News


మారుతీ ఆల్టోలో కొత్త వేరియంట్‌

Friday 20th December 2019
auto-mobiles_main1576813188.png-30325

లీటర్‌కు 22 కిమీ. మైలేజీ 
ధర రూ.3.80 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ ఎంట్రీ లెవల్‌ చిన్న కారు, ఆల్టోలో కొత్త వేరియంట్‌ను (ఆల్టో వీఎక్స్‌ఐప్లస్‌)గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.3.80 లక్షలని(ఎక్స్‌ షోరూమ్‌) మారుతీ సుజుకీ ఇండియా ఈడీ(మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాత్సవ చెప్పారు. బీఎస్‌-సిక్స్‌ పర్యావరణ నిబంధనలకనుగుణంగా ఈ కారును తయారు చేశామని,  లీటర్‌కు 22 కిమీ. మైలేజీని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త వేరియంట్‌లో ఏరో ఎడ్జ్‌ డిజైన్‌, డ్యుయల్‌-టోన్‌ ఇంటీరియర్స్‌ వంటి ప్రత్యేకతలున్నాయని, తెలిపారు. ఈ కారులో స్మార్ట్‌ప్లే స్టూడియో, 17.8 సెం.మీ. టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. డ్యుయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సర్లు, స్పీడ్‌ అలర్ట్‌ సిస్టమ్‌, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ వంటి భద్రతా ఫీచర్లున్నాయని వివరించారు. భారత్‌లో గత పదిహేనేళ్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఆల్టోయేనని శ్రీవాత్సవ చెప్పారు. 



You may be interested

హ్యుందాయ్‌ ‘ఆరా’.. ఆగయా!!

Friday 20th December 2019

వచ్చే నెల నుంచి విక్రయాలు  రూ.6- 9 లక్షల రేంజ్‌లో ధరలు!   చెన్నై: హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ తన కొత్త కాంపాక్ట్‌ సెడాన్‌ ‘ఆరా’ను ఆవిష్కరించింది. ఈ సెడాన్‌ను వచ్చే నెలలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని హ్యుందాయ్‌ ఇండియా తెలియజేసింది. ఈ సెగ్మెంట్లో ఎక్సెంట్‌ తర్వాత ఈ కంపెనీ అందిస్తున్న మరో కారు ఇది. స్పోర్ట్స్‌ యుటిలిటి వెహికల్‌ (ఎస్‌యూవీ), కాంపాక్ట్‌ హ్యాచ్‌బాక్‌ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు సాధిస్తున్నామని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ

మార్కెట్లోకి టాటా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ

Friday 20th December 2019

నెక్సాన్‌ ఈవీ.. మూడు వేరియంట్లలో లభ్యం  ఒక్క సారి చార్జింగ్‌.. 300 కిమీ. ప్రయాణం  ధర రూ.15-17 లక్షల రేంజ్‌లో  ముంబై: వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ తన తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ, నెక్సాన్‌ ఈవీని గురువారం ఆవిష్కరించింది. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్లు కంటే ఎక్కువగానే ప్రయాణించే ఈ వాహన విక్రయాలను మరికొన్ని వారాల్లోనే ప్రారంభిస్తామని టాటా మోటార్స్‌ తెలిపింది. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని 9.9 సెకన్లలోనే ఈ వాహనం

Most from this category