News


7,000లోపు ఏ ఫోన్‌ బెటర్‌?

Saturday 15th September 2018
auto-mobiles_main1536996695.png-20288

ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో ఇటీవల కాలంలో పోటీ బాగా పెరిగింది. కంపెనీలు తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. రూ.7,000లోపు ధరలోని టాప్‌-4 స్మార్ట్‌ఫోన్లను కింద ఇచ్చాం. అవేంటో ఒకసారి చూద్దాం..  

ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌-2..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.45 అంగుళాల డిస్‌ప్లే (18:9 రేషియో), 1.5 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌ కోర్‌ మీడియాటెక్‌ ఎంటీ 6739 ప్రాసెసర్‌, 2 జీబీ ర్యామ్‌/16 జీబీ మెమరీ లేదా 3 జీబీ ర్యామ్‌/ 32 జీబీ మెమరీ, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 3,050 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 13 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, ఫేస్‌ అన్‌లాక్‌ వంటి ఫీచర్లున్నాయి. 2 జీబీ ర్యామ్‌/ 16 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.5,999గా, 3 జీబీ ర్యామ్‌/ 32 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.6,999గా ఉంది. 

రెడ్‌మి 6ఏ
ఇందులో 5.45 అంగుళాల స్క్రీన్‌ (18:9 రేషియో), 13 ఎంపీ రియర్‌ కెమెరా, ఫేస్‌ అన్‌లాక్‌, 2 గిగాహెర్ట్జ్‌ 12ఎన్‌ఎం హీలియో ఏ22 ప్రాసెసర్‌, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ మెమరీ, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 2 జీబీ ర్యామ్‌/16 జీబీ వేరియంట్‌ ధర రూ.5,999గా, 2 జీబీ ర్యామ్‌/ 32 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.6,999గా ఉంది.

హానర్‌ 7ఎస్‌
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ మెమరీ, 5.45 అంగుళాల స్క్రీన్‌ (18:9 రేషియో), 13 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,020 ఎంఏహెచ్‌ బ్యాటరీ, మీడియాటెక్‌ ఎంటీ6739 ఏ53 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1 ఓఎస్‌, ఫేస్‌ అన్‌లాక్‌ వంటి ఫీచర్లున్నాయి. దీని ధర రూ.6,999గా ఉంది.

రెడ్‌మి 5ఏ
ఇందులో 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ మెమరీ, 5 అంగుళాల స్క్రీన్‌, 13 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ నుగోట్‌ వంటి ప్రత్యేకతలున్నాయి. ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లు లేవు. 3 జీబీ ర్యామ్‌ర/32 జీబీ మెమరీ ధర రూ.6,999గా, 2 జీబీ ర్యామ్‌/16 జీబీ మెమరీ ధర రూ.5,999గా ఉంది.You may be interested

సెప్టెంబర్‌ 19న రూ.10వేల కోట్ల సెక్యూరిటీల కొనుగోలు: ఆర్‌బీఐ

Saturday 15th September 2018

ముంబై:- రిజర్వ్‌బ్యాంకు రూ.10వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం ఒక ప్రకటనను జారీ చేసింది. ప్రజలు, వాణిజ్యసంస్థలు, ఇతర విత్తసంస్థల నుంచి సెప్టెంబర్‌ 19న బహిరంగ మార్కెట్ కార్యకలాపాల(ఓఎంవో) ద్వారా ప్రభుత్వానికి చెందిన రూ.10వేల కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటనలో తెలిపింది. మార్కెట్లో ద్రవ్య లభ్యత పెంచండంతో పాటు, రూపాయి పతనాన్ని అరికట్టేందుకు సెక్యూరిటీ కొనుగోలు సిద్ధమైనట్లు

కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ కొనొచ్చు..

Saturday 15th September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెం‍ట్రమ్‌ తాజాగా కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ స్టాక్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: సెం‍ట్రమ్‌ స్టాక్‌: కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ ఇండస్ట్రీ: మెటల్స్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.140 ప్రస్తుత ధర: రూ.99 అప్‌సైడ్‌: 42 శాతం సెంట్రమ్‌ తాజాగా కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.140గా నిర్ణయించింది. కేఎల్‌డీ మైన్‌ను కోల్పోవడం కంపెనీకి పాజిటివ్‌ అంశమని పేర్కొంది. కేఎల్‌డీ మైన్‌ను వేలంలో తొలిగా

Most from this category