News


మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్‌

Thursday 23rd January 2020
auto-mobiles_main1579749390.png-31118

  • ధరలు రూ.5.29-9.29 లక్షల రేంజ్‌లో 
  • తొలి డీజిల్‌ బీఎస్‌-6 కారు

ముంబై: టాటా మోటార్స్‌ ప్రీమియమ్‌ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్లోకి ప్రవేశించింది.  ఆల్ట్రోజ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారులో ఐదు పెట్రోల్‌, ఐదు డీజిల్‌ వేరియంట్లను అందిస్తున్నామని టాటా మోటార్స్‌  సీఈఓ, ఎమ్‌డీ గుంటర్‌ బషెక్‌ చెప్పారు. పెట్రోల్‌ వేరియంట్ల ధరలు రూ.5.29-7.69 లక్షలు... డీజిల్‌ వేరియంట్ల ధరలు రూ.6.99-9.29 లక్షల రేంజ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇది భారత్‌లో తొలి బీఎస్‌-6 డీజిల్‌ కారని పేర్కొన్నారు. ఆల్ఫా ప్లాట్‌ఫార్మ్‌ఫై తామందిస్తున్న తొలి వాహనం కూడా ఇదేనని వివరించారు. ఆల్ట్రోజ్‌తో పాటు నెక్సాన్‌, టియగో, టైగోర్‌ మోడళ్లలో బీఎస్‌ సిక్స్‌ వేరియంట్లను కూడా మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. 
ఫీచర్లు....
ఈ కారులో క్రూయిజ్‌ కంట్రోల్‌, 7 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, 7 అంగుళాల ఫ్లోటింగ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సర్లు, తదితర పీచర్లున్నాయి. డ్యుయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌ విత్‌ ఈబీడీ, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సర్స్‌, హై స్పీడ్‌ అలెర్ట్‌ సిస్టమ్‌ తదితర భద్రతా ఫీచర్లున్నాయి. మారుతీ సుజుకీ బాలెనో, హ్యుందాయ్‌ ఎలీట్‌ ఐ20, హోండా జాజ్‌, టయోటా గ్లాంజా, ఫోక్స్‌వ్యాగన్‌ పోలోలకు ఈ కారు గట్టిపోటీనిస్తుందని అంచనా. You may be interested

మళ్లీ మార్కెట్లోకి ‘వాక్‌మాన్‌’

Thursday 23rd January 2020

టచ్‌స్క్రీన్‌తో అందిస్తున్న సోనీ ఇండియా ధర రూ. 23,990 న్యూఢిల్లీ: అప్పట్లో పాటల ప్రియులను అలరించి, డిజిటల్ ధాటికి కనుమరుగైన వ్యాక్‌మాన్‌లను (పోర్టబుల్‌ పర్సనల్ క్యాసెట్ ప్లేయర్లు) సోనీ మళ్లీ కొత్త రూపులో ఆవిష్కరించింది. ఈసారి టచ్‌స్క్రీన్‌ సదుపాయంతో ఆండ్రాయిడ్ వాక్‌మాన్ ఎన్‌డబ్ల్యూ-ఎ105 మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 23,990. ఇందులో 16 జీబీ బిల్టిన్ మెమరీ ఉంటుందని, 128 జీబీ దాకా ఎక్స్‌పాండబుల్ మెమరీ ఉంటుందని సంస్థ తెలిపింది. 3.6

పదేళ్లలో 6 రెట్లు పెరిగిన టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ

Thursday 23rd January 2020

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) బ్రాండ్ విలువ 2010- 2019 మధ్య కాలంలో ఏకంగా ఆరు రెట్లు పెరిగి 13.5 బిలియన్ డాలర్లకు చేరింది. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన 2020 గ్లోబల్ 500 నివేదికలో ఈ అంశాలు వెల్లడైనట్లు టీసీఎస్ ఒక ప్రటనలో తెలియజేసింది. అలాగే సంస్థ సీఈవో రాజేష్ గోపీనాథన్ వరుసగా రెండోసారి టాప్ 100 గ్లోబల్ సీఈవోల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు

Most from this category