News


మార్కెట్లోకి టాటా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ

Friday 20th December 2019
auto-mobiles_main1576813040.png-30324

  • నెక్సాన్‌ ఈవీ.. మూడు వేరియంట్లలో లభ్యం 
  • ఒక్క సారి చార్జింగ్‌.. 300 కిమీ. ప్రయాణం 
  • ధర రూ.15-17 లక్షల రేంజ్‌లో 

ముంబై: వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ తన తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ, నెక్సాన్‌ ఈవీని గురువారం ఆవిష్కరించింది. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్లు కంటే ఎక్కువగానే ప్రయాణించే ఈ వాహన విక్రయాలను మరికొన్ని వారాల్లోనే ప్రారంభిస్తామని టాటా మోటార్స్‌ తెలిపింది. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని 9.9 సెకన్లలోనే ఈ వాహనం అందుకోగలదని టాటా మోటార్స్‌ సీఈఓ, ఎమ్‌డీ గుంటర్‌ బశ్చెక్‌ చెప్పారు. నేటి (శుక్రవారం) నుంచే బుకింగ్స్‌ మొదలుపెడతామని తెలిపారు. మూడు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ వాహనం ధర రూ.15-17 లక్షలు  రేంజ్‌లో ఉంటుందని పేర్కొన్నారు.  ఎనిమిదేళ్లు లేదా 1.6 లక్షల కి.మీ. వారంటీని ఇస్తున్నామని, పరిశ్రమలో ఇదే అత్యధిక వారంటీ అని వివరించారు. 

ఈ వాహన బ్యాటరీని ఫాస్ట్‌ చార్జింగ్‌ మోడ్‌లో చార్జింగ్‌ చేస్తే గంటలోనే 80 శాతం మేర చార్జింగ్‌ అవుతుందని కంపెనీ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ యూనిట్‌  ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర చెప్పారు. 15 యాంపియర్‌ ప్లగ్‌ పాయింట్‌ ద్వారా కూడా ఈ వాహన బ్యాటరీని చార్జింగ్‌ చేయవచ్చని వివరించారు. జిప్‌ట్రాన్‌ పవర్‌ట్రైన్‌ టెక్నాలజీతో రూపొందిన ఈ వాహనంలో 30.3 కిలోవాట్‌ఆవర్‌  హై ఎనర్జీ డెన్సిటీ లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుందని పేర్కొన్నారు. 
 



You may be interested

మారుతీ ఆల్టోలో కొత్త వేరియంట్‌

Friday 20th December 2019

లీటర్‌కు 22 కిమీ. మైలేజీ  ధర రూ.3.80 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌) న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ ఎంట్రీ లెవల్‌ చిన్న కారు, ఆల్టోలో కొత్త వేరియంట్‌ను (ఆల్టో వీఎక్స్‌ఐప్లస్‌)గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.3.80 లక్షలని(ఎక్స్‌ షోరూమ్‌) మారుతీ సుజుకీ ఇండియా ఈడీ(మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాత్సవ చెప్పారు. బీఎస్‌-సిక్స్‌ పర్యావరణ నిబంధనలకనుగుణంగా ఈ కారును తయారు చేశామని,  లీటర్‌కు 22 కిమీ. మైలేజీని ఇస్తుందని

పర్యాటక రంగం.. 50 బిలియన్‌ డాలర్లు

Friday 20th December 2019

2022 నాటికి సాధించాలన్న అమితాబ్‌కాంత్‌ న్యూఢిల్లీ: పర్యాటక రంగం 2022 నాటికి 50 బిలియన్‌ డాలర్ల (రూ.3.55 లక్షల కోట్లు) ఆదాయ లక్ష్యాన్ని సాధించాలని నీతి ఆయోగ్‌ అమితాబ్‌ కాంత్‌ సూచించారు. ఈ రంగానికి వృద్ధి అవకాశాలు, ఉపాధి కల్పన అవకాశాలు అపారంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సీఐఐ 15వ వార్షిక పర్యాటక సదస్సు ఢిల్లీలో గురువారం జరిగింది. దీనికి కాంత్‌ హాజరై మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఉపాధి అవకాశాలు కల్పించే

Most from this category