Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

GST Collections For May Rs 1 73 Lakh Crore
ప్రభుత్వానికి కాసుల వర్షం.. భారీగా జీఎస్టీ వసూళ్లు

కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. మే నెలలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. దేశీయ లావాదేవీల్లో బలమైన పెరుగుదల, దిగుమతులు మందగించడంతో మే నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 10 శాతం వృద్ధితో రూ.1.73 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది.2024-25 ఆర్థిక సంవత్సరంలో మే వరకు స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3.83 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఇది వార్షిక వృద్ధికి 11.3 శాతం ప్రాతినిధ్యం వహిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. రిఫండ్ల లెక్కింపు తర్వాత, 2024-25 ఆర్థిక సంవత్సరంలో నికర జీఎస్టీ ఆదాయం 2024 మే వరకు రూ .3.36 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 11.6 శాతం పెరిగింది.రిఫండ్ల లెక్కింపు తర్వాత మే నెలలో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.44 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. కేంద్ర వస్తు, సేవల పన్ను (సీజీఎస్టీ) రూ.32,409 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.40,265 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ రూ.87,781 కోట్లుగా ఉన్నాయని, ఇందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన రూ.39,879 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది.

Tesla Recalling More Than 125000 Vehicles Check The Reason
1.25 లక్షల కార్లకు రీకాల్.. టెస్లా సంచలన నిర్ణయం

అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఏకంగా 1,25,000 కంటే ఎక్కువ కార్లకు రీకాల్ ప్రకటించింది. సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్ పనితీరులో లోపాలు ఉన్నట్లు గుర్తించి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.రీకాల్ ప్రకటించిన కార్లలో 2012 - 2024 మధ్య తయారైన టెస్లా ఎస్ మోడల్, 2015 - 2024 మధ్య విడుదలైన ఎక్స్ మోడల్, 2017-2023 మోడల్ 3, 2020-2023 మోడల్ Y వాహనాలు ఉన్నాయి. సీట్ బెల్ట్ ధరించని డ్రైవర్లకు రిమైండర్ సిగ్నెల్ అందించాలి, కానీ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా ఇది సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించారు. ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్‌లో ఏర్పడిన లోపాన్ని సరిచేయడానికి టెస్లా ఈ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు కంపెనీ కార్లలో ఈ సమస్య ఉన్నట్లు ఎక్కడా ఫిర్యాదులు అందలేదు. కానీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఈ సమస్యను గురించినట్లు సమాచారం.

SBI Tells Man to Delete Pic of Branch Immediately
వెంటనే ఫోటో డిలీట్ చేయండి: ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్‌బీఐ

ఇటీవల ఓ వ్యక్తి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాళీగా ఉన్న బ్రాంచ్ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలని ఆ వ్యక్తిని ఎస్‌బీఐ హెచ్చరించింది.ఒక వ్యక్తి మధ్యాహ్నం 3 గంటల సమయంలో బ్యాంకుకు వెళ్ళాడు. ఆ సమయంలో బ్యాంకులో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో.. అసహనానికి గురయ్యాడు. దీంతో ఖాళీగా ఉన్న క్యాబిన్ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపించారు. బ్యాంకులో ఒకేసారి మధ్యాహ్న భోజనానికి వెళితే.. కస్టమర్లు ఇబ్బంది పడతారని, ఆలా చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. కస్టమర్‌కు కలిగిన అసౌకర్యానికి ఎస్‌బీఐ చింతించింది.ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలను వెంటనే తొలగించాలని హెచ్చరించింది. బ్యాంకులో ఫోటోలు, వీడియోలు పూర్తిగా నిషిద్ధం. ఇవన్నీ భద్రతకు భంగం కలుగుతాయని పేర్కొంటూ.. జరగరానిది ఏమైనా జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ పేర్కొంది.User complains that the entire staff was out for lunch at an SBI branch.Instead of asking which branch it was, SBI official handle threatens user to delete it.😂"immediately." pic.twitter.com/xtPPXN11zg— Kanan Bahl (@BahlKanan) May 31, 2024

RBI Imposes Monetary Penalty on SBM Bank India Details
ఎస్‌బీఎమ్‌ బ్యాంక్‌కు రూ.88.70 లక్షలు ఫైన్: ఎందుకంటే?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల ఎస్‌బీఎమ్‌ బ్యాంక్ (ఇండియా)కు భారీ జరిమానా విధించింది. ఇంతకీ ఈ బ్యాంకును జరిమానా ఎందుకు విధించింది? ఎంత జరిమానా విధించింది అనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.ఆర్‌బీఐ షరతులను పాటించనందుకు ఎస్‌బీఎమ్‌ బ్యాంక్ (ఇండియా)కు ఏకంగా రూ. 88.70 లక్షలు జరిమానా విధించారు. అంతే కాకుండా.. తక్షణమే అమల్లోకి వచ్చేలా సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద లావాదేవీలను నిలిపివేయాలని ప్రత్యేక సూచనలను జారీ చేశారు.ఆర్‌బీఐ సూచించిన ఆదేశాలు పాటించడంలో ఎస్‌బీఎమ్‌ విఫలమైనందుకు బ్యాంకుకు రెండు వేర్వేరు నోటీసులు జారీ చేసింది. ఇందులో కారణాలను పేర్కొనాలని సూచించింది. పెనాల్టీ అనేది రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటుందని.. బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటును ప్రభావితం చేయడానికి ఉద్దేశించినది కాదని ఆర్బీఐ తెలిపింది.

Bank of India launches 666 days Fixed Deposit Check all details here
బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్‌డీ.. వడ్డీ ఎంతంటే?

బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ప్రకటించింది. 666 రోజుల ఎఫ్‌డీని ప్రారంభించింది. ఇది రూ .2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ మొత్తాలపై సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం వరకు వడ్డీని అందిస్తుంది.666 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తాయి. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులను సూపర్ సీనియర్ సిటిజన్లుగా వ్యవహరిస్తారు.ఈ 666 రోజుల ఎఫ్‌డీపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, సాధారణ కస్టమర్లకు 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ రూపాయి టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. ఇవి జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై రుణం పొందే సౌలభ్యం, ప్రీమెచ్యూర్ విత్‌డ్రా సదుపాయం అందుబాటులో ఉంది.కస్టమర్లు, సాధారణ ప్రజలందరూ ఈ పెట్టుబడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏ బ్రాంచిలోనైనా ఈ ఎఫ్‌డీని తెరవచ్చు. అలాగే బీఓఐ ఓమ్ని నియో యాప్‌, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ ద్వారా కూడా ఈ ఎఫ్‌డీని తెరిచే అవకాశం ఉంది.

Elon Musk Never Aimed To Be CEO X User post
ఉద్యోగులు ఇంటికెళ్లాక.. మస్క్‌ గురించి ఆసక్తికర విషయం!

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు, టెస్లా, స్పేస్ ఎక్స్‌ల బిగ్ బాస్ ఎలాన్ మస్క్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆటోమొబైల్‌, అంతరిక్షం, అంతర్జాలం (ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా) రంగాల్లో విజయవంతమైన కంపెనీలను ఆయన నడుపుతున్నారు.అయితే ఎలాన్‌ మస్క్‌ గురించి తాజాగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఓ యూజర్ మస్క్ శ్రద్ధగా పనిచేస్తున్న త్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నాడు. "జిప్‌2 (మస్క్‌ స్థాపించిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ)లో పనిచేసే ఇంజనీర్లు ఇళ్లకు వెళ్లగానే వారు రాసిన కోడ్‌ను తిరిగి రాసేవాడు. అలా వారానికి 120 గంటలు పనిచేసేవాడు. ఒక సీఈఓలా ఉండాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు" అని రాసుకొచ్చారు. నిజమే..ఎక్స్‌ యూజర్‌ తన గురించి పెట్టిన పోస్టుపై ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. 'నిజమే' అంటూ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పోస్ట్‌కు 2.3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. విపరీతంగా కామెంట్లు, రీ పోస్టులు, లైక్‌లతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Elon Musk used to rewrite code of engineers working at Zip2 after they went home, and used to work 120 hours a week. He never really wanted to be a CEO. pic.twitter.com/fQOyNRM0QD— DogeDesigner (@cb_doge) May 30, 2024

Gold rates on today commodity market in various places in country
తగ్గిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..?

ఈక్విటీమార్కెట్‌లు ఇటీవల భారీగా పడిపోయాయి. దాంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. శుక్రవారం మార్కెట్‌లో స్టాక్‌సూచీలు తీవ్రఒడిదుడుకులతో చివరకు స్వల్పలాభాలతో ముగిశాయి. దాంతో బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,500 (22 క్యారెట్స్), రూ.72,550 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.200, రూ.210 తగ్గింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,200 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,650.. 24 క్యారెట్ల ధర రూ.72,700కు చేరాయి. మార్కెట్‌లో శనివారం కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Commercial Lpg Prices Slashed By Rs 69.50
తగ్గిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు!

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు శుభవార్త చెప్పాయి. హోటల్స్​, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.69 మేర తగ్గిస్తూ కీలక ప్రకటన చేశాయి. నేటి నుంచే (జూన్​ 1వ తేదీ) ఈ ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి.

Katy Perry delivering a mesmerizing performance at the pre wedding celebrations
అనంత్‌-రాధికల ప్రీవెడ్డింగ్‌ వేడుకలో కాటిపెర్రీ పెర్ఫార్మెన్స్

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సెన్సేషన్ కాటి పెర్రీ చేసిన లైవ్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెర్రీ సిల్వర్‌కలర్‌లో శరీరాన్ని హత్తుకుని ఉండే దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంది. తనతోపాటు ఈ ఈవెంట్‌లో పాల్గొన్న తన ట్రూప్‌ తెల్లటి దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలను అలరించారు.ముఖేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌-రాధికల రెండో ప్రీవెడ్డింగ్‌ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. క్రూయిజ్‌షిప్‌లో జరిగే ఈ వేడుకలో దాదాపు 900 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్‌కు సుమారు 4,380 కిలోమీటర్లమేర క్రూయిజ్‌ ప్రయాణం సాగుతుంది.అనంత్‌ అంబానీ-రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఈ ఏడాది మార్చినెలలో ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో మెటా ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న వంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ తన కుమారుడు, కోడలు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ గతంలోనే నివేదించింది.ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్‌ వాహన ధరలు.. ఎంతంటే..సంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ జంట ముంబైలో జులై 12న వివాహం చేసుకోనుంది. జులై 12 శుక్రవారం రోజున శుభ వివాహ వేడుకతో పెళ్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14 ఆదివారం రోజు జరిగే మంగళ్ ఉత్సవ్, వివాహ రిసెప్షన్‌తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.Katy Perry performing Firework at Cannes tonight! pic.twitter.com/MafEP3OJGP— Katy Perry Today (@todaykatyp) June 1, 2024

Medium to heavy e-trucks are likely to be a part of a new subsidy scheme FAME-III
భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్‌ వాహన ధరలు.. ఎంతంటే..

ఎలక్ట్రానిక్‌ ట్రక్కుల ధరలు భారీగా తగ్గనున్నాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటి ధరలో కనీసం 20-25శాతం సబ్సిడీ లభించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఫేమ్‌3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మధ్యస్థం నుంచి భారీ ఎలక్ట్రానిక్‌ ట్రక్కులపై రాయితీలు ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి. ఈమేరకు ఏడాది చివర్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడనుందని కొందరు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.మీడియా కథనాల ప్రకారం..ప్రభుత్వం కొత్త సబ్సిడీ స్కీమ్ ఫేమ్‌3ను ఈ ఏడాది చివర్లో తీసుకురానుందని అంచనా. ఇందులో హెవీ ఎలక్ట్రానిక్‌ ట్రక్కులపై 20-25శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ-ట్రక్కుల ధర మార్కెట్‌లో రూ.70లక్షలు నుంచి రూ.90 లక్షలుగా ఉంది. ఒకవేళ అంచానాల ప్రకారం ప్రభుత్వం ఫేమ్‌3లో వీటి రాయితీపై నిర్ణయం తీసుకుంటే వాహనదారులకు భారీగా లబ్ధి చేకూరుతుంది. అయితే హైబ్రిడ్ ప్యాసింజర్ వాహనాలను ఈ సబ్సిడీ పరిధిలోకి తీసుకురాకూడదని చర్చలు జరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: యువతను ఆకర్షిస్తున్న ఫేస్‌బుక్‌ఫేమ్‌3 పథకానికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ పథ​కంలో భాగంగా ఎలక్ట్రానిక్‌ వాహనాల కొనుగోలు పెంచేందుకు వాహనదారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ మొబిలిటీ మిషన్‌ ప్లాన్‌(ఎన్‌ఈఎంఎంపీ)లో ఉన్న ఫేమ్‌ ఇండియా1ను 2015, ఏప్రిల్‌1 నుంచి మార్చి 31, 2019 వరకు కొనసాగించారు. ఇందుకోసం రూ.895 కోట్లు కేటాయించారు. ఫేమ్‌2ను మార్చి 31, 2024 వరకు దాదాపు రూ.10వేల కోట్లుతో తీసుకొచ్చారు. ఇందులో ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్, ఇ-రిక్షాల కొనుగోళ్లపై వినియోగదారులకు సబ్సిడీ అందించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఫేమ్‌3ను ప్రారంభించనున్నట్లు తెలిసింది.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all
 

Business exchange section

Currency Conversion Rate

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 98000.00 98000.00 -2000.00
Gold 22K 10gm 66500.00 66500.00 -200.00
Gold 24k 10 gm 72550.00 72550.00 -210.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name Rate Change%
Emkay Global Financial Services Ltd 174.7 13.5891
Ramco Systems Ltd 340.9 19.993
Sadbhav Engineering Ltd 34.85 -9.9483
Dangee Dums Ltd 7.95 -11.6667
Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement