News


యూబీఎస్‌ టెక్నాలజీతో విడుదలైన యమహా శాల్యుటో

Friday 14th December 2018
auto-mobiles_main1544763128.png-22914

న్యూఢిల్లీ: ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం) అధునాతన బ్రేకింగ్‌ వ్యవస్థతో అభివృద్ధి పరచిన రెండు శాల్యుటో మోడల్‌ బైక్‌లను గురువారం విడుదలచేసింది. ఏకీకృత బ్రేకింగ్ వ్యవస్థ (యూబీఎస్‌) కలిగిన శాల్యుటో, శాల్యుటో ఆర్‌ఎక్స్‌ మోడళ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. డ్రమ్‌, డిస్క్‌ బ్రేక్‌ వేరియంట్లలో ఈ వ్యవస్థ అందుబాటులో ఉండగా.. శాల్యుటో (125 సీసీ) బైక్‌ ధరల శ్రేణి రూ.58,800 – రూ.61,500 స్థాయిలో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. శాల్యుటో ఆర్‌ఎక్స్‌ (110 సీసీ) బైక్‌ ధరల శ్రేణి రూ.52,000 – రూ.53,000 ఉన్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్‌ మోటోఫుమి షిటారా మాట్లాడుతూ.. ‘వినియోగదారులతో బలమైన సంబంధాన్ని కొనసాగించడంలో భాగంగా నిరంతర ఉత్పత్తుల ఆవిష్కరణ కంపెనీ విధానంగా ఉంది. సురక్షితకు ప్రాధాన్యత ఇవ్వడం మా బాధ్యతగా భావిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

పీఎస్‌యూ బ్యాంకులకు అదనంగా రూ.30,000 కోట్లు

Friday 14th December 2018

న్యూఢిల్లీ: మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ చేయలేని పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) అదనంగా రూ.30,000 కోట్ల నిధుల సాయం అందించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళికను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకులు తాము సొంతంగా రూ.58,000 కోట్లను 2019 మార్చి నాటికి స్టాక్‌ మార్కెట్ల

హైదరాబాద్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వింటేజ్‌ స్టోర్‌

Friday 14th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హైదరాబాద్‌లో వింటేజ్‌ స్టోర్‌ను త్వరలో ప్రారంభిస్తోంది. ప్రీ-ఓన్డ్‌ (పాత) వాహనాలను ఈ కేంద్రంలో విక్రయిస్తారు. 91 రకాల నాణ్యత పరీక్షలు జరిపి, వారంటీతో వాహనాలను అమ్ముతామని కంపెనీ ఇండియా బిజినెస్‌ హెడ్‌ షాజీ కోషీ తెలిపారు. ఇంటర్‌సెప్టర్‌ ఐఎన్‌టీ 650, కాంటినెంటల్‌ జీటీ 650 మోడళ్లను గురువారమిక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా సంస్థకు 870

Most from this category