News


శాంసంగ్‌ ‘గెలాక్సీ ఎం’ సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్లు

Thursday 19th September 2019
auto-mobiles_main1568864477.png-28418

  • ‘ఎం10, ఎం30’ వేరియంట్స్‌ విడుదల
  • ధరల శ్రేణి రూ. 8,999 - 16,999

గురుగ్రామ్‌: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ ‘శాంసంగ్‌’ తాజాగా తన ‘గెలాక్సీ ఎం’ సిరీస్‌లో రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పండుగల సీజన్‌ సందర్భంగా ‘ఎం10, ఎం30’ పేరిట వీటిని ఇక్కడ విడుదలచేసింది. ‘గెలాక్సీ ఎం10’ స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో లభిస్తుండగా.. ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ. 8,999 వద్ద నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. శాంసంగ్‌ ఎక్సినోస్ 7884బి ప్రొసెసర్‌, ఆండ్రాయిడ్‌ 9 పై ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 6.4 అంగుళాల డిస్‌ప్లే.. వెనుకవైపు 13 మెగాపిక్సెల్‌ కెమెరా, 5 ఎంపీ కెమెరాలు ఉండగా, సెల్ఫీ కెమెరా 8 ఎంపీ ఉన్నట్లు వివరించింది. ఈ మోడల్‌లో 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చింది. 

అత్యుత్తమ ఫోటోలకు ‘ఎం30’
మరో మోడల్‌ అయిన ‘గెలాక్సీ ఎం30’ స్మార్ట్‌ఫోన్‌లో రెండు వేరియంట్లను విడుదలచేసింది. వీటిలో 4జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ కలిగిన వేరియంట్‌ ధర రూ. 13,999 కాగా, 6జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ. 16,999 వద్ద నిర్ణయించింది. ఈ వేరియంట్లలో 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నట్లు తెలియజేసింది. వెనుకవైపు 48 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా వ్యవస్థను అమర్చింది. నూతన మోడళ్లు సెప్టెంబర్‌ 29 నుంచి అమెజాన్‌ డాట్‌ కామ్‌, శాంసంగ్‌ డాట్‌ కామ్‌ వెబ్‌ సైట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక తాజా విడుదలతో ఈ సిరీస్‌లోని మొత్తం వేరియంట్ల సంఖ్య ఆరుకు చేరుకుంది.  



You may be interested

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కి అంతర్జాతీయ గుర్తింపు

Thursday 19th September 2019

ఫోర్బ్స్‌ ఉత్తమ బిజినెస్‌ స్కూళ్లలో 7వ స్థానం హైదరాబాద్‌: నగరంలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కి గొప్ప గుర్తింపు లభించింది. ఫోర్బ్స్‌ ఉత్తమ బిజినెస్‌ స్కూల్స్‌ 2019 ర్యాంకుల్లో అంతర్జాతీయంగా ఐఎస్‌బీకి ఏడో స్థానం దక్కింది. ఏడాది ఎంబీఏ కేటగిరీలో ఆసియా వ్యాప్తంగా అత్యుత్తమ బి-స్కూల్‌గా గుర్తింపునకు నోచుకుంది. ఫోర్బ్స్‌ ర్యాంకుల్లో ఐఎస్‌బీకి చోటు లభించడం ఈ ఏడాదే మొదటి సారి. ప్రతీ రెండేళ్లకు ఒకసారి అంతర్జాతీయంగా అత్యుత్తమ బి

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో పెరిగిన అంబానీ వాటా

Thursday 19th September 2019

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో  ప్రమోటర్‌ అనిల్‌ అంబానీ వాటా మరింతగా పెరిగింది. ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ పెట్రోలియమ్‌ ట్రస్ట్‌ నియంత్రణలోని రిలయన్స్‌ సర్వీసెస్‌ అండ్‌ హోల్డింగ్స్‌ కంపెనీ ఈ నెల 13న 2.71 శాతం వాటాకు సమానమైన 17.18 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో ముకేశ్‌ అంబానీ వాటా 48.87 శాతానికి పెరిగిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే రెండో అతి

Most from this category