News


హ్యుందాయ్‌ ‘ఆరా’.. ఆగయా!!

Friday 20th December 2019
auto-mobiles_main1576813352.png-30326

  • వచ్చే నెల నుంచి విక్రయాలు 
  • రూ.6- 9 లక్షల రేంజ్‌లో ధరలు!  

చెన్నై: హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ తన కొత్త కాంపాక్ట్‌ సెడాన్‌ ‘ఆరా’ను ఆవిష్కరించింది. ఈ సెడాన్‌ను వచ్చే నెలలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని హ్యుందాయ్‌ ఇండియా తెలియజేసింది. ఈ సెగ్మెంట్లో ఎక్సెంట్‌ తర్వాత ఈ కంపెనీ అందిస్తున్న మరో కారు ఇది. స్పోర్ట్స్‌ యుటిలిటి వెహికల్‌ (ఎస్‌యూవీ), కాంపాక్ట్‌ హ్యాచ్‌బాక్‌ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు సాధిస్తున్నామని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ ఎస్‌.ఎస్‌. కిమ్‌ పేర్కొన్నారు. కాంపాక్ట్‌ సెడాన్‌ సెగ్మెంట్లో వెనకబడి ఉన్నామని, కొత్త ఆరా కారుతో ఆ సెగ్మెంట్లో కూడా మంచి అమ్మకాలు సాధించగలమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీఎస్‌ 6 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించామని, పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో ఇది లభ్యమవుతుందని చెప్పారాయన. ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్‌, వైర్లెస్‌ చార్జింగ్‌, డ్రైవర్‌ రియర్‌ వ్యూ మానిటర్‌, స్వెప్ట్‌బ్యాక్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, బూమరాంగ్‌ షేప్‌లో ఉండే ఎల్‌ఈడీ డే రన్నింగ్ లైట్స్‌ తదితర ఫీచర్లున్నాయని తెలియజేశారు. 
రూ. 6-9 లక్షల రేంజ్‌లో ధరలు! 
ఈ కారు ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్‌షోరూమ్‌ ధరలు) శ్రేణిలో ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ కారు మారుతీ డిజైర్‌, హోండా అమేజ్‌, ఫోక్స్‌వ్యాగన్‌ అమియో, ఫోర్డ్‌ ఆస్పైర్‌, టాటా టిగొర్‌, టొయోటా యారీలకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయ కాంపాక్ట్‌ సెడాన్‌ మార్కెట్లో నెలకు 25,000 కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ మార్కెట్లో మారుతీ డిజైర్‌, హోండా అమేజ్‌దే అగ్రస్థానం. 

 



You may be interested

యమహా నుంచి 125 సీసీ స్కూటర్లు

Friday 20th December 2019

ఫ్యాసినో125ఎఫ్‌ఐ @ రూ.67,430 110 సీసీ స్కూటర్లకు మంగళం  చెన్నై: యమహా మోటార్‌ ఇండియా కంపెనీ 125 సీసీ స్కూటర్‌ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో రెండు కొత్త మోడళ్లు- ఫ్యాసినో 125ఎఫ్‌ఐ, రేజర్‌125ఎఫ్‌ఐలను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాసినో స్కూటర్‌ ధరను రూ.67,430(ఎక్స్‌ షోరూమ్‌)గా నిర్ణయించామని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ గ్రూప్‌) రవీందర్‌ సింగ్‌ తెలిపారు. త్వరలో స్ట్రీట్‌ ర్యాలీ 125ఎఫ్‌ఐ మోడల్‌ స్కూటర్‌ను కూడా మార్కెట్లోకి

మారుతీ ఆల్టోలో కొత్త వేరియంట్‌

Friday 20th December 2019

లీటర్‌కు 22 కిమీ. మైలేజీ  ధర రూ.3.80 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌) న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ ఎంట్రీ లెవల్‌ చిన్న కారు, ఆల్టోలో కొత్త వేరియంట్‌ను (ఆల్టో వీఎక్స్‌ఐప్లస్‌)గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.3.80 లక్షలని(ఎక్స్‌ షోరూమ్‌) మారుతీ సుజుకీ ఇండియా ఈడీ(మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాత్సవ చెప్పారు. బీఎస్‌-సిక్స్‌ పర్యావరణ నిబంధనలకనుగుణంగా ఈ కారును తయారు చేశామని,  లీటర్‌కు 22 కిమీ. మైలేజీని ఇస్తుందని

Most from this category