News


బీఎస్‌-6 ఇన్నోవా క్రిస్టా విడుదల

Tuesday 7th January 2020
auto-mobiles_main1578369186.png-30721

  • ధరల శ్రేణి రూ. 15.36 లక్షలు - 24.06 లక్షలు 

న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం).. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ‘ఇన్నోవా క్రిస్టా’ ఎస్‌యూవీని సోమవారం ఆవిష్కరించింది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో అందుబాటులో వచ్చిన ఈ అధునాతన వాహనం ధరల శ్రేణి రూ.15.36 లక్షలు నుంచి రూ. 24.06 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. సోమవారం నుంచే బుకింగ్స్‌ ప్రారంభం కాగా, వచ్చే నెల నుంచి కస్టమర్లకు డెలివరీలు ఇవ్వనున్నామని కంపెనీ ప్రకటించింది. 



You may be interested

మంగళవారం వార్తల్లోని కంపెనీలు

Tuesday 7th January 2020

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ తాజాగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. సోమవారం టెక్నాలజీ దిగ్గజాల అండతో అమెరికా స్టాక్‌ ఇండెక్సులు 0.25-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల వాతావరణం కనిపిస్తోంది. దీంతో దేశీయంగా నేడు(మంగళవారం) ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా దేశీ మార్కెట్లు గ్యాపప్‌తో ప్రారంభంకావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు విభిన్న వార్తల కారణంగా కొన్ని

మార్కెట్లోకి బీఎస్‌-6 సుజుకీ యాక్సెస్‌ 125

Tuesday 7th January 2020

ప్రారంభ ధర రూ. 64,800 న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్‌).. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న యాక్సెస్‌ 125 స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన మోడల్‌.. అల్లాయ్ డ్రమ్ బ్రేక్, అల్లాయ్ డిస్క్ బ్రేక్, స్టీల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్టాండర్డ్‌ వేరియంట్‌ ధర రూ. 64,800 (ఎక్స్‌షోరూం-ఢిల్లీ) వద్ద నిర్ణయించింది.

Most from this category