News


పెరగనున్న హోండా కార్ల ధరలు

Saturday 15th December 2018
auto-mobiles_main1544849205.png-22953

న్యూఢిల్లీ: దేశీ ఆటోరంగ సంస్థ హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌) ఉత్పత్తి చేస్తున్న అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ అంశంపై వివరణ ఇచ్చిన కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) రాజేష్ గోయల్.. ‘ముడి పదార్థాల ధరలు 4 శాతం పెరిగాయి. ఈ కారణంగా పెంపు తప్పటం లేదు. జనవరి ఒకటి నుంచి అన్ని మోడళ్ల ధరలు పెరగనున్నాయి. అయితే, ఎంత మేర పెంపు ఉండాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది.’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు దాదాపు మిగిలిన ఆటోరంగ సంస్థలన్నీ కూడా జనవరి ఒకటి నుంచి కార్ల ధరల పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో నిస్సాన్‌ మోటార్స్‌ ఇండియా తమ ప్యాసింజర్‌ వాహనాల ధరలను అత్యధికంగా 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. 



You may be interested

నిబంధనలు కాస్త సడలించండి

Saturday 15th December 2018

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) నుంచి దాదాపు రూ. 60,000 కోట్ల రుణాలను రాబట్టుకునేందుకు బ్యాంకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ముందు రెండు ప్రతిపాదనలుంచాయి. వీటి ప్రకారం రుణాలను మొండిబాకీలుగా వర్గీకరించేందుకు ఆరు నెలల మారటోరియం వ్యవధి, ఆ తర్వాత సదరు రుణాల ప్రొవిజనింగ్‌ నిబంధనల్లో కొంత సడలింపు ఇవ్వాలని కోరుతున్నాయి. సంబంధిత వర్గాల కథనం ప్రకారం..

గవర్నెన్స్ విధానంపై లోతుగా అధ్యయనం

Saturday 15th December 2018

ముంబై: కొత్త గవర్నర్‌గా నియమితులైన శక్తికాంత దాస్‌ సారథ్యంలో శుక్రవారం తొలిసారిగా భేటి అయిన ఆర్‌బీఐ బోర్డు.. గవర్నెన్స్‌ విధానాలపై మరింత లోతుగా పరిశీలన జరపాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దేశీయంగాను.. అంతర్జాతీయంగాను ఎదురవుతన్న సవాళ్లు, లిక్విడిటీ, రుణ వితరణ, కరెన్సీ నిర్వహణ, ఆర్థిక అక్షరాస్యత తదితర అంశాలపై చర్చించింది. ’ఆర్‌బీఐ గవర్నెన్స్‌ అంశంపై బోర్డు చర్చించింది. దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది’

Most from this category