News


భారత్‌లో వివో ఆర్‌అండ్‌డీ సెంటర్‌!

Wednesday 28th November 2018
auto-mobiles_main1543388785.png-22434

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీ సంస్థ వివో భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ఇండియా ఇన్నోవేషన్‌ టీమ్‌ పనిచేస్తోంది. భారత మార్కెట్‌కు ఎటువంటి ఫీచర్లు, టెక్నాలజీ అవసరమో అన్న అంశంపై ఈ బృందం పెద్ద ఎత్తున అధ్యయనం చేస్తోందని వివో ఇండియా బ్రాండ్‌ స్ట్రాటజీ డైరెక్టర్‌ నిపుణ్‌ మార్యా తెలిపారు. వై95 మోడల్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారమిక్కడ తెలంగాణ సీవోవో జరు సున్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చైనాలో అయిదు, యూఎస్‌లో ఒక ఆర్‌అండ్‌డీ కేంద్రం ఉంది. ఈ సెంటర్లలో 2,000 పైచిలుకు నిపుణులు పనిచేస్తున్నారు. ఇక నోయిడా ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 2.5 కోట్ల యూనిట్లు. ప్లాంటు వినియోగం పూర్తి స్థాయికి చేరుకుంది. నూతన ఫ్యాక్టరీ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. విలువ పరంగా భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో వివో 17.6 శాతం వాటాతో రెండవ స్థానంలో ఉంది’ అని వివరించారు.



You may be interested

యస్ బ్యాంక్ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: కొత్త సీఈవో ఎంపిక ప్రక్రియ, డైరెక్టర్ల రాజీనామాలు, కార్పొరేట్ గవర్నెన్స్‌పై వివాదాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్‌కు తాజాగా రేటింగ్‌పరమైన ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంక్ రేటింగ్‌ను నాన్‌-ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌కి కుదించినట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. అలాగే అవుట్‌లుక్‌ కూడా స్థిర స్థాయి నుంచి నెగటివ్‌ స్థాయికి తగ్గించినట్లు మంగళవారం పేర్కొంది.  ప్రస్తుత ఎ౾ండీ, సీఈవో రాణా కపూర్ పదవీకాలాన్ని రిజర్వ్ బ్యాంక్‌ జనవరి 31 దాకా పరిమితం

హైదరాబాద్‌ వద్ద పోకర్ణ కొత్త ప్లాంటు

Wednesday 28th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టెక్స్‌టైల్‌, గ్రానైట్‌ రంగాల్లో ఉన్న పోకర్ణ గ్రూప్‌... తన గ్రానైట్‌ విభాగానికి సంబంధించి హైదరాబాద్‌ వద్ద అత్యాధునిక ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. క్వాంట్రా బ్రాండ్‌తో సహజ క్వార్ట్జ్‌ సర్ఫేసెస్‌ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌కు ఇప్పటికే వైజాగ్‌లో ఒక యూనిట్‌ ఉంది. హైదరాబాద్‌ వెలుపల కొత్తూరు వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక ప్లాంటును ఏర్పాటు చేస్తామని, దీనిపై రూ.330 కోట్లు ఇన్వెస్ట్‌

Most from this category