News


యమహా నుంచి 125 సీసీ స్కూటర్లు

Friday 20th December 2019
auto-mobiles_main1576813585.png-30327

ఫ్యాసినో125ఎఫ్‌ఐ @ రూ.67,430
110 సీసీ స్కూటర్లకు మంగళం 

చెన్నై: యమహా మోటార్‌ ఇండియా కంపెనీ 125 సీసీ స్కూటర్‌ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో రెండు కొత్త మోడళ్లు- ఫ్యాసినో 125ఎఫ్‌ఐ, రేజర్‌125ఎఫ్‌ఐలను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాసినో స్కూటర్‌ ధరను రూ.67,430(ఎక్స్‌ షోరూమ్‌)గా నిర్ణయించామని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ గ్రూప్‌) రవీందర్‌ సింగ్‌ తెలిపారు. త్వరలో స్ట్రీట్‌ ర్యాలీ 125ఎఫ్‌ఐ మోడల్‌ స్కూటర్‌ను కూడా మార్కెట్లోకి తెస్తామని చెప్పారు. 110సీసీ స్కూటర్‌ మోడళ్లను దశలవారీగా మార్కెట్‌ నుంచి ఉపసంహరిస్తామని, భవిష్యత్తులో 125 సీసీ మోడళ్లను మాత్రమే విక్రయిస్తామని  వివరించారు. 

ఈ ఏడాది 6.24 లక్షల టూవీలర్లను విక్రయిస్తామన్న అంచనాలున్నాయని సింగ్‌ చెప్పారు. వచ్చే ఏడాది 6.50 లక్షల టూవీలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తమ మార్కెట్‌ వాటాను 2025కల్లా పది శాతానికి పెంచుకోవడం లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలోనే ఎమ్‌15, ఆర్‌ 15 బైక్‌ మోడళ్లలో బీఎస్‌-సిక్స్‌ వేరియంట్లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. 



You may be interested

పాస్‌వర్డ్‌లు చోరీ ‍అయ్యాయి.. జాగ్రత్త..

Friday 20th December 2019

భారత్‌లో యూజర్లను అప్రమత్తం చేసిన గూగుల్‌ న్యూఢిల్లీ: నిర్దిష్ట వెబ్‌సైట్లను ఉపయోగించే వారి పాస్‌వర్డ్‌లు చోరీకి గురై ఉంటాయని, వాటిని తక్షణమే మార్చుకోవాలని భారత్‌లోని యూజర్లను టెక్ దిగ్గజం గూగుల్‌ అప్రమత్తం చేసింది. మీడియా సంస్థలు మొదలుకుని సామాన్య యూజర్ల దాకా చాలా మంది ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్‌ స్క్రీన్‌లపై గురువారం ఈ మేరకు నోటిఫికేషన్లు ప్రత్యక్షమయ్యాయి. డేటా లీకేజీ కారణంగా పాస్‌వర్డ్‌లు చోరీకి గురై ఉంటాయని వీటిల్లో గూగుల్ పేర్కొంది.

హ్యుందాయ్‌ ‘ఆరా’.. ఆగయా!!

Friday 20th December 2019

వచ్చే నెల నుంచి విక్రయాలు  రూ.6- 9 లక్షల రేంజ్‌లో ధరలు!   చెన్నై: హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ తన కొత్త కాంపాక్ట్‌ సెడాన్‌ ‘ఆరా’ను ఆవిష్కరించింది. ఈ సెడాన్‌ను వచ్చే నెలలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని హ్యుందాయ్‌ ఇండియా తెలియజేసింది. ఈ సెగ్మెంట్లో ఎక్సెంట్‌ తర్వాత ఈ కంపెనీ అందిస్తున్న మరో కారు ఇది. స్పోర్ట్స్‌ యుటిలిటి వెహికల్‌ (ఎస్‌యూవీ), కాంపాక్ట్‌ హ్యాచ్‌బాక్‌ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు సాధిస్తున్నామని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ

Most from this category