News


మారుతీ విక్రయ అంచనాల్లో కోత

Thursday 20th December 2018
auto-mobiles_main1545283239.png-23099

న్యూఢిల్లీ: వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వాహన విక్రయ అంచనాలను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు 10-12 శాతం రేంజ్‌లో వృద్ధి చెందగలవని ఈ కంపెనీ గతంలో అంచనా వేసింది. ఇప్పుడు ఈ అంచనాలను 8 శాతానికి తగ్గిస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ వెల్లడించారు. వడ్డీరేట్లు అధికంగా ఉండటం, బీమా వ్యయాలు పెరగడం వంటివి దీనికి కారణాలని చెప్పారు. అమ్మకాలు బాగా ఉండే విభాగంలో కొత్త మోడళ్లను అందించలేకపోవడం కూడా విక్రయాలపై ప్రభావం చూపనున్నదని పేర్కొన్నారు. సాధరణంగా ఎన్నికల ముందు సంవత్సరంలో వాహన విక్రయాలు తగ్గుతాయని, ఎన్నికల సంవత్సరంలో అమ్మకాలు పెరుగుతాయని చరిత్ర చెబుతోందని వివరించారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు మంచిగా ఉంటాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో వాహన విక్రయాల్లో 10.5 శాతం వృద్ధి సాధించామని భార్గవ తెలిపారు. అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్లో అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వృద్ధి 8 శాతంగానే ఉండొచ్చని వివరించారు. 
ఈ నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లు...
డీలర్ల వద్ద నిల్వలను తగ్గించే క్రమంలో భాగంగా ఈ నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నామని భార్గవ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌లో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తేనున్నామని, ఫలితంగా అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
హర్యానాలోనే కీలక ప్లాంట్‌....
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న కంపెనీ కీలక ప్లాంట్‌ను మరో చోటకి తరలించాలని యోచిస్తున్నామని, దీని కోసం హర్యానా ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని భార్గవ వెల్లడించారు. కీలక ప్లాంట్‌ను గురుగ్రామ్‌ నుంచి వేరే రాష్ట్రానికి తరలించబోమని, హర్యానాలోనే వేరే ప్రాంతానికి తరలిస్తామని స్పష్టం చేశారు.



You may be interested

ఆర్‌బీఐని ‘నిధులు’ అడుగుతాం..!

Thursday 20th December 2018

న్యూఢిల్లీ:  మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)ను కేంద్రం అడుగుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్‌ బుధవారం స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి ఆర్‌బీఐ రూ.10,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించింది. ఈ ఏడాదీ మధ్యంతర డివిడెండ్‌ను కోరుతున్నట్లు పేర్కొన్న గార్గ్‌ దీనిపై మరింత లోతుకు వెళ్లలేదు. బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదనపు మూలధనాన్ని అందించాలనీ కేంద్రం భావిస్తున్నట్లు

పసిడి 6నెలల గరిష్టం నుంచి పతనం

Thursday 20th December 2018

ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచడంతో పసిడి ధర తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. నిన్నటి ట్రేడింగ్‌లో మొదట ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం కోసం ఎదురుచూస్తూ 8.50డాలర్ల పెరిగి 1,262.10 డాలర్ల వద్ద 6నెలల గరిష్టానికి తాకింది. అయితే రాత్రి  ఫెడ్‌ వడ్డీరేట్లను పావుశాతం పెంచడంతో పసిడి ధర 6నెలల గరిష్టస్థాయి(1,262.10 డాలర్లు) నుంచి దిగివచ్చింది. కీలక వడ్డీరేట్ల పెంపుతో డాలర్‌ పుంజుకోవడంతో పాటు ఆరునెలల గరిష్టం

Most from this category