News


ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో 2.46% క్షీణత

Wednesday 12th September 2018
auto-mobiles_main1536729699.png-20186

న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు (పీవీ సేల్స్‌) వరుసగా రెండవ నెలలోనూ తగ్గుదలను నమోదు చేసినట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) వెల్లడించింది. హై బేస్‌ ఎఫెక్ట్‌, కేరళ వరదల ప్రభావం కారణంగా ఆగస్టులో 2.46 శాతం క్షీణత నమోదైనట్లు సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథూర్‌ అన్నారు. ఇంధన ధరల పెరుగుదల కూడా అమ్మకాలపై స్వల్ప ప్రభావం చూపాయని వ్యాఖ్యానించారు. గత నెలలో పీవీ అమ్మకాలు 2,87,186 యూనిట్లుగా వివరించారు. గతేడాది ఆగస్టులో అమ్మకాలు 2,94,416 యూనిట్లుగా నమోదయ్యాయి తెలిపారు. ఇక ఈఏడాది జూలైలో సైతం పీవీ సేల్స్‌ 2.71 శాతం తగ్గుదలను నమోదుచేశాయి. ఈసారి కార్ల అమ్మకాలు 1,96,847 యూనిట్లుగా ఉన్నట్టు సియామ్‌ తాజా గణాంకాల్లో వెల్లడైంది. అంతకుముందు ఏడాది ఆగస్టులో 1,98,892 యూనిట్లు అమ్ముడవగా.. ఈసారి 1.03 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. మరోవైపు మొత్తం వాహన అమ్మకాలు ఆగస్టులో 3.43 శాతం వృద్ధిరేటును నమోదు చేశాయి. గతనెలలో 23,81,931 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. అంతకుముందు ఏడాది ఇదే నెలలో 23,02,902 యూనిట్లు అమ్ముడయ్యాయి.You may be interested

‘సిప్‌’ పెట్టుబడుల్లో 47 % వృద్ధి

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి కొనసాగిస్తున్న రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టులో సిప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ఏకంగా రూ.7,658 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన రూ.5,206 కోట్ల సిప్‌ పెట్టుబడులతో పోల్చితే 47 శాతం వృద్ధి చోటుచేసుకున్నట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫి) తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది.

ఈ నెల 18 నుంచి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్ల బైబ్యాక్‌

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  ఈ  నెల 18 నుంచి షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించనుంది. వచ్చే నెల 3న ముగిసే ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్‌ను రూ.1,100కు కొనుగోలు చేస్తారు. మొత్తం 3.64 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.4,000 కోట్లని సంస్థ తెలిపింది. ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు గతనెలలోనే వాటాదారులు ఆమోదం తెలిపారు. నికర లాభంలో సగానికి

Most from this category