ఎలక్ట్రిక్ వాహనాలు..15 లక్షల ఉద్యోగాలకు ప్రమాదం
By Sakshi

ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వలన ఇందన దిగుమతి ఖర్చులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వలన కాలుష్యాన్ని తగ్గించే విలుంటుంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థను నడిపించే ఆటో రంగంలో ఈ సాంకేతిక మార్పు అనేక మందిపై ప్రత్యక్ష, పరోక్షంగా ప్రభావం చూపనుంది. లక్షలాది ఉద్యోగాలను కోల్పోవలసి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహానాలకు మారడం వలన ఫ్యాక్టరీలలో ఇంజన్, ట్రాన్స్మిషన్ (పవర్ ట్రైన్) ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. ఈ ఉద్యోగాలతో పాటు ఆటో విడిభాగాల రంగం, డీలర్షిప్ సర్వీస్ ఇండస్ట్రీలో చాలా మంది ఉద్యోగాలను కోల్పొవలసి వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వలన సుమారు 10 నుంచి 15 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని అంచనా.
ఇంధన పునర్వినియోగ వ్యవస్థ, ఎగ్జాస్ట్, ఇంధన ట్యాంక్ వంటి విభాగాలు నిరుపయోగంగా మారిపోతాయి. ఇంజిన్‌కు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్‌అండ్‌డి) విభాగాల్లో పనిచేసే ఇంజనీర్లపై దీని ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు తమ వాహనాలను తమ ఇళ్లల్లో లేదా కార్యాలయాలలో చార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది కనుక ఇంధన కేంద్రాలలోని ఉద్యోగులు ఇబ్బందులు పడతారు. అన్నింటి కన్నా అసంఘటిత రంగంలో ఈ మార్పు ప్రభావం అధికంగా ఉంటుంది. రోడ్‌సైడ్ అనధికార గ్యారేజీలు, థర్డ్ పార్టీ సేవలను అందించే సంస్థల వ్యాపారాలు దెబ్బతింటాయి. ఎలక్ట్రిక్ వాహనాల పనులు ఇంజిన్ పనుల కంటే క్లిషంగా ఉంటాయి. సరైన శిక్షణ లేకుండా వారు ఎలక్ట్రిక్ వాహనాల సేవలను అందించడం కష్టమవుతోంది.
వాహనా విడిభాగాలు ముఖ్యంగా ఇంజన్, ట్రాన్సిమిషన్ భాగాలను నకిలీగా తయారు చేసే వాళ్ల వ్యాపారాలు మూసివేయవలసి ఉంటుంది. ఇందనంతో నడిచే కార్లలోని కదిలే పవర్ట్రైయిన్లా కాకుండా గేర్లు లేని ఎలక్ట్రిక్ వాహనాలలో స్థిరమైన బ్యాటరి అవసరమవుతుంది. కదలికలు ఎక్కువగా ఉంటే వాటి సర్వీసింగ్ ఎక్కువ సార్లు జరపవలసి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల రాకతో ఆ విభాగంలోని ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. ఇందన వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల వలన 35 శాతం ఖర్చులు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నా ఈ నిర్ణయం మొదట ద్విచక్ర, త్రి చక్ర వాహనాలలో కనిపించనుంది. 2025 తర్వాత నుంచి 150 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్ద్యం కలిగిన అన్ని ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ రూపాన్ని సంతరించుకోనున్నాయి. అదే విధంగా 2023 తర్వాత నుంచి అన్ని త్రి చక్రవాహనాలు ఎలక్ట్రిక్ వాహనాల రూపంలో ఉండాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసం ఆటో కంపెనీలతో తరచూ సమావేశాలను ఏర్పాటు చేస్తుంది.
You may be interested
సీఎఫ్ఓ అరెస్ట్: ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 13శాతం పతనం
Monday 15th July 2019కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసుర్ అరెస్ట్ కావడంతో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 13శాతం పతనమయ్యాయి. రూ.14.58 కోట్ల కస్టమ్స్ పన్ను ఎగవేత కేసులో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు సేవలందిస్తున్న దినేశ్ మహేశ్వరీని శనివారం డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అరెస్టు చేసింది. బంగ్లాదేశ్ నుంచి రెడిమేడ్ దుస్తులను దిగుమతి చేసుకున్న ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్.. కనీస కస్టమ్స్ పన్ను చెల్లించకుండా పెట్రోపోల్ లాండ్ కస్టమ్స్ స్టేషన్
బ్యాంకు నిఫ్టీలో బటర్‌ఫ్లై స్ప్రెడ్ వ్యూహం బెటర్!
Monday 15th July 2019నిపుణుల సూచన గతవారం భారీ నష్టాలు చూసిన సూచీలు ఈ వారాన్ని సైతం నష్టాలతో కొనసాగిస్తున్నాయి. గత వారం బ్యాంకునిఫ్టీ దాదాపు 3 శాతం పతనమైంది. ఇదే సమయంలో సూచీ ఓపెన్ ఇంట్రెస్ట్ 2.5 శాతం అన్‌వైండింగ్ చూసింది. ఈ నేపథ్యంలో బ్యాంకు నిఫ్టీలో సరైన ఆప్షన్స్ వ్యూహం అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు నిఫ్టీ స్వల్ప రేంజ్‌లోనే కదలాడే ఛాన్సులున్నాయని చెబుతున్నారు. బ్యాంకునిఫ్టీకి 30500-30700 తక్షణ మద్దతుగా నిలుస్తుందని ఓపెన్