STOCKS

News


లంబోర్గిని హురాకన్‌ ఈవీఓ ఆర్‌డబ్ల్యూడీ @ రూ. 3.22 కోట్లు

Thursday 30th January 2020
auto-mobiles_main1580357762.png-31321

  • ప్రారంభ ధర రూ.3.22 కోట్లు
  • 3.3 సెకన్లలో 100 కి.మీ వేగానికి
  • గరిష్ట వేగం గంటకు 325 కి.మీ

న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల తయారీ కంపెనీ ‘లంబోర్గిని’.. వెనుక చక్రాల ఆధారంగా నడిచే సరికొత్త లగ్జరీ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హురాకన్‌ ఈవీఓ రియర్‌-వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడీ) పేరిట విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ.3.22 కోట్లుగా నిర్ణయించింది. 5.2-లీటర్ల వీ10 ఇంజిన్‌ అమర్చిన ఈ నూతన మోడల్‌.. కేవలం 3.3 సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 325 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని సంస్థ ఇండియా హెడ్‌ శరద్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గతేడాదిలో 15 శాతం వృద్ధి రేటును నమోదుచేయగలిగాం. ఆటోమొబైల్‌ పరిశ్రమ నెమ్మదించిన కారణంగా మేం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. అయితే, ఈ ఏడాదిలో కూడా ఆకర్షణీయ వృద్ధి రేటునే కొనసాగిస్తాం. బడ్జెట్‌లో పరిశ్రమను ఆదుకునే సానుకూల ప్రకటనలు ఉండవచ్చని ఆసక్తిగా వేచి చూస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. 



You may be interested

మార్కెట్లోకి బీఎస్‌-6 హోండా ‘అమేజ్‌’

Thursday 30th January 2020

 ప్రారంభ ధర రూ.6.09 లక్షలు  న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్‌ ఇండియా’ (హెచ్‌సీఐఎల్‌).. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఎంట్రీ లెవెల్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ ‘అమేజ్‌’ కారును బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 1.2 లీటర్‌ పెట్రోల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.6.09 లక్షలు – 8.75 లక్షలుగా ఉంది. ఈ వేరియంట్లో మాన్యువల్‌ లీటరకు 18.6 కిలోమీటర్ల మైలేజీని, సీవీటీ వేరియంట్‌ 18.3

మార్కెట్లోకి మెర్సిడెస్‌ కొత్త ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ’

Thursday 30th January 2020

ధరల శ్రేణి రూ. 73.70 లక్షలు –  1.25 కోట్లు ముంబై: దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్‌-బెంజ్‌ ఇండియా’ తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలోని లాంగ్‌ వీల్‌ బేస్‌ (ఎల్‌డబ్ల్యూబీ) జీఎల్‌ఈలో రెండు నూతన వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటిలో ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ 300 డీ’ ధర రూ. 73.70 లక్షలు కాగా.. హిప్‌-హాప్‌ వేరియంట్‌గా కంపెనీ వ్యవహరిస్తున్న ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ 400 డీ’ ధర రూ. 1.25

Most from this category