషన్ కోసం విప్రో ఎంగేజ్‌మెంట్ లీడర్‌గా శ్రేయాస్ భోసలే నియమించింది.ఇలా విప్రో కంపెనీ తన యూనిట్‌లలో భారీ మార్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.

Stock Market Rally On Today Opening
స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 22,470కు చేరింది. సెన్సెక్స్‌ 121 పాయింట్లు దిగజారి 73,899 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 83.66 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.44 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.09 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.65 శాతం పుంజుకుంది.‘అంతర్జాయతీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇది దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికల సంబంధిత పరిణామాల వార్తలు, కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 22,500 స్థాయిని నిలుకోగలిగితే జీవితకాల గరిష్టాన్ని (22,795) పరీక్షించవచ్చు. అమ్మకాలు నెలకొంటే 22,200 వద్ద మరో కీలక మద్దతు ఉంది’ అని నిపుణులు తెలిపారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 92500.00 92500.00 0.00
Gold 22K 10gm 67600.00 67600.00 -250.00
Gold 24k 10 gm 73750.00 73750.00 -270.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement