News


పెరుగుతున్న హ్యుందాయ్‌ కార్ల ధరలు

Friday 21st December 2018
auto-mobiles_main1545369713.png-23129

న్యూఢిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా కంపెనీ కార్ల ధరలను పెంచుతోంది. అన్ని మోడళ్ల ధరలను రూ.30,000 వరకూ పెంచుతున్నామని హ్యుందాయ్‌ కంపెనీ తెలిపింది. పెరిగిన ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను కొంతవరకైనా తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ.3.89 లక్షల నుంచి రూ.26.84 లక్షల రేంజ్‌లో ధరలుండే శాంత్రో హ్యాచ్‌బాక్‌ నుంచి ఎస్‌యూవీ ట్యూసన్‌ వరకూ వివిధ రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. కమోడిటీల ధరలు పెరగడం, విదేశీ మారక ద్రవ్య రేట్లలో ఒడిదుడకులు కారణంగా  ఇప్పటికే చాలా కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.  టాటా మోటార్స్‌, ఫోర్డ్‌ ఇండియా, నిస్సాన్‌ ఇండియా, మారుతీ సుజుకీ, టయోటా, బీఎమ్‌డబ్ల్యూ, రెనో, ఇసుజు కంపెనీలు ధరలను పెంచనున్నామని పేర్కొన్నాయి. 



You may be interested

స్విగ్గీ రూ.7000 కోట్ల సమీకరణ

Friday 21st December 2018

బెంగళూరు: ఇటీవల ఆరంభించిన 100 కోట్ల డాలర్ల నిధుల సమీకరణను విజయవంతంగా పూర్తి చేసినట్లు దేశీయ అతిపెద్ద ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. అంటే ఇది మన కరెన్సీలో దాదాపు రూ.7వేల కోట్లు. కంపెనీలో ఇప్పటికే పెట్టుబడులున్న నాస్పర్స్‌తో పాటు ఇతర ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులను సమీకరించినట్లు తెలియజేసింది. ఈ సమీకరణతో కంపెనీ విలువ 3.3 బిలియన్‌ డాలర్లకు చేరినట్లయింది. అంటే దాదాపు రూ.21,200 కోట్లన్న మాట. ఈ

4 కోట్లకు హోండా వాహన విక్రయాలు

Friday 21st December 2018

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌​ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ) వాహన విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మైలురాయిని అధిగమించాయి. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల అమ్మకాల మైలురాయిని 18 ఏళ్లలోనే సాధించామని హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ తెలిపింది. మొదటి 2 కోట్ల వాహన అమ్మకాలు 14 ఏళ్లలో సాధించగా, తర్వాతి 2 కోట్ల వాహన విక్రయాలను నాలుగేళ్లలోనే సాధించగలిగామని హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ ప్రెసిడెంట్‌, సీఈఓ మినోరు కటో తెలిపారు. ఆరంభం నుంచే అత్యున్నత నాణ్యత గల

Most from this category