News


మారుతీ డిజైర్‌.. టాప్‌ గేర్‌...

Wednesday 25th December 2019
auto-mobiles_main1577244548.png-30417

  • ఏప్రిల్‌-నవంబర్‌లో 1.2 లక్షల కార్ల విక్రయాలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల కాలంలో అత్యధికంగా అమ్ముడైన కారు మోడల్‌గా 'డిజైర్‌' నిల్చింది. ఏప్రిల్‌-నవంబర్ మధ్యకాలంలో ఈ కార్లు 1.2 లక్షల పైగా అమ్ముడైనట్లు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వెల్లడించింది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో డిజైర్ మార్కెట్ వాటా దాదాపు 60 శాతం దాకా ఉందని పేర్కొంది. డిజైర్‌కు ఆదరణ గణనీయంగా ఉందని, కస్టమర్ల డిమాండ్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నామని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్ విభాగం) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. డిజైర్ థర్డ్ జనరేషన్ మోడల్‌ను 2017 మేలో మారుతీ సుజుకీ ప్రవేశపెట్టింది. 



You may be interested

బీఎస్‌-6 ద్విచక్ర వాహనాల్లో హోండా రికార్డు

Wednesday 25th December 2019

న్యూఢిల్లీ: హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా బీఎస్‌-6 వాహన అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన యాక్టివా 125 స్కూటర్‌, ఎస్‌పీ 125 మోటారు సైకిల్‌ను విడుదల చేయగా, ఇవి 60,000 వాహన అమ్మకాల రికార్డును అధిగమించాయని సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వీటికి మంచి స్పందన లభిస్తున్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇంకా అన్ని ప్రాంతాల డీలర్ల పరిధిలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఆ

‘ఫండ్స్‌’లో దుర్వినియోగానికి సెబీ బ్రేకులు

Wednesday 25th December 2019

పూల్‌ అకౌంట్ల ద్వారా లావాదేవీలు ఇక కుదరవు వినియోగం నిలిపివేతకు ప్రతిపాదన ట్రేడింగ్‌, మార్జిన్ల కోసం క్లయింట్ల పెట్టుబడులు తరలింపు తన దృష్టికి రావడంతో సెబీ జాగ్రత్త చర్యలు న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు దుర్వినియోగం కాకుండా సెబీ ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ పూల్‌ అకౌంట్ల వినియోగాన్ని నిలిపివేయాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. క్లయింట్ల పెట్టుబడులు, సెక్యూరిటీలను ట్రేడింగ్‌ ద్వారా లేదా క్లియరింగ్‌ సభ్యులు మార్జిన్ల కోసం తరలించడం.. తమ

Most from this category