News


మార్కెట్లోకి బీఎస్‌-6 సుజుకీ యాక్సెస్‌ 125

Tuesday 7th January 2020
auto-mobiles_main1578368962.png-30720

  • ప్రారంభ ధర రూ. 64,800

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్‌).. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న యాక్సెస్‌ 125 స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన మోడల్‌.. అల్లాయ్ డ్రమ్ బ్రేక్, అల్లాయ్ డిస్క్ బ్రేక్, స్టీల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్టాండర్డ్‌ వేరియంట్‌ ధర రూ. 64,800 (ఎక్స్‌షోరూం-ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. స్పెషల్‌ ఎడిషన్‌ ధర రూ. 69,500గా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ కొయిచిరో హిరావ్ మాట్లాడుతూ.. ‘ఎస్‌ఎంఐపీఎల్‌ వృద్ధి బాటలో ఈ స్కూటర్‌ పాత్ర కీలకంగా కొనసాగుతోంది. నూతన ఆవిష్కరణతో కస్టమర్ల అంచనాలను అందుకోగలమని భావిస్తున్నాం’ అని  వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన నిబంధనలు అమలుకానుండగా.. గడువు కంటే ముందుగానే తాజా ఫ్యామిలీ స్కూటర్‌ను విడుదల చేయగలిగామని అన్నారు. 



You may be interested

బీఎస్‌-6 ఇన్నోవా క్రిస్టా విడుదల

Tuesday 7th January 2020

ధరల శ్రేణి రూ. 15.36 లక్షలు - 24.06 లక్షలు  న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం).. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ‘ఇన్నోవా క్రిస్టా’ ఎస్‌యూవీని సోమవారం ఆవిష్కరించింది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో అందుబాటులో వచ్చిన ఈ అధునాతన వాహనం ధరల శ్రేణి రూ.15.36 లక్షలు నుంచి రూ. 24.06 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. సోమవారం నుంచే బుకింగ్స్‌ ప్రారంభం

సెప్టెంబర్‌ కల్లా ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ !

Tuesday 7th January 2020

వెల్లడించిన ఎన్‌ఎస్‌ఈ ఎమ్‌డీ విక్రమ్‌ లిమాయే  న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)  ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా  వచ్చే అవకాశాలున్నాయి. ఐపీఓ ప్రక్రియకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం కోరామని ఎన్‌ఎస్‌ఈ ఎమ్‌డీ, సీఈఓ విక్రమ్‌ లిమాయే పేర్కొన్నారు. సెబీ ఆమోదం రాగానే మర్చంట్‌ బ్యాంకర్ల నియామక ప్రక్రియను ఆరంభిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఐపీఓ సంబంధిత పత్రాలను సెబీకు సమర్పిస్తామని వెల్లడించారు. ఈ

Most from this category