News


మహీంద్రా ‘మారాజో’ ధరల పెంపు

Saturday 17th November 2018
auto-mobiles_main1542432699.png-22124

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇటీవలే విడుదల చేసిన ‘మారాజో’ బహుళ వినియోగ వాహనం ధరలను రూ.30,000-40,000 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. వచ్చే జనవరి 1 నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. రూ.9.99 లక్షల నుంచి రూ.13.90 లక్షల ధరల శ్రేణితో మారాజోను ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహీంద్రా మార్కెట్లోకి విడుదల చేసింది. ‘‘ఇది పరిచయ ధర మాత్రమేనని విడుదల సందర్భంలో చెప్పాం. విడుదల చేసిన నాలుగు నెలల తర్వాత 2019 జనవరి 1 నుంచి మారాజో ధరలను పెంచుతున్నాం’’ అని మహీంద్రా సంస్థ విక్రయాల చీఫ్‌ విజయ్‌రామ్‌ నక్రా తెలిపారు. 



You may be interested

బెంజ్‌ నుంచి నూతన సీఎల్‌ఎస్‌ 300డి

Saturday 17th November 2018

న్యూఢిల్లీ: జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సెడెస్‌ బెంజ్‌ నూతనంగా సీఎల్‌ఎస్‌ 300డి మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.84.70 లక్షలు. కొత్త తరం ఈ సీఎల్‌ఎస్‌ మోడల్‌ కారు రెండు లీటర్ల బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన డీజిల్‌ ఇంజన్‌తో, 180కేవీ పవర్‌తో ఉంటుందని కంపెనీ తెలిపింది. తాజా విడుదల 2018లో కంపెనీ నుంచి 12వ ఉత్పత్తి అని మెర్సెడెస్‌ బెంజ్‌ ఇండియా

ఆటోమేషన్ ఎనీవేర్‌కు 300 మిలియన్ డాలర్ల నిధులు

Saturday 17th November 2018

న్యూఢిల్లీ: రోబోటిక్ ప్రాసెస్‌ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) సేవలు అందించే ఆటోమేషన్ ఎనీవేర్ సంస్థ తాజాగా 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,154 కోట్లు) సమీకరించింది. సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్ ఫండ్ నుంచి ఈ నిధులు పొందినట్లు తెలియజేసింది. మానవ ప్రమేయం అవసరమైన కార్యకలాపాలను కూడా సాఫ్ట్‌వేర్ రోబోలతో ఆటోమేటిక్‌గా నిర్వహించుకోగలిగేలా చేసుకునేందుకు తోడ్పడే సాంకేతికతను ఆర్‌పీఏగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది జూలైలోనే న్యూ ఎంటర్‌ప్రైజ్ అసోసియేట్స్, గోల్డ్‌మాన్ శాక్స్ గ్రోత్

Most from this category