News


లాస్‌ వేగాన్‌ అవతార్‌ షో

Wednesday 8th January 2020
auto-mobiles_main1578455562.png-30750

అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో 2020 కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌) అట్టహాసంగా ప్రారంభమైంది. పలు దిగ్గజ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్‌ సంస్థలు తమ కొంగొత్త ఉత్పత్తులను ఇందులో ప్రదర్శనకు ఉంచాయి. దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ కొత్తగా రూపొందిస్తున్న ఎయిర్‌ ట్యాక్సీలను ఎస్‌–ఏ1 పేరిట ఆవిÙ్కరించింది. విద్యుత్‌తో నడిచే ఈ ఎయిర్‌ ట్యాక్సీ గరిష్టంగా గంటకూ 290 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. సుమారు 100 కి.మీ. దూరంలో, అరగంట ప్రయాణం ఉండే ప్రాంతాలకు నడిపే ట్యాక్సీ సర్వీసుల కోసం వీటిని వినియోగించేందుకు హ్యుందాయ్‌తో ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 

సూపర్‌ హిట్‌ హాలీవుడ్‌ సినిమా అవతార్‌ ప్రేరణతో రూపొందించిన ఏవీటీఆర్‌ కాన్సెప్ట్‌ కారును మెర్సిడెస్‌ బెంజ్‌ ఆవిష్కరించింది. పర్యావరణానికి చేటు చేయని విధంగా మనిషి, యంత్రాలు సమన్వయంతో జీవనం సాగించవచ్చని తెలియజెప్పే రీతిలో ఈ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని డిజైన్‌ చేసింది. ఈ అటానమస్‌ వాహనంలో స్టీరింగ్‌ వీల్, పెడల్స్‌ వంటివి ఉండవు. సెంటర్‌ కన్సోల్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది. బ్యాటరీ సహా ఇందులో అన్ని భాగాలను పూర్తిగా రీసైక్లబుల్‌ ఉత్పత్తులతో రూపొందించారు. 

శాంసంగ్‌ 'డిజిటల్ అవతార్‌'
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్‌ తాజాగా కృత్రిమ మేథతో (ఏఐ)తో పనిచేసే 'డిజిటల్‌ మనిషి' (డిజిటల్ అవతార్‌)ని ఆవిష్కరించింది. ఇది అచ్చం మనుషుల్లాగే సంభాషించడం, భావాలను వ్యక్తపర్చడం వంటివి చేయగలదని సంస్థ పేర్కొంది. నియోన్ అనే ఈ టెక్నాలజీతో డిజిటల్ అవతార్‌లను సృష్టించవచ్చని, డిస్‌ప్లేలు లేదా వీడియో గేమ్స్‌లో ఉపయోగించవచ్చని శాంసంగ్ తెలిపింది. అవసరానికి తగ్గట్లుగా టీవీ యాంకర్లుగా, సినిమా నటులు, అధికార ప్రతినిధులుగా లేదా స్నేహితులుగా కూడా వీటిని తీర్చిదిద్దుకోవచ్చని సంస్థ పేర్కొంది. లాస్‌ వెగాస్‌లో 2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌ షో ప్రారంభ కార్యక్రమంలో శాంసంగ్‌ ఈ డిజిటల్ అవతార్‌ను ప్రదర్శించింది. You may be interested

ఇరాన్‌ దాడులు...మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌

Wednesday 8th January 2020

అమెరికా-ఇరాన్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ సంకేతాలకు అనుగుణంగా బుధవారం భారత్‌ స్టాక్‌ సూచీలు భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 260 పాయింట్ల క్షీణతతో 40,600 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 80 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 11,970 పాయింట్ల సమీపంలోనూ ప్రారంభమయ్యాయి. 

మళ్లీ పసిడి మెరుపు- చమురు మంట

Wednesday 8th January 2020

1603 డాలర్లను తాకిన ఔన్స్‌ బంగారం  70 డాలర్లకు బ్రెంట్‌ చమురు బ్యారల్‌  అమెరికా సైన్యంపై ఇరాన్‌ ప్రతిదాడుల ఎఫెక్ట్‌ హెచ్చరించిన విధంగానే ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాలపై తాజాగా ఇరాన్‌ మిస్సైళ్లను ప్రయోగిచడం ద్వారా ప్రతిదాడులకు దిగడంతో ఉన్నట్టుండి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ముదిరాయి. వెరసి అటు బంగారం, ఇటు ముడిచమురు ధరలు మరోసారి రివ్వుమని పైకెగశాయి. తొలుత న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి ధర

Most from this category