STOCKS

News


మళ్లీ మార్కెట్లోకి ‘వాక్‌మాన్‌’

Thursday 23rd January 2020
auto-mobiles_main1579749539.png-31119

  • టచ్‌స్క్రీన్‌తో అందిస్తున్న సోనీ ఇండియా
  • ధర రూ. 23,990

న్యూఢిల్లీ: అప్పట్లో పాటల ప్రియులను అలరించి, డిజిటల్ ధాటికి కనుమరుగైన వ్యాక్‌మాన్‌లను (పోర్టబుల్‌ పర్సనల్ క్యాసెట్ ప్లేయర్లు) సోనీ మళ్లీ కొత్త రూపులో ఆవిష్కరించింది. ఈసారి టచ్‌స్క్రీన్‌ సదుపాయంతో ఆండ్రాయిడ్ వాక్‌మాన్ ఎన్‌డబ్ల్యూ-ఎ105 మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 23,990. ఇందులో 16 జీబీ బిల్టిన్ మెమరీ ఉంటుందని, 128 జీబీ దాకా ఎక్స్‌పాండబుల్ మెమరీ ఉంటుందని సంస్థ తెలిపింది. 3.6 అంగుళాల టచ్‌స్క్రీన్‌, ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌, 26 గంటల పాటు పనిచేసే బ్యాటరీ, వై-ఫై ద్వారా పాటలు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం, వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు టైప్‌-సీ పోర్టు, అత్యుత్తమమైన ఆడియో నాణ్యత ఇందులో ప్రత్యేకతలని వివరించింది. జనవరి 24 నుంచి ఈ వాక్‌మాన్‌లు అందుబాటులోకి వస్తాయి. 



You may be interested

నేడు మార్కెట్‌ అక్కడక్కడే?

Thursday 23rd January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 4 పాయింట్లు మైనస్‌ నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 4 పాయింట్లు తక్కువగా 12,145  వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,149 వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించిన

మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్‌

Thursday 23rd January 2020

ధరలు రూ.5.29-9.29 లక్షల రేంజ్‌లో  తొలి డీజిల్‌ బీఎస్‌-6 కారు ముంబై: టాటా మోటార్స్‌ ప్రీమియమ్‌ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్లోకి ప్రవేశించింది.  ఆల్ట్రోజ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారులో ఐదు పెట్రోల్‌, ఐదు డీజిల్‌ వేరియంట్లను అందిస్తున్నామని టాటా మోటార్స్‌  సీఈఓ, ఎమ్‌డీ గుంటర్‌ బషెక్‌ చెప్పారు. పెట్రోల్‌ వేరియంట్ల ధరలు రూ.5.29-7.69 లక్షలు... డీజిల్‌ వేరియంట్ల ధరలు రూ.6.99-9.29 లక్షల రేంజ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇది భారత్‌లో తొలి బీఎస్‌-6 డీజిల్‌

Most from this category