News


మార్కెట్లోకి మెర్సిడెస్‌ కొత్త ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ’

Thursday 30th January 2020
auto-mobiles_main1580357608.png-31320

  • ధరల శ్రేణి రూ. 73.70 లక్షలు –  1.25 కోట్లు

ముంబై: దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్‌-బెంజ్‌ ఇండియా’ తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలోని లాంగ్‌ వీల్‌ బేస్‌ (ఎల్‌డబ్ల్యూబీ) జీఎల్‌ఈలో రెండు నూతన వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటిలో ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ 300 డీ’ ధర రూ. 73.70 లక్షలు కాగా.. హిప్‌-హాప్‌ వేరియంట్‌గా కంపెనీ వ్యవహరిస్తున్న ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ 400 డీ’ ధర రూ. 1.25 కోట్లు. ఎంట్రీ లెవెల్‌ మోడల్‌లో 2.0 లీటర్ల 4-సిలెండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను.. హిప్‌-హాప్‌లో 3.0 లీటర్ల 6-సిలెండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ అమర్చింది. జీఎల్‌ఈ మోడల్‌ 7.2 సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, గరిష్టంగా గంటకు 225 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని సంస్థ వెల్లడించింది. ఇక లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో జీఎల్‌ఈ మోడల్‌ అత్యధిక అమ్మకాలను నమోదుచేసిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్‌ సీఈఓ మార్టిన్ ష్వెంక్ అన్నారు. భారత్‌లో ఈ మోడల్‌ విడుదలైన వద్ద నుంచి 13,000 యూనిట్లను విక్రయించినట్లు వెల్లడించారు. గతేడాదిలో కంపెనీ అమ్మకాలు 13,786 యూనిట్లుతో 11 శాతం క్షీణతను నమోదుచేసింది. 



You may be interested

లంబోర్గిని హురాకన్‌ ఈవీఓ ఆర్‌డబ్ల్యూడీ @ రూ. 3.22 కోట్లు

Thursday 30th January 2020

ప్రారంభ ధర రూ.3.22 కోట్లు 3.3 సెకన్లలో 100 కి.మీ వేగానికి గరిష్ట వేగం గంటకు 325 కి.మీ న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల తయారీ కంపెనీ ‘లంబోర్గిని’.. వెనుక చక్రాల ఆధారంగా నడిచే సరికొత్త లగ్జరీ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హురాకన్‌ ఈవీఓ రియర్‌-వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడీ) పేరిట విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ.3.22 కోట్లుగా నిర్ణయించింది. 5.2-లీటర్ల వీ10 ఇంజిన్‌ అమర్చిన ఈ నూతన

12100 దిగువన నిఫ్టీ ప్రారంభం

Thursday 30th January 2020

అంతర్జాతీయ మార్కెట్లను బలహీన సంకేతాలు అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం నష్టంతో మొదలైంది. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 134 పాయింట్లను కోల్పోయి 41,064.09 వద్ద, నిఫ్టీ 32.45పాయింట్ల నష్టంతో 12100 దిగువన 12,097.05 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఒక్క రియల్టీ, అటో షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలక బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Most from this category