News


బీఎస్‌-6 ద్విచక్ర వాహనాల్లో హోండా రికార్డు

Wednesday 25th December 2019
auto-mobiles_main1577244727.png-30418

న్యూఢిల్లీ: హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా బీఎస్‌-6 వాహన అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన యాక్టివా 125 స్కూటర్‌, ఎస్‌పీ 125 మోటారు సైకిల్‌ను విడుదల చేయగా, ఇవి 60,000 వాహన అమ్మకాల రికార్డును అధిగమించాయని సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వీటికి మంచి స్పందన లభిస్తున్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇంకా అన్ని ప్రాంతాల డీలర్ల పరిధిలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఆ లోపే ఈ రికార్డు సాధ్యమైనట్టు కంపెనీ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యదువీందర్‌ సింగ్‌ గులేరియా తెలిపారు. 



You may be interested

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అపార అవకాశాలు

Wednesday 25th December 2019

2019లో రెట్టింపైన నిపుణులు గ్రేట్ లెర్నింగ్ సంస్థ నివేదిక న్యూఢిల్లీ: వ్యాపార సంస్థల్లో కొంగొత్త టెక్నాలజీల వినియోగం మెరుగుపడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2019లో ఏఐ ఉద్యోగుల సంఖ్య రెట్టింపయ్యింది. అయితే, నిపుణులు తగినంత స్థాయిలో దొరక్కపోతుండటంతో ఇంకా చాలా రంగాల సంస్థల్లో ఏఐ ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయని, ఈ విభాగంలో నిపుణులకు అపార అవకాశాలు ఉన్నాయని ఎడ్యుటెక్ సంస్థ గ్రేట్ లెర్నింగ్

మారుతీ డిజైర్‌.. టాప్‌ గేర్‌...

Wednesday 25th December 2019

ఏప్రిల్‌-నవంబర్‌లో 1.2 లక్షల కార్ల విక్రయాలు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల కాలంలో అత్యధికంగా అమ్ముడైన కారు మోడల్‌గా 'డిజైర్‌' నిల్చింది. ఏప్రిల్‌-నవంబర్ మధ్యకాలంలో ఈ కార్లు 1.2 లక్షల పైగా అమ్ముడైనట్లు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వెల్లడించింది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో డిజైర్ మార్కెట్ వాటా దాదాపు 60 శాతం దాకా ఉందని పేర్కొంది. డిజైర్‌కు ఆదరణ గణనీయంగా ఉందని, కస్టమర్ల డిమాండ్లకు అనుగుణంగా

Most from this category